Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-28-Sri-Sai-2-by-Lakshmi-Prasanna 4:33
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
ఓం సాయి శ్రీసాయి జయజయసాయి – 2వ భాగం
(నిన్నటి సంచిక తరువాయి భాగం)
శంకరయ్యగారు బస్సు ఎక్కిన తరువాత విచిత్రంగా జరిగిన ఈ సంఘటనని ఒక్కసారి తిరిగి గుర్తుకు తెచ్చుకున్నారు. తాను కలుసుకొన్న ఫకీరు సాయిబాబా అయివుండవచ్చనిపించింది. తనకు జరిగిన అనుభవాన్ని ఆయన ప్రసాద్ గారికి వివరించి చెప్పారు. ప్రసాద్ గారు చాలా ఆనందపడ్డారు.
అదే రోజు సాయంత్రం శివనేశన్ స్వామీజీ గారికి, దత్తఘడ్, కల్లూర్ కి అత్యంత సన్నిహితులయిన ప్రియనాధ్ గుప్తాజీగారు శంకరయ్యగారిని చూడటానికి వచ్చారు. ఆయన కూడా, వచ్చినది మరెవరో కాదు, సాయిబాబాయే అని నిర్ధారించి చెప్పారు. ఆయన మన్మాడ్ అనే పదానికి అర్థం వివరించి చెప్పారు.
మన్మాడ్ అనగా ‘మన్ (మనస్సు)’, మార్ (చంపు) అని అర్ధం. అనగా దాని అర్ధం ఎవరయినా షిరిడీని దర్శించుకోవడమంటే, వారు నిష్కళంకమయిన భక్తితో తమ మనస్సును చంపుకోవడమే. (ఇక్కడ మనసును చంపుకోవడమంటే మనసులో ఎటువంటి కోరికలు లేకుండా ఉండటం) (కోపర్గాఁవ్ లో కోపర్ అనగా స్వచ్ఛమయిన కొబ్బరికాయ.) 9 మైళ్ళు అనగా నవవిధ భక్తి. ఫకీరు సంభాషణ ప్రారంభించేముందే తాను బిచ్చగాడిని కానని సూచనప్రాయంగా తెలియచేసినప్పటికీ, శంకరయ్య గారు ఆయనే బాబా అని గుర్తించలేకపోయారు.
ఈ సంఘటన జరగడానికి ముందే, నిర్ణయించుకున్న ప్రకారం శంకరయ్యగారు మరునాడు షిరిడీ వెళ్ళారు. ఎప్పటిలాగే ఆయన ఎక్కువ సమయం శివనేశన్ స్వామీజీతో గడిపారు.
మధ్యాహ్న ఆరతి పూర్తయిన తరువాత శివనేశన్ స్వామీజీగారు, ద్వారకామాయిలో గుఱ్ఱం విగ్రహం వద్ద సగంవరకు కాలిన అగరువత్తులను ఏరుతున్నారు. అలా ఏరుతూ స్వామీజీ, “మన్మాడ్ అంటే నీమనసును చంపుకోమని అర్ధం” అని వివరించి చెప్పారు. శంకరయ్యగారికి నోట మాట రాలేదు. తను క్రిందటి రోజు జరిగిన విషయమేమీ ఆయనతో చెప్పలేదు.
శంకరయ్యగారు స్వామీజీని కౌగిలించుకొని కళ్ళవెంట నీరు కారుతుండగా గట్టిగా అరిచారు, “రైల్వే స్టేషన్ వద్ద నేను కలుసుకున్నది, ఆయన సాయిబాయేనా???!!!”
శంకరయ్యగారికి మాయ తొలగిపోయింది. వచ్చినది బాబాయేనని గుర్తించలేక ఆయన పాదాలముందు సాగిలపడి నమస్కారం చేయలేకపోయిందుకు విచారించారు. “అత్యుత్తమ ఆధ్యాత్మిక వ్యక్తులు కూడా భగవంతుడే మానవరూపంలో తమ ఎదుట కనిపించినా గుర్తించలేరు. వారితో పోల్చుకుంటే నువ్వు లెక్కలోకే రావు. నువ్వేమీ బాధపడనవసరంలేదు” అని స్వామీజీ అన్నారు.
ఫకీరు ముందే చెప్పినట్లుగా కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది. వచ్చిన వారంతా కూడా “నభూతో నభవిష్యతి” అని ప్రశంసించారు. శంకరయ్యగారి మాటలలో, “నా జీవితంలో ఇవి మధురమైన క్షణాలు. బాబాకే స్వయంగా నేను నాలుగు అణాలు యిచ్చినందుకు నేనెంతో తృప్తిని నామదిలో నిక్షిప్తం చేసుకొన్నాను”.
బాబా సశరీరులుగా ఉన్నకాలంలోనూ, నేటికీ, ఆయన మనకేది తెలియచెప్పదలచుకున్నారో, ప్రతి లీలా మనకు బోధపరుస్తుంది. మానవుడు ప్రతిపాదించిన దానిని దైవం పరిష్కరిస్తాడని తెలియచేస్తుంది పైన చెప్పిన సంఘటన. బాబా సమాధి అయిన తరువాత కూడా, తాను మాట ఇచ్చినట్లుగానే, తన బిడ్డలు వేయిమైళ్ళ దూరంలో ఉన్నాసరే ఆర్తితో అర్ధించిన వెంటనే ఆయన వారి రక్షణ కోసం వస్తారు. ఎవరికయితే గుండెలోతులోనుంచి బాబా స్పందన వస్తుందో అది బాబా యొక్క హృదయపూర్వకమయిన ఆశీర్వచనము. అటువంటి బాబా భక్తుడు ధన్యుడు.
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333,
Latest Miracles:
- ఓంసాయి శ్రీసాయి జయజయసాయి -1వ భాగం—Audio
- మానవ జీవితానికి శ్రీసాయి సందేశాలు – 2వ.భాగం
- శ్రీసాయి తత్వం – 2వ.భాగం
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 8వ.భాగం (ఆఖరి భాగం)
- శ్రీసాయి సత్ చరిత్ర – తత్వం – అంతరార్ధం – 7వ.భాగం
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments