Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
This Audio has been Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-35-Heart-by-Lakshmi-Prasanna 2:51
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
హైదరాబాద్ కి చెందిన సాయి భక్తుడు శ్రీ.చన్నబాసాప్ప గారి అనుభవం:
ఈ సాయి లీలా 2014 నవంబరు 7న హైదరాబాద్ లో జరిగింది. శ్రీ. చన్నభాసప్ప క్రైం బ్రాంచ్ లో ఒక ఆఫీస్ అసిస్టెంట్ గా పని చేసి ఇటీవలే రిటైర్ అయ్యారు.
అతను 1995లో మొదటిసారి షిర్డీని సందర్శించాడు. ఆ సమయంలో అతనికి తీవ్రమైన ఆస్తమా రోగం ఉంది. సాయిబాబా దర్శనం చేసుకుని షిర్డీ నుండి తిరిగి వచ్చాక అతనికి ఆస్త్మాకి సంబంధించి ఎలాంటి సంకేతాలు లేవు, పూర్తిగా నయమైపోయింది.
ఇది శ్రీ.చన్నాబాసాప్ప జీవితంలో పెద్ద మలుపు.
దానితో అతను షిర్డీ సాయిబాబా యొక్క గొప్ప భక్తుడిగా మారిపోయాడు. అతను రామేశ్వరం,
బద్రీనాథ్, కేదార్నాథ్, శ్రింగేరి మొదలైన పవిత్ర స్థలాలను సందర్శిస్తూ హైదరాబాద్ కి చెందిన తన గురువు గారు నిర్వహించే హోమాలలో పాల్గొంటు ఉండేవాడు.
నవంబరు 2014లో, అతను హృదయంలో కరోనరీ ఆర్టరీ బ్లాకులు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
సాధారణంగా గుండెకు రక్తం సరఫరా జరగకుండా ఈ బ్లాకులు నిరోధిస్తున్నాయని యెంత త్వరగా వెలితే అంత తొందరగా ఆపరేషన్ చేయవలసి ఉంటుందని కూడా డాక్టర్స్ చెప్పారు.
సమర్దులైన వైద్యులు చాలా పరీక్షలు నిర్వహించి. 2014 నవంబరు 7న ఆపరేషన్ చేయడానికి తేదీని నిర్ణయించారు.
ఈ సమయంలో శ్రీ.చన్నభాసప్ప తన హృదయ సమస్యను పరిష్కరించమని బాబాకి ప్రార్థన చేస్తూనే ఉన్నారు.
శస్త్రచికిత్స రోజున వైద్యులు ఆపరేషన్ థియేటర్ కి శ్రీ.చన్నబాసప్పను తీసుకొని వెళ్లి ఆపరేషన్ కి సిద్ధమయ్యారు. ఆపరేషన్ ప్రక్రియలో భాగంగా వైద్యులు ఆపరేషన్ లో పాల్గొనడానికి ముందు మరో చివరి పరీక్ష నిర్వహించారు.
అప్పుడు వైద్యులు ఆశ్చర్యపడేలా, టెస్ట్ యొక్క రోపోర్ట్ ప్రతికూలంగా వచ్చింది, కరోనరీ ఆర్టెరీస్ బ్లాకులు ఉన్న చిహ్నాలు ఏమి చూపించలేదు!
అందువల్ల వైద్యులు శ్రీ.చన్నబాసప్పను ఏ ఆపరేషన్ చేయకుండానే డిశ్చార్జ్ చేయాలనీ నిర్ణయించుకున్నారు. కానీ కొన్ని మందులు తీసుకోవాలని సలహా ఇచ్చారు.
(source: http://www.saiamrithadhara.com/mainhome.html {శ్రీకాంత శర్మ గారికి శ్రీ.చన్నబాసప్ప గారు 12 నవంబరు 2014 న వివరించారు}).
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- ఆమె జీవితం బాబా యొక్క బహుమతి
- ప్రధమ చిత్ర సాహిత్య ప్రదర్శన…..సాయి@366 నవంబర్ 9….Audio
- సాయీ నీలీలలు వర్ణించ తరమా?–Audio
- సుధా మాధవి గారి తండ్రి కి సాయి చేసిన ఆపరేషన్–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments