Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా ఫిబ్రవరి 13 (1912)న ”భగవంతుని మీద దృఢమైన విశ్వాసం ఉన్న వాళ్ళెవరూ ఏదీ కోరరు” అన్నారు.
బాబా దేనిని కోరలేదు. సాయి బాబాయే కాదు, ఇతర మహాత్ములు కూడ భగవంతునిపై విశ్వాసాన్ని ఉంచుకున్నారే గాని దేనినీ కోరలేదు.
మహాత్ములు ఎప్పుడూ ఎవ్వరినీ ఏదీ కోరరు. కోరిక అనటంతోనే నోటితో ప్రార్ధించటం లేదా అర్ధించటమే అనుకోరాదు. వ్యక్తి ప్రవర్తన కూడ పరిగణలోనికి తీసుకోవాలి.
శాహాసుజా ధనవంతుడు. ఇస్లాం మత సిద్ధాంతాలను అనుసరించే వాడు. కానీ జీవనం మాత్రం ఫకీరుగానే సాగించాడు. కనబడటం అలా కాదు, ధనవంతుని లాగానే.
ఆయనకు అందమైన కుమార్తె ఉన్నది. ఆమెను వివాహం చేసుకోవానికి చక్రవర్తి కూడ సిద్ధపడ్డాడు. మూడు రోజులు సమయం అడిగాడు శాహాసుజా ఏ సంగతి చెప్పాటానికి.
శాహాసుజా వంటిదే ఆయన కుమార్తె. ధనంలో సుఖం లేదని ఆమెకు తెలుసు శాహాసుజా ఆ పట్టణంలోని మసీదులన్నీ వెదకసాగాడు దైవ భక్తి గల అల్లుని కోసం.
ఒక చోట భావయుక్తంగా నమాజ్ చదువుతున్న ఒక యువకుడు తారసిల్లాడు.
ఖురాన్ పఠన మయిన తర్వాత, శాహాసుజా అతనితో మాట్లాడటం మొదలు పెట్టాడు. చివరకు ”నీకు పెండ్లి చేసుకోవాలని లేదా?” అని ప్రశ్నించాడు.
ఆ యువకుడు ”నాకు పిల్ల నెవరిస్తారు?” అన్నాడు. ”సరే! అయితే నా కూతురును ఇచ్చి వివాహం చేస్తాను” అన్నాడు. అనటమే కాదు వివాహం కూడ జరిపించాడు.
భార్యతో తన కుటీరానికి వెళ్ళాడు యువకుడు. ఒక మూల జల పాత్ర, ఎండిన రొట్టె ఉన్నాయి.
”ఇదేమిటి? ఈ రొట్టె ఇక్కడెందుకున్నది?” అని అడిగింది అప్పుడే పెండ్లయి వచ్చిన ఆమె.
”రేపిటికి తినానికి పనికి వస్తుందని ముందు జాగ్రత్తగా ఉంచాను” అన్నాడు భర్త.
ఆమె చాలా నిరాశకు లోనైంది. ”మా తండ్రి గారు ఇరవై సంవత్సరాలు నన్ను పెంచి పోషించి దేవునిపై పూర్తి భకి శ్వాసములు కలవానికి నన్ను ఇచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు.
కానీ దేవుడు రొట్టె ఇస్తాడని నమ్మకం నీకు లేదు. అందుకే రొట్టెను దాచి ఉంచావు” అన్నది ఆమె.
ఆ మాటలు విని ఆ భర్త స్తబ్దుడయ్యాడు. వెంటనే రొట్టెను ఎవరికో దానం చేసి వచ్చాడు.
భగవంతునిపై ఆ మాత్రం విశ్వాసం పెట్టని తన నడవడికి పశ్చాత్తాప పడ్డాడు అతను.
భగవంతునిపై విశ్వాసం ఉన్నవారు ఏదీ కోరరు, దాచుకోరు, చింత పెట్టుకోరు.
ఆర్చేది తీర్చేది ఆ భగవంతుడే. ఈ నమ్మకంతో జీవిస్తే భగవంతుడే అన్నీ తీరుస్తాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సోదరా! నన్ను మరచిపోకు!! …..సాయి@366 ఆగస్టు 13….Audio
- వీడ్కోలు పలుకులు …..సాయి@366 జూలై 13…Audio
- కాలదర్ప దమనుడు…..సాయి@366 అక్టోబర్ 13…Audio
- సాయి మహమ్మదీయుడా? ……సాయి @366 ఫిబ్రవరి 6….Audio
- తప్పు ! ….. సాయి@366 ఫిబ్రవరి 22….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments