నిదర్శనం కోసం దర్శనం…. సాయి@366 ఫిబ్రవరి 15….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా ”ఫొటో రూపంలో నీ ఇంటికి వచ్చాను. ఇక నా అనుమతి లేనిదే షిరిడీకి రావద్దు” అనే సందేశాన్ని పంపాడు.

15 ఫిబ్రవరి సాయంత్రం సాధుభయ్యా (సదాశివ డూండీ రాజ్‌) హార్దాలో తన మిత్రులతో నడుస్తున్నాడు.ఆయనకు ఎదురుగా సాయిబాబా వచ్చి ఆయన చేతిలో పన్ను కుట్టు పుల్లనుంచి అదృశ్యమయ్యాడు.

ఈ దృశ్యాన్ని అక్కడున్న వారందరూ చూచారు.

వారిలో సాయిని విశ్వసించని వారొకరున్నారు.

ఆ అవిశ్వాసి ”ఇపుడేమి జరిగినది?” అని ప్రశ్నించాడు.

సాధుభయ్యా: ఇది సత్యము. మనము వచ్చునప్పుడు నా చేతిలో పన్ను కుట్టు పుల్ల లేదు. ఇపుడు ఒకటి నా చేతిలో కలదు.

సాయిబాబాయే నాకిచ్చాడు. అవిశ్వాసికి సంశయము సహజమే. నమ్మిన వారు సాయి లీలలకు సంతసించారు.

”ప్రేమతో భక్తు నన్ను పిలచిన మాత్రమున ప్రత్యక్షమగుదును. నా ప్రయాణానికి ఎటు వంటి వాహనము అక్కరలేదు”. అనునది సాయిబాబా వాక్కు. దానిని రుజువు చేయుటకు ఇదియే సాక్ష్యము..

శ్యామా నుండి సాధుభయ్యాకు షిరిడీకి రమ్మని ఉత్తరం వచ్చింది.

సాధుభయ్యా ఏ మాత్రం ఆలస్యం చేయకుండ షిరిడీ వెళ్ళి సాయిబాబాను దర్శించుకున్నాడు.

హార్దాలో జరిగినదంతా అక్కడ ఉన్న వారికి చెప్పాడు సాధుభయ్యా.

”దీనినంతయు బడే బాబాకు చెప్పు” అని సాయిబాబా ఆదేశించగా, సాధుభయ్యా వెళ్ళి బడే బాబాకు అక్కడనే ఉన్న డాక్టరు పిళ్లే మొదలైన వారికి హార్దాలో సాయి ప్రత్యక్షమై పన్ను కుట్టు పుల్లను ఇచ్చిన వైనాన్ని సవిస్తరముగా వివరించాడు.

దానిని వినిన బడే బాబా చకితుడైనాడు. సాయి బాబా వద్దకు పోయి విలపించసాగాడు.

”ఏమి? బాబా! నీ వెంతసేపు నాకు ధనము మాత్రమే ఇచ్చుచుంటివి.

కానీ, సాధుభయ్యాకు సాక్షాత్కారమును ప్రసాదించితివి” అని బడే బాబా దుఃఖించగా సాయిబాబా ”ఏమి చేయగలను? ఎవరు కోరునది వారు పొందుచున్నారు” అన్నారు.

సాయి ఇచ్చిన ధనాన్ని పొందాడు. దానిపై పన్ను కూడ చెల్లించాడు బడే బాబా.

చివరకు ధనమంతయూ హరించిపోగా ఏమీ లేని అనాధగా తనువు చాలించాడు.

ధనము మొదలైన విషయములను పదే పదే కోరుకొను వారికి బడే బాబా ఉదంతము ఒక చక్కటి ఉదాహరణ.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “నిదర్శనం కోసం దర్శనం…. సాయి@366 ఫిబ్రవరి 15….Audio

Sai Baba

Sai Baba….really your ways are inscrutable….Sai Baba

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles