సాయియే శివుడు…. సాయి@366 ఫిబ్రవరి 16….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


శివునిగా సాయినీ పూజించిన మేఘుడు సాయీశ్వరునిలో ఐక్యమయ్యాడు 1912 సంవత్సరంలో.

అయినా మేఘుని మరణంతో కాలచక్రం ఆగిపోలేదు. మేఘుని వంటి భక్తి కలిగితే చాలనుకుంటారు అందరూ.

అది ఫిబ్రవరి 15 తారీకు (1912). మరునాడు అంటే 16వ తారీకు మహా శివరాత్రి.

ఆ శివరాత్రికి కోపర్గాం వెళ్ళి గంగలో (గోదావరిలో) స్నానం చేద్దామని బాపుసాహెబ్‌ జోగ్‌, అతని భార్య, ఖపర్దే భార్య, వారి పిల్లలు అను కున్నారు.

షిరిడీ పొలిమేరలు దాటాలంటే సాయి అనుమతి అవసరము.

అందుకని వారందరు 15వ తేదీన సాయి వద్దకు వెళ్ళి అనుమతిని వేడగా సాయిబాబా వారికి అనుమతిని ఇవ్వలేదు.

అయినా వారందరూ  పట్టుపట్టి సాయి అనుమతిని సంపాదించుకున్నారు.

సాయి అంగీకరిస్తే చాలు, ఇక కోపర్గాం వెళ్ళి  గంగలో స్నానం చేసి, ఈశ్వరుని దర్శించటం మన చేతిలో పనిగా వారు భావించారు.

ఆ పరిస్థితులలో  వారే కాదు, ఎవరైనా అలాగే భావిస్తారు. తెల్లవారింది….

ఆ నాడు మహాశివరాత్రి. కోపర్గాం పోదామనుకున్న వారంతా కలుసు కున్నారు కోపర్గాం పోవాటానికి, కాని ఆ సమయంలో వారికి ఏ బండీ దొరక లేదు.

అదే విచిత్రం. రోజూ దొరికే బండ్లు  ఆ రోజు దొరక లేదు ఎంతో సేపు వేచి చూచినా గాని. వారికి విసుగు పుట్టి  చివరకు ప్రయాణాన్నే మాను కున్నారు.

అలాగే పండరీపురం పోయి పాండురంగని దర్శిద్దాం అనే భక్తులకు కూడ అంత దూరం పోనవసరం లేకుండా తానే పాండురంగినని దృష్టాంతం ఇచ్చాడు  సాయి.

ఎంతో కస్టపడి కోపర్గాం పోదామనుకున్న వారికి అంత శ్రమ అవసరం లేదని తానే ఈశ్వరుడనని తెలియ చేయుటకే వారికి బండి దొరకకుండా చేశాడు సాయి.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles