Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయిబాబా సజీవంగా ఉన్నప్పుడు ఎందరో దర్శించుకునే వారు.
వారు కోర్కెలతో వచ్చిన సామాన్యులే కాదు, మాన్యులు కూడా వచ్చే వారు కోర్కెలు లేకుండా.
ఆనందనాథ్ మహారాజ్ ఒకసారి సావర్గాంకు వెళ్ళాడు.
ఆ సత్పురుషుని దర్శించుకోవానికి మాధవరావు, బసంత్ దేశ్‌పాండే, నందరాం శివరాం మార్వాడీ మొదలైన వారు వెళ్ళారు.
దర్శనం అయ్యాక వీరంతా షిరిడీకి బయలు దేరుతున్నప్పుడు ఆనందనాథ్ మహారాజ్ అకస్మాత్తుగా పరుగున వచ్చి, వారి బండిలో కూర్చుని సాయినాధుని దర్శించటానికి వచ్చాడు.
అయితే అక్కడి ప్రజలకు మహారాజ్ షిరిడీ వెళ్ళటం ఇష్టం లేదు.
అందుకని వారు మహారాజ్‌ను ఆపుదామని విశ్వ ప్రయత్నం చేశారు.
అయినా ఆనందనాధులు అంగీకరించలేదు.
మాధవరావు మొదలైన వారితో షిరిడీకి వచ్చి సాయిని దర్శించి ”వీరు (సాయిబాబా) రత్నం. వీరి నిజమైన వెల మీరు ఎరుగరు” అన్నారు.
షిరిడీ వాసులు ఆనందనాథ్ దర్శనార్థం వేరే గ్రామానికి వెళ్ళేవారు.
కాని ఆనందనాథ్లే షిరిడీకి వచ్చి బాబాను దర్శించటం విశేషం. ఎంతైనా పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు కదా!
ముక్తానంద సద్గురువు కోసం భారతావని నలు మూలలా, 18 ఏండ్ల పాటు, మూడు సార్లు పర్యటన గావించాడు.
కాని ప్రతి ఒక్కరిలో ఏదో లోపం కనిపిస్తూనే ఉన్నదాయనకు. చివరకు నిత్యానందను గురువుగా స్వీకరించాడు.
నిత్యానందుల వారి కటాక్షం వల్ల ముక్తానందకు అంతర్జాతీయ కీర్తి వచ్చింది.
ఆయన ఫిబ్రవరి 18, 19 (1978) తేదీలలో షిరిడీ చేరి సాయిని దర్శించారు. ఆ రెండు రోజులు షిరిడులో కోలాహలంగా మారింది.
కారణం ముక్తానంద ఒక్కడే రాలేదు ఆయనతో పాటు 2000 మందితో వారిలో సుమారు 600 మంది అమెరికన్లు (ఆడ, మగ) ఉన్నారు.
ఆయన బూటీవాడలో ఆరతులకు భక్త బృందంతో హాజరయ్యారు.
19వ తేదీన లెండీ బాగులోని దత్త మందిరంలో కలశస్థాపన చేశారు. అక్కడే దీప గృహాన్ని ప్రారంభించారు.
భోజన గృహానికి, సాయి ఉద్యాన్‌లోని ధర్మశాలకు శంకుస్థాపన చేశారు.
సాయినాధుని ఆసుపత్రిలోని ప్రత్యేక గదులకు శంకుస్థాపన చేశారు.
సాయి బాబా అనే వారు – ”ఇక్కడ షిరిడీలో నా వాళ్ళు చీమల్లాగా చేరుతారు” అని.
అది సత్యమే. కుగ్రామమైన షిరిడీకి ఒకేసారి ముక్తానందతో 2000 మంది దేశ, విదేశీయులు రావటం సాయి మాటలకు ఒక ఉదాహరణ మాత్రమే.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- షిరిడీ పెరటిలోని చెట్టు…..సాయి@366 జూన్ 19….Audio
- ఇ.ఎన్.టి. స్పెషలిస్ట్ ….. సాయి @ 366 ఫిబ్రవరి 3….Audio
- సతీ అనసూయ మాత …..సాయి@366 మే 5….Audio
- నిదర్శనం కోసం దర్శనం…. సాయి@366 ఫిబ్రవరి 15….Audio
- “నా మైనా” ……సాయి@366 ఫిబ్రవరి 4…..Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments