గ్వాలియర్, గోవా రాజపరివారం వాళ్ళు ఇప్పటికి సాయి బాబా భక్తులే



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మరాఠీ వంశానికి చెందిన చంద్రోజీ రాజె మామగారు గోవా రాజ కుటుంబానికి చెందిన సర్దార్ రాణే.అయన కు అయిదు మంది అమ్మాయిలు.

వాళ్ళ అమ్మాయిల పెండ్లి గురించి అయన ఎప్పుడు చింతిస్తూ వుండేవారు. అయన ఆ రోజుల్లో సాయిబాబా వారి కీర్తి ప్రతిష్టలు విని తన కూతుర్ల వివాహం గురించి అడిగే దానికి శిరిడీ వెళ్ళాడు.

ఆ కాలంలో జనాలకు కష్టాల్లో ఏ మార్గం దొరక కుంటే అందరూ శిరిడీ కి మార్గం కట్టేవాళ్ళు(బాల గంగాధర్ తిలక్ మన దేశ స్వరాజ్యం మొదలు రాజవంశం వాళ్ళు కూడా బాబానే ఆశ్రయించే వాళ్ళు).

గోవా నుంచి ఆ రాజ కుటుంబం సాయిబాబా దగ్గరికి వచ్చింది. అయన ద్వారకామాయి లో బాబా దర్శనానికి వెళ్ళాడు.

బాబా ధుని ముందు నుంచొని ఎదో ఆలోచనలో వున్నారు. ఆ దృశ్యం చూసిన రాజుకు శరీరం రోమా చింతం అయింది, మూర్తిభవించిన దైవత్వం అక్కడే వుంది అనిపించింది.

కానీ బాబా ఆ రాజు వైపు చూస్తు ఎందుకు వచ్చావు ఇక్కకిడి, వెంటనే వెళ్ళిపో అని కోపంగా చేయి బైటకు వేళ్ళు మార్గం వైపు చూపిస్తు అన్నారు.

సాయి బాబా, సర్దార్ రాణా కు వెంటనే శిరిడీ వదిలిపెట్టి వెళ్ళిపో అని ఆదేశం ఇచ్చారు.

బాబా ఆదేశాన్ని విని ఆ రాజు ఆలా రాయిలా నిలబడిపోయారు. అసలు శిరిడీ రావడానికి కారణమే తన పిల్లల పెళ్ళి గురించి అడిగి, ఆశీర్వాదం తీసుకొని వెళ్దాం అని గోవా నుంచి వచ్చాడు, చూస్తే బాబా వెంటనే తిరిగి వెళ్ళి పోండి అంటున్నారు.

అసలు వచ్చిన సంగతి కూడా ఇంకా చెప్పలేదు, అని దుఃఖంతో శిరిడీ వదలి పెట్టి గోవా తిరుగు ప్రయాణం కట్టారు.

అయినా గోవా నుంచి వచ్చాను, కనీసం ఒక నమస్కారం దూరం నుంచి అయినా పెట్టి వెళ్తాను, అనుకొని సాష్టాంగ నమస్కారం పెట్టాడు.

అప్పుడు బాబా అన్నారు. ” అల్లా నీ మనసులో వున్న కోరిక తీరుస్తారు. వెంటనే వెళ్ళిపో అన్నారు.

అక్కడ గోవాలో రాజుగారి రాజ్ మహల్ లో గ్వాలియర్ రాజు యొక్క మంత్రి, గోవా రాజకుమారిని చూసి, తన యువరాజు మాధవరావ్ షిండే కోసం పెళ్ళి ప్రస్తావన తీసుకొని వచ్చాడు.

గోవా రాజు శిరిడీ వెళ్ళాడని, అతడు వచ్చే వరకు వుండాలని నిశ్చయించుకొన్నారు. ఎదురు చూస్తు వుండగానే శిరిడీ నుంచి గోవా రాజు తిరిగి వచ్చాడు.

గ్వాలియర్ మంత్రి తన కూతురిని మాధవరావ్ షిండే కి ఇచ్చి పెళ్ళి చేయాలని వచ్చాడని విని గోవా రాజు సంతోషంతో అప్పుడు అనుకున్నాడు “బాబా తనను వెంటనే ఎందుకు వెనక్కు వెళ్ళమన్నారని.” బాబా యొక్క త్రికాల జ్ఞానాన్ని చూసి రాజు ఆశ్చర్య చకితుడయ్యాడు.

గ్వాలియర్ మంత్రి తన రాజా కుమారుని కోసం గోవా రాజు యొక్క రెండవ కూతురుని ఎంపిక చేసాడు. ఆమె పేరు గజరాబాయి.

తన రెండో కూతురికి ముందు పెళ్ళి అయితే, పెద్ద కూతురిని ఎవరు చేసుకుంటారు? రాజ వంశానికి అప్రతిష్ట వస్తుంది” అనుకోని గోవా రాజు మళ్ళీ విచారిస్తు కూర్చున్నాడు.

అప్పుడు గోవా రాజు మళ్ళీ బాబానే మనసులో ప్రార్ధించాడు, ఇది ధర్మ సంకటం,  బాబా ఎలా చేయను? అనుకున్నాడు.

ఇంతలో బాబా వాణి “నువ్వు నీ కూతుర్లు అందరిని గ్వాలియర్ కు పెండ్లికి తీసుకెళ్ళు , అదే సర్దుకుంటుంది” అని వినవచ్చింది.

సరే అనుకోని అంతా భారం బాబా మీద వేసి, తన అయిదు మంది కూతుర్లు, అన్య బంధువులతో కలిసి గ్వాలియర్ వెళ్ళారు.

మాధవరావ్ షిండే, గజరాబాయికి పెళ్ళి చాల ఘనంగా జరిగింది.

ఇంతలో ఆయన పెద్ద కూతురికి సర్దార్ షిలోతే తో, మూడవ కూతురికి చంద్రోజీ రాజ్ తో, నాలుగో కూతురికి సర్దార్ గుజర్ తో,అయిదో కూతురికి సర్దార్ మహతి తో అయిపోయింది.

ఒక్క కూతురి పెండ్లి చేయాలని వెళ్ళిన రాజు అయిదు మంది కూతుర్ల పెండ్లి చేసి వచ్చాడంతె.

సాయి బాబా కృపా కటాక్షమే అని మనసా, వాచా, కర్మణా నమ్మినాడు. రోజులు గడిచే కొద్ది గోవా రాజపరివారం బాబాకు పరమ భక్తులు అయ్యారు.అందరు శిరిడీ కి వెళ్ళేవాళ్ళు. బాబా దర్శనం చేసుకొనే వాళ్ళు

సర్దార్ రాణే మూడో కూతురు లక్ష్మీబాయి వాళ్ళ తొమ్మిదవ వంశం రఘజీ కి నానమ్మ అవుతుంది. ఈ వంశ పరంపర వాళ్ళు ఎలా బాబా భక్తులు అయ్యారనే విషయాలన్నీ స్వయంగా వాళ్ళ తొమ్మిదవ వంశానికి చెందిన రఘుజి రాజే ద్వారా తెలిసాయి.

సుధాకర్ లాడ్
రాయగఢ్

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

5 comments on “గ్వాలియర్, గోవా రాజపరివారం వాళ్ళు ఇప్పటికి సాయి బాబా భక్తులే

Madhavi

Rajakeeyam nunchi rajarikam..Varaku..Baba ne sarva raksha.. Gwalior raaju nunchi.balagangadhar thilak..Varaku.andharu shirdi margam pattaru..Sreenivas murty garu..Thank u very much sir..Sairam.

TV Gayathri

Sarvam sainadhude. Anni samasyalu aayane theerustharu.om namo sainadhayanamaha

Rohith T V

Om Sai Ram!

Prathibha sainathuni

Tana biddalaki eappudu eamicheyali eami ivvali ani babaki,gurugariki baaga telusu.. Ealanti Paris titulani aina tana biddalaku anukulangaamarchi Vallu chupinche prema mundu eadaina digadupe…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles