నిదురపోరా, శ్రీధరా! …. మహనీయులు – 2020… ఏప్రిల్ 26



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


భక్తి మార్గాన్ని ప్రోత్సహించే సాయిబాబా మహాయోగి కూడా.

తెలుగువారి మహా భక్తురాలు, యోగిని. రచయిత్రిగా విఖ్యాతి చెందింది తరిగొండ వేంగమాంబ (తరికుండ వెంకమాంబ).

వేంగమాంబకు ఎనిమిదేండ్ల వయస్సులో నృసింహమూర్తి స్వప్నమున సాక్షాత్కరించి ఉపదేశం చేశాడు.

ఆ నరసింహునే వరునిగా భావించింది … మరొక అభిప్రాయం ప్రకారం ఆమె తన భర్తతో శోభనపు రోజున తన శరీరాన్ని మనసును వేంకటేశునికి అంకితం చేశాను కనుక తననుండి శారీరక సుఖం కొరవద్దని చెప్పింది.

ఆ దిగులుతో అతను తన స్వగృహంలోనే మృతుడయ్యాడు.

ఇక ఆ బాల వితంతువు తండ్రి అనుమతితో మదనపల్లిలో రూపావతారం సుబ్రహ్మణ్య శాస్త్రిగారిని గురువుగా భావించి యోగ, కవిత్వములను నేర్చింది.

ఇక ఆమె ఊరు సద్దుమణగిన పిమ్మట ఆంజనేయ విగ్రహం చాటున యోగ సమాధిలో ఉండేది.

ఒకసారి పూజారి ఆమెను దొంగగా భావించి బయటకు నెట్టి కొట్టినాడు. ఆమె విధవరాలు కనుక సాంప్రదాయ ప్రకారం శిరోముండనం చేయించుకోవాలని పట్టుపట్టినారు కొందరు.

ఒక మంగలి రాగా, నృసింహస్వామిని ధ్యానిస్తూ తలను వంచింది. ఆమె స్థానంలో పులి కనబడింది. భయపడి మంగలి పారిపోయాడు.

ఆమెను పరీక్షింపదలచి వచ్చిన పుష్పగిరి పీఠాధిపతి నృసింహస్వామి దేవాలయంలో విడిది చేసి, వేంగమాంబను పిలిపించారు. ఆమె వచ్చింది.

ఆమెకు, పీఠాధిపతుల మధ్య తెర ఉంది. పీఠాధిపతి ఆమెను తనకు ఎందుకు నమస్కరింపలేదన్నారు. సింహాసనం దిగి వస్తే నమస్కరిస్తాను అంది వెంగమాంబ.

ఆయన అటులనే చేశాడు. ఆమె నృసింహస్వామిని ధ్యానించి నమస్కరించింది. సింహాసనం భగ్గున మండిపోయింది. పీఠాధిపతి ఆమెను ప్రహ్లాదుని అవతారంగా కొనియాడారు.

వేంకటేశ్వరుడు, నరసింహస్వామి ఆమెకు భిన్నులుకారు.

ఆమె ఎనిమిదిమంది వ్రాయసగాళ్ళను పెట్టుకుని “ద్విపద భాగవతం” రచించింది. ఇటువంటి సంఘటన కావ్యకంఠ గణపతిముని జీవితంలోనూ చూడవచ్చును.

తిరుమలలో వేంకటేశ్వరునికి దిన కార్యక్రమములు ముగిసిన పిమ్మట ఏకాంత సేవ జరిగేటప్పుడు వెంకమ్మ కర్పూర హారతి ఇచ్చేది.

పూర్వాచారపరాయణులకు ఆమె హారతి ఇవ్వటం ఇష్టంలేదు. మరు దినం నుండి తన గృహంలోనే హారతి ఇచ్చి సంతృప్తి చెందింది.

ఒకసారి రథోత్సవ కార్యక్రమంలో, స్వామి వారి రథం వెంకమ్మ ఇంటిముందు నిలబడి కదలలేదు.

వెంటనే ఆమెను తప్పుపట్టిన వారికీ సంగతి తెలిసి ఆమెచే కర్పూర హారతి ఇప్పించారు. స్వామి రథం కదిలింది.

ఇక ఆమెచే ఏకాంత సేవలో ముత్యాల హారతిని ఇప్పించసాగారు. ఇప్పటికికూడా ఆ సేవే కొనసాగుతొంది. ఆమె మహాసమాధి చెందింది.

భారత తపాలా శాఖవారు ఏప్రియల్ 26 (2017)న తరిగొండ వేంగమాంబ స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles