Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
దామోదర్ ఘనశ్యామ్ బాబరేను అందరూ ‘అన్నా చించిణీకర్ ‘అని పిలిచేవారు . కారణం అతడు చించినీ గ్రామానికి చెందినవాడు . అతడు అతని భార్య లక్ష్మీబాయి బాబాను చాలాకాలం ఎంతో భక్తితో శిరిడీలో వుండి బాబాను సేవించారు. అతనికి 50 సం.లు దాటినా సంతానం కలుగలేదు.
ఒకనాడు శ్యామా, “బాబా! నీవెందరి కోరికలో తీరుస్తున్నావుగాని, వీరింతగా సేవిస్తున్నా ఒక్క బిడ్డను గూడ ప్రసాదించవేమి?’ అన్నాడు.
ఆయన నవ్వి, “నన్ను నిజంగా కోరితే ఎప్పుడైనా తీర్చకుండా వున్నానా? ఏమి తెలియనివాడిలా మాట్లాడతావేం? వీరేమీ అడగలేదు. వీరికి కొడుకును ప్రసాదించినా ఒక్క తరంకంటే వీరి వంశం నిలవదు. అంత కంటే కలకాలం కొనసాగే వంశప్రతిష్ట ప్రసాదిస్తాను” అన్నారు. ఆయన భావమెవరికీ అర్థంకాలేదు.
అప్పట్లో వారి పొలాలకు సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉన్నది. కోర్టు వ్యాజ్యం 3 సంuలు నడిచింది. దానిని గురించి ఎప్పుడడిగినా, “అల్లాహ్ మేలు చేస్తాడు” అనేవారు సాయి.
ఒకరోజు అతడు వ్యాజ్యంలో ఓడిపోయినట్లు ఎవరో జాబు వ్రాశారు. అది తీసుకొని దీక్షిత్ తోపాటు అన్నా కోపంతో మశీదు చేరగానే సాయి ఉగ్రులై, “ఈ ముసలాడికి నా మీద నమ్మకం లేదు, ఆ ఉత్తరం అవతల పారేయండి!” అని కసిరారు.
కొద్ది నెలల తర్వాత కోర్టువారు అన్నాకు అనుకూలంగా రూ.1800/లకు డిక్రీ చేశారు. ఆ భక్తులిద్దరూ సంతోషంతో బాబా వద్దకొచ్చి, ఆ పైకమంతా దక్షిణగా వారినే తీసుకోమన్నారు.
ఆయన నవ్వి, “అది నేనేం చేసుకుంటాను? నాకు యిల్లా, కుటుంబమా? నీవే తీసుకో!” అన్నారు.
చివరకు సాయికి ఆశ్రయమైన చావడి మరమ్మత్తుకు ఆ పైకం వినియోగించారు. అందుకే అక్కడ, “లక్ష్మీబాయి దామోదర్ బాబరే” అని ఆ దంపతుల పేర్లుంచారు.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- దాము అన్నా (దామోదర్ సావల్ రామ్ రాసనె)
- దాము అన్నా – తిని చావు …..సాయి@366 జనవరి 20….Audio
- శతమానం భవతి…..సాయి@366 జూన్ 16….Audio
- సాయి అభిన్నత్వం…..సాయి@366 సెప్టెంబర్ 2….Audio
- అందరూ బిడ్డలే! …..సాయి@366 ఆగస్టు 5…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments