అందరూ బిడ్డలే! …..సాయి@366 ఆగస్టు 5…Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయిబాబాకు పిల్లలంటే ఇష్టం. ఎంత ఇష్టం అంటే, ఎవ్వరైనా కొట్టటం, చివరకు తల్లిదండ్రులయినా సరే కసరటం కూడా నచ్చేది కాదు.

పిల్లలతో సాయిని గూర్చిన సమాచారం సాయి సచ్చరితలో లేదనే చెప్పుకోవచ్చును.

దామోదర్‌ రాస్నే కుటుంబానికి సాయిబాబానే పెద్ద దిక్కు. సాయి కటాక్షం వలననే దత్తాత్రేయ దామోదర్‌ జన్మించాడు.

దత్తాత్రేయకు ఏడు సంవత్సరాల వయస్సులో ఆ కుటుంబం షిరిడీకి వెళ్ళింది. దత్తాత్రేయుడు ద్వారకామాయిలో సాయి పాదాలను ఒత్తుచున్నాడు.

అప్పుడు బాబా పిల్లలందరికి మిఠాయిలు పంచుచున్నాడు. దత్తాత్రేయుని వయసు చిన్నది అవటం వలన అతని దృష్టి మిఠాయిల వైపు మళ్ళింది.

దాన్ని గమనించిన అతని తల్లి ”నీ దృష్టి మిఠాయిల వైపు మళ్ళింది. సరిగ్గా బాబా పాదాలు ఒత్తటం లేదు నువ్వు” అని ఆ బాలుని కొట్టింది.

సాయికి కోపం వచ్చింది ”ఓ ముసలీ! పిల్లవాణ్ణి ఎందుకు కొట్టావ్ ” అని బిగ్గరగా అరిచాడు. ఆమె సరిగా సేవ చేసే బుద్ధిని తన కుమారునికి ప్రసాదించమని కోరింది సాయిని. సాయి కోపం తగ్గింది.

”ఈ బాలుడు నాకు సరిగ్గానే సేవ చేస్తాడు. భగవంతుడు ఇతనికి నిర్మలమైన మనస్సు ఇస్తాడు” అన్నారు సాయి. ఆ పిల్లవాడు పెద్దవాడై సాయి సంస్థానానికి చక్కని సేవ చేశాడు.

హరిభావ్‌ చౌబాల్‌కు ఆగస్టులో కుమారుడు పుట్టాడు. అతని పేరు శంకర హరిభావ్‌.

తల్లిదండ్రులతో  సాయిని దర్శించాడు చిన్నప్పుడే. ఆ కుటుంబం షిరిడీలో బస చేసినప్పుడు బాబాకు భిక్షను కూడా సమర్పించేవాడు ఈ చిన్నారి.

బాబా భిక్ష చేసుకొని తిరిగి వచ్చేసరికే శంకర్‌ హరిభావ్‌ ద్వారకామాయిలో కట్టడం వద్ద చీమిడి ముక్కుతో కూర్చునే వాడు.

బాబా ద్వారకామాయికి వచ్చిన తరువాత ఆ బాలుని తన ఒడిలో కూర్చుండ బెట్టుకుని ముక్కు తుడిచే వాడు.

ఒకసారి శ్యామా, బాబా లేని సమయం చూచి ఆ బాలుని ద్వారకామాయి ప్రాంగణంలో కూర్చోపెట్టాడు. మరునాడు కూడా శంకర్‌ క్రిందనే కూర్చున్నాడు.

సాయి ఆ పిల్లవానిని తన వద్దకు రప్పించుకొని ”ఎందుకు క్రింద కుర్చున్నావు?” అని అడగగా పిల్లవాడు జరిగినదంతా చెప్పాడు.

బాబా వెంటనే శ్యామాను పిలచి ”శ్యామా! వీడూ నా పిల్లవాడే. నేను కాకుంటే నా పిల్లలను ఎవరు చూస్తారు? పిల్లలను కోపగించుకోకు” అన్నారు. శ్యామా అంగీకరించాడు.

అందరం సాయి బిడ్డలమే!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles