నేనెప్పుడు వీరికి పాలు సమర్పిస్తానని మొక్కుకోలేదే?–Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై!!

This Audio Prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-80-1109-నేనెప్పుడు వీరికి పాలు 2:57

సాయి ముముక్షువులైన తమ భక్తులకు ఇది వరకే సమాధి చెందిన మహనీయుల కృపను కూడా లభింపజేసి, వారూ, తామూ ఒకటేనని నిరూపిస్తారు.

ఛి!! శరత్ బాబు ( గురువుగారు) తల్లి గారైన శ్రీమతి వెంకటరత్నమ్మగారు తమ అనుభవాన్నిలా చెబుతున్నారు.

మా అబ్బాయి శరత్ బాబు శ్రీ భరద్వాజగారి నుండి శ్రీ అక్కల్ కోట స్వామి వారి చరిత్ర(తెలుగు వ్రాతప్రతి) తెచ్చిచ్చి దానిని పారాయణ చేస్తే నాకు మన: శ్శాంతి లభించగలదని చెప్పాడు.

నేను దానిని శ్రద్దతో పారాయణ చేస్తూ నకలు వ్రాసుకుంటుండగా ఒక రాత్రి స్వప్న దర్శనమైంది.

అజానుబాహువైన ఒక సాధువు చేత యిత్తడి చెంబు పట్టుకొని దర్శనం యిచ్చారు.

వారు శ్రీ అక్కల్ కోట మహారాజు అన్పిస్తున్నది. నేను తమకు ఒక సేరు పాలు ఋణపడి ఉన్నానని, అవి తమ కర్పించమని ఆయనడుగానే నాకు మెలకువ వచ్చింది.

అంతవరకూ నేను స్వామి పటానైన చూడలేదు. తరువాత చూచినప్పుడు దర్శనమిచ్చింది వారేనని తెలుసుకున్నాను.

నేనెప్పుడు వీరికి పాలు సమర్పిస్తానని మొక్కుకోలేదే? ఏమి చెయ్యాలని మా అబ్బాయి శరత్ బాబు ద్వారా భరద్వాజ గారినడిగించాను.

ఏ సంబంధమూ లేకుండా మహనీయులలా చెప్పరని కనుక గురువారం నాడు బాబాకు పాలు నైవేద్యం పెట్టమని అయన కబురు చేశారు.

తరువాత గురువారం నాడు నేను నైవేద్యానికని పాలు కాస్తున్నాను.

ఎప్పుడూ మా ఇంట్లోనే ఉండే మా అత్తగారు 15 రోజులు తన కూతురు దగ్గర గడిపి, అప్పుడే వచ్చారు.

ఇప్పుడు పాలెందుకు కాస్తున్నావని అడిగారు. వారికీ నా కల గురించి చెప్పాను. ఆమె అశ్చర్యంతో తమ అనుభవాన్ని చెప్పారు.

“తన కూతురింట వుండగా ఒకనాడు తనకు ప్రమాదమైన జబ్బు చేసిందనీ, అది తగ్గితే సాయిబాబాకు ఒక సేరుపాలు సమర్పిస్తానని మ్రొక్కుకున్న మరుసటి రోజే ఆమె కోలుకున్నదట!

శ్రీ బాబాయే ఈ రూపంలో నాకు దర్శనమిచ్చి మొక్కు చెల్లించమని అడిగారని తెలుసుకున్నాను” అయితే అ వృద్దురాలు మొక్కుకుంటే, శ్రీమతి వెంకటరత్నమ్మ గారింటనే ఉంటారు.

కనుక ఆ వృద్దురాలికి పాలు చేకూర్చవలసింది వారే కనుక.

‘శ్రీ సాయి లీలామృతము’ సౌజన్యముతో

పూజ్య శ్రీ భరద్వాజ మాస్టారు గారి
మొట్టమొదటి ఎడిషన్ 1977-79

సేకరణ :పావని,
విద్యానగర్, నెల్లూరు జిల్లా

సంపాదకీయం: సద్గురులీల (సెప్టెంబర్ -2014)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles