Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై ! సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై !!
This Audio has been prepared by Mr Sreenivas Murhty
- Sai Baba vaari yokka Matru Prema 2:32
ఆవు తన దూడ నెట్లు ప్రేమించునో యందరికి తెలిసిన విషయమే.
దాని పొదుగెల్లప్పుడు నిండియే యుండును. దూడకు కావలసినప్పుడెల్ల కుడిచినచో పాలు ధారగా కారును. అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాలమందు పాలిచ్చును.
బిడ్డకు గుడ్డలు తొడుగుటయందును, అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసికొని సరిగాచేయును. బిడ్డకు ఈ విషయమేమియు తెలియదుగాని తల్లి తన బిడ్డలు దుస్తులు ధరించి యలంకరింపబడుట చూచి యమితానందము పొందును.
తల్లి ప్రేమకు సరిపోల్చ దగిన దేదియు లేదు. అది యసామాన్యము; నిర్వ్యాజము.
సద్గురువులు కూడ నీ మాతృప్రేమ వారి శిష్యులందు చూపుదురు. సాయిబాబాకు గూడ నాయందట్టి ప్రేమ యుండెను. దానికీ క్రింది యుదాహరణ మొకటి.
1916వ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగమునుండి విరమించితిని.
నాకీయ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముగా సాకుటకు చాలదు.
గురుపౌర్ణమినాడు ఇతర భక్తులతో నేను కూడ షిరిడీ పోయితిని. అణ్ణాచించణీకర్ నాగురించి బాబాతో నిట్లనెను.
“దయచేసి అన్నాసాహెబ్ యందు దాక్షిణ్యము చూపుము. వానికి వచ్చు పింఛను సరిపోదు. వాని కుటుంబము పెరుగుచున్నది. వాని కింకేదైన ఉద్యోగ మిప్పించుము.
వాని యాతురుతను తీసివేయుము. వానికానందము కలుగునట్లు చేయుము”. అందులకు బాబా యిట్లు జవాబిచ్చెను.
“వాని కింకొక ఉద్యోగము దొరుకును, కాని వాడిప్పుడు నా సేవలో తృప్తిపడవలెను. వాని భోజన పాత్రలు ఎప్పుడు పూర్ణముగనే యుండును. ఎన్నటికిని నిండుకొనవు. వాని దృష్టి నంతటిని నావైపు త్రిప్పవలెను. నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడువవలెను. అందరియెడ అణకువ, నమ్రతలుండవలెను. నన్ను హృదయపూర్వకముగ పూజించవలెను. వాడిట్లు చేసినచో శాశ్వతానందము పొందును.”
సంపాదకీయం: శ్రీ సాయి సత్ చరిత్రము (వి రామ అరవింద్)
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
Latest Miracles:
- దేవ్ బాబా – దభోల్కర్ యొక్క మనవడు – మొదటి బాగం….
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (16)దీనజనోధ్ధరణ (1వ.భాగం)
- బాబా వారి యొక్క అమృతతుల్యమగు పలుకులు (మీ రెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకముంచుకొనుడు)–Audio
- హంసరాజ్ యొక్క ఉబ్బసం వ్యాధిని నయం చేసిన బాబా వారి లీల—Audio
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (11)అహింస -(2వ.భాగమ్)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments