బాబా సాధువయినపుడు ,బాబా కి డబ్బు ఎందుకవసరము—Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


This Audio has been prepared by Mrs Lakshmi Prasanna

  1. Mir-14-Money-by-Lakshmi-Prasanna 6:05

శ్రీ సాయి నాథాయనమః

సాయిబాబా ఎందుకు తిట్టేవారు -ఎందుకు దక్షిణ అడిగేవారు:

1908 వ ప్రాంతము లో, మహారాష్ట్ర లో ని యెవాలా లో  శ్రీ గోవింద్ వాసుదేవ్ కానిట్కార్ జడ్జి గా ఉండెను.

అపుడపుడు జాబ్ పనులపై కోపర్గావ్ వెళ్ళేవాడు. అక్కడ తన సహోద్యోగులు ఒకసారి బాబా కరుణ , వారి లీలలు గూర్చి అతడికి చెప్పారు.

కానిట్కార్ గారిది వుమ్మడి కుటుంబం అవడం వల్ల, వారు తన కుటుంబ సభ్యులందరినీ తీసుకుని షిర్డీ వెళ్లాలని నిర్ణయించుకుంటారు .

ఆ మరుసటి రోజే గోదావరి నది ధాటి షిరిడి కి పయనమవుతారు

కానిట్కార్ గారి భార్య అయిన కాశి భాయి, ధునిలో కట్టెల కోసం బాబా దక్షిణ అడుగుతుంటారని విని ఉన్నందు వల్ల ఆమె ముందుగానే, బాబా కి నివేదించడానికి   తన పిల్లలకి ఒక్కొక్కరికి ఒక్కో రూపాయి ఇస్తుంది.

శిరిడి చేరుకోగానే . కానిట్కార్ గారి భార్య , చెల్లెలు, ఆరు గురు పిల్లలు అందరూ కలిసి ద్వారకామాయి లోకి వెళ్లి బాబా కి సాష్టాంగ పడి,దక్షిణ బాబా కి సమర్పించుకుంటారు.

తర్వాత తమ బస కి వెళ్తారు.

రోజు విడిచి రోజు బాబా చావడి లో నిద్రించేవారు.

అలా మరుసటిరోజు బాబా చావడి లో పడుకోడానికి వెళ్లి, మహాల్సాపతి తో యేవో విషయాలు మాట్లాడుకుంటూ వుంటారు.

అంతలో చిలుము త్రాగడం కోసం సిద్ధపడగా , మహల్సాపతి చిలుము లో  పొగాకు నింపి బాబా కి అందచేస్తాడు.

వారిద్దరూ చిలుము పీలుస్తారు.

మరోసారి చిలుము నింపడానికి ప్రయత్నించగా, చిలుము పై భాగం లో ఉండాల్సిన రాయి కనపడదు. దీనితో, బాబా కోపోద్రిక్తుడయ్యి, బాబా నోటి నుండి తిట్ల వర్షం కురుస్తుంది.

బాబా పక్కనే కూర్చున్న కానిట్కార్ ఇబ్బందిపడి తన భార్య పిల్లలను అక్కడ్నించి బస కి వెళ్ళమని చెప్పి తాను  కూడా  బస కి వెళ్తాడు .

తన సహోద్యోగులతో , “బాబా సాధువయినపుడు , బాబా కి డబ్బు ఎందుకవసరము?

యిది వింత  గా వుంది. మరియు బాబా అసభ్యమయిన పదజాలం కల్గిన భాషను ఎందుకు ప్రయోగిస్తారు ఎదుట ఎవరున్నారని చూడకుండా? వారి మాటలు స్త్రీలు వినలేరని నేను భావిస్తాను” అంటాడు.

అపుడు వారి సహోద్యోగి , ” జ్ఞాని అయిన యోగి కి మంచి చెడు ల భేదం ఉండదు.వారు అన్ని భావాలకి అతీతమయిన స్థితి లో వుంటారు.

వారు దేన్నీ అంటని నిస్సంగత్వం మరియు నిర్మలత్వం తో వుంటారు” అని అంటాడు.

కానీ కానిట్కార్ మొండి గా “నేను నీ మాటలని సమర్ధించను. ఒకవేళ మేము రేపు తిరిగి వెళ్లేప్పుడు, మేము ముందే సమర్పించుకున్న దక్షిణ బాబా  మాకు తిరిగి ఇచ్చివేస్తే అపుడు నమ్ముతాను” అని అంటాడు.

కానిట్కార్ కి యోగులని దర్శించుకుని, వారి సలహాలను పాటించడం మరియు పవిత్ర గ్రంధాలని చదివే అలవాటు ఉండటం వల్ల ,ఆ ఆధ్యాత్మిక సాధన ఫలితం గా , బాబా దర్శనం వల్ల తన మనసు శాంతి ని పొందుతుంది.

కానీ బాబా ఇతరులని దక్షిణ ఎందుకు అడుగుతారు అన్న ప్రశ్న తనని కలవరపెడుతుంది.

మరుసటిరోజు తిరిగివెళ్ళడానికి అనుమతి కోసం వారంతా బాబా దగ్గరకి వెళ్తారు.

అపుడు బాబా వారందరు ఇచ్చిన దక్షిణ ఎవరిది వారికి ఇచ్చేస్తాడు . క్రిందటి రాత్రి కానిట్కార్ అన్న మాటలన్నితిరిగి చెప్తాడు బాబా.

అది విని బాధ తో కాశీబాయి ఎందుకు బాబా డబ్బు తిరిగిచ్చేస్తున్నారని అడగ్గా, బాబా “సాధువయినవాడు ఇతరులని దక్షిణ ఎందుకు అడగాలి “ అని అంటాడు .

ఇక వారు చేసేదేమి లేక ఆ డబ్బు తీసుకుని ఇంటికి తిరిగి వెళ్తారు .

ఆ డబ్బుని తమ పూజ గది లో పెట్టి కాశి భాయి పూజిస్తూ ఉంటుంది. బాబా ని దర్శించుకున్న నాటి నుండి ఆమె బాబా కి పరమ భక్తురాలు అవుతుంది. వారి జీవితం లో ఎన్నో లీలలు బాబా చూయించడం జరిగింది .

ఈ పై లీల లో బాబా మనకి క్రింది విషయాలు బోధిస్తున్నారు :

1  సద్గురు చర్యలను అంచనా వేసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నం చేయరాదు.వారి చర్యలు అగాధము

2 సృష్టి అంతా తనదే అయినప్పుడు బాబా మన నుండి ఏది ఆశించడు

3 మనం బాబా కి దక్షిణ ఇస్తున్నామంటే అది మనం బాబా ఖజానా నుండి పొందినదే.అందువల్ల నేను, నాది అనే అహంభావం ఉదయించవద్దు

4 బాబా మన నుండి దక్షిణ అడుగుతున్నారంటే, అది మన అహంకారము ను నిర్ములించడానికే అని మనం అర్థం చేసుకోవాలి

5 బాబా వారు ఒక రూపాయి దక్షిణ తన భక్తుడి నుండి తీసుకుంటే, వారికి అక్షరాలా పది రేట్లు తిరిగి ఇస్తారు అనడం లో సందేహం లేదు

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles