బాబా దక్షిణ తీసుకొనుట.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఓం సాయి రామ్.

నా పేరు మేడా  లక్ష్మి ప్రసన్న.

దక్షిణ గురించి బాబా స్వయంగా ఇలా చెప్పారు.

రెండు పైసల దక్షిణ అంటే ఒకటి శ్రద్ద, రెండవది సబూరి, ఇవ్వడం నేర్పించడానికే బాబా దక్షిణ అడిగేవారు.

మన మనములు శుబ్రపరుచుటకే దక్షిణ అడిగేవారు, “బాబాకి దక్షిణ ఇవ్వడానికి మనకు యోగ్యత కావలి అని నా అబిప్రాయం.”

దక్షిణ రూపంలో మన పాపాలు తీసుకుంటారు బాబా.

ఎవరైనా ద్వారకామాయి తల్లికి బాకీ ఉంటేనే ఆమె తీసుకుంటుంది. లేకపోతె లేదు. వారు ఇచ్చిన దానికి నేను వంద రెట్లు ఎక్కువ ఇవ్వవలిసి ఉంటుంది. మీ దగ్గర తీసుకున్న ప్రతి పైసాకి నేను అల్లాకి సమాదానo చెప్పాలి అంటారు బాబా.

ఒక్కోసారి దక్షిణ నమస్కారం రూపంలో కూడా పుచ్చుకుంటారు బాబా.

సాయంత్రం అయ్యేవరకు అందరికి పంచేవారు బాబా,  ఇంత వివరంగా దక్షిణ గురిచి తెలియచేసిన బాబాకి , దక్షిణ ఇవ్వడానికి ఎవరికీ మాత్రం ఇష్టం ఉండదు.

నా షిర్డీ ప్రయాణం అంటేనే దక్షిణ గురించి నేను దాచుకున్న డబ్బులు వేరుగా తీసుకొని వెళ్లి బాబా ఏ రూపంలో అయిన వచ్చి దక్షిణ తీసుకుంటారు అని,  అడిగిన వాళ్ళకు ఇవ్వడం నా అలవాటు.

ఇదే తరుణంలో ఒకసారి నాకు ఒక కోరిక కలిగింది. బాబానే వచ్చి నా దగ్గర దక్షిణ అడిగి తీసుకోవాలని ఆ రోజు ఎవ్వరు అడిగినా నేను ఇవ్వలేదు.

ఎందుకు అంటే బాబా ఒకవేళ వచ్చారు అంటే నా మనసుకు తెలుస్తుంది. నా శరీరం గగుర్పాటు చెందుతుంది, ఆ రోజు అలా జరగలేదు.

నేను ఎదురు చూడసాగాను, చావడి దగ్గర కూర్చొని ఆలోచిస్తుంది నా మనసు.

ఇలా ఒక విదమైన తన్మయత్వం లో మునిగి ఉన్న నా కళ్ళకి ఒక పెద్ద మనిషి వస్తూ కనిపించారు.

ఆయనని చూడగానే నా గొంతుక ఆరినట్టుగా అయ్యింది. వెంటనే లేచి నిలబడి నమస్కరించాను.

కాని ఆయన ఖచ్చితముగా బాబానే,  నా మనసుకి నా శరీరానికి కలిగిన అనుభూతిని మాటలలో చెప్పలేను.

కాని నా పక్కన ఉన్నవాళ్లు మాత్రం నువ్వు అందరిని బాబా అనే అంటావు,  షిర్డీ వస్తేనే ఇలా తయారవుతావు.

 పది రూపాయలు ఇస్తే ఎవరైనా సరే దీవిస్తారు అని వాళ్ళ అబిప్రాయం.

నా ఆద్యాత్మిక అనుభూతి వాళ్ళకు తెలియదు కదా.

బాబా అయితే నన్ను తదేకంగా చూస్తారు, అడిగిమరీ దక్షిణ తీసుకుంటారు, అని గట్టిగా చెప్పాను.

కానీ ఆయన నా దగ్గరకు వచ్చేకొద్దీ చూస్తే ఆయన చాలా హుందాగా ఉన్నారు.

నాకు నేనుగా దక్షిణ ఇవ్వలేని రూపంలో ఉన్నారు ఆయన,  దగ్గరికి వచ్చికూడా నన్ను చూడలేదు,   అంతట ఆయన వెళ్ళిపోతున్నారు.

మరి నాకు కలిగిన అనుభూతి భ్రమ ??? అనుకొనేలోపే తను నాకు కనిపించలేదు.

ఇక నా పక్కన ఉన్నవాళ్లు నన్ను ఏమి అనలేదు, కానీ వాళ్ళ చూపులతో పరిస్థితి  నాకు అర్ధమయ్యింది . సరే ఇక పదండి ఆంజనేయస్వామి గుడికి వెళ్లి వద్దాము అని వెళ్ళాము.

మళ్ళి నేను గుడి బయటకు వచ్చేవరకు నా కోసము ఎదుచూస్తున్నట్టుగా నిల్చున్నారు ఆ పెద్దమనిషి.!!!!! బుర్ర మీసాలతో పెద్ద కర్ర పుచ్చుకొని అందమైన తలపాగాతో,  పంచకట్టుతో హుందాగా ఉన్నారు బాబా.

నన్ను తదేకంగా చూస్తూ ఉన్నారు,  ఆ చూపుకి నా కళ్ళలో నీళ్ళు. “మాయి పైసా దేదో మాయి !!! అని అడిగారు. నేను దక్షిణ ఇచ్చాను నన్ను ఆశీర్వదించి వెళ్ళారు.”

ఇప్పుడు నేను గర్వంగా నా చూపు నా పక్కన ఉన్న వాళ్ళ మీదకు చూసాను,  వెంటనే కరుణ చూపితే ఎలా, బాబా గారి లీలలు అద్బుతం.

వెంటనే ముఖః దర్శనం కి వెళ్లి నా కృతజ్ఞతలు నేను తెలియచేసాను.

బాబా ఎక్కడైనా ఉంటారు, కాని ఆయన మన దగ్గర ఉండేంత మంచి వాతావరణం మనం ఆయనకు ఇవ్వగలిగితే ఉంటారు.

అంటే మన స్వార్దo లేని ప్రేమ, కల్మషం లేని మనసుతో, ఎల్లవేళలా నామజపం చేస్తూ మనం రోజురోజుకు పరిపక్వత చెందుతూ ఉంటె కనుక ఎల్లవేళలా మన దగ్గర ఉండి తీరుతారు బాబా.

ఆయన లేనిది ఎక్కడ? అంతటా ఆయనే నిండి ఉన్నారు.

బాబాని అనుభూతి చెందాలి అంటే మాత్రం మన దినచర్య మార్చాల్సిందే,  తప్పదు. ఇది నా స్వానుభవం.

సాయి నాథ్ మహారాజ్ కి జై.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

One comment on “బాబా దక్షిణ తీసుకొనుట.

మీరు చాల అదృష్టవంతులు…బాబా వారి మనుసు ఎప్పుడు మీ పై ఉంటుందని, ఈ లీల ద్వారా అర్ధం అవుతుంది…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles