Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
దైవము ఎవరో తెలియకుండుట ఒక స్థితి. దైవము తెలిసియు గుర్తించ లేకపోవటం మరొక స్థితి.
దైవమును గుర్తించి, ఆరాధించుట ఇంకొక స్థితి. దైవమె సర్వస్వమనియు, తాను భగవత్సాగరములో బిందువని గ్రహించుట వేరొక స్థితి.
తనకు ఉనికి లేక, తానూ భగవంతునిలో లీనమగుట చివరి స్థితి.
జలాలుద్దీన్ రూమీ ఒకసారి ఇలా పలికాడు: “నేను నీతో పగలంతా పాడాను, నువ్వూ నేను రాత్రి ఒకే శయ్యపై నిద్రించాము, రాత్రికి పగటికి తేడా కానరాలేదు, నేను ఎవరో తెలుసుకున్నాను అనుకున్నాను, కానీ నేనే నీవు”.
సరిగ్గా దీనినే తుకారాం “నేను అతడు (పరబ్రహ్మము) అని గుర్తించాను” అంటాడు. గుర్తింపుగా ఆనందతాండవం చేశాడు.
సాయి తెలిపేది అదే, భక్తుడు తానూ వేరు వేరుగా లేమని, తనకు, తన భక్తునకు తేడా లేదని, దీనినే గ్రహించండి అంటారు సాయి.
ఆ విషయం ప్రస్తుతం ఇతరుల విషయంలో అర్ధం చేసుకుంటే ఒక అడుగు ముందుకు వేసినట్టే ఆ భక్తుడు.
ఇక మిగిలింది ఒకే ఒక అడుగు తాను. భగవానుడు ఒకటేనని గుర్తించటం. సాయికి తనకు తేడా లేదని భక్తుడు గ్రహించాలని సాయి అనేకమార్లు తెలిపారు. ఒక సంఘటన:
ఈ సంఘటన 1925 డిసెంబరు మాసంలో జరిగింది. కృష్టారావ్ నారాయణరావ్ పరూల్కర్ సాయి భక్తుడు.
ప్రతి సంవత్సరం దత్త జయంతికి 100 మంది బ్రాహ్మణులకు భోజనం ఏర్పాటు చేస్తాడు.
ఒక సంవత్సరం అయన వంద మందికి భోజనం ఏర్పాటు చేయలేదు. అందుకని మరుసటి సంవత్సరం 200 మందికి భోజనం ఏర్పాటు చేయదలచాడు.
శనివారం అన్నదానానికి ఏర్పాట్లు జరిగాయి. మంగళ వారంనాడు అయన ధ్యానం చేస్తుండగా “నేను కూడా బ్రాహ్మణులతో భోజనానికి రావాలంటే బొంబాయిలోని దీక్షిత్ ను ఆహ్వానించు” అని వినిపించింది.
ఎక్కడి బొంబాయి ఎక్కడి హర్దా, కేవలం భోజనానికి అంత దూరం నుండి కాకాను రమ్మనటం సమంజసమా? ఆలోచించారు.
“ఏమిటి ఆలోచిస్తున్నావు. దీక్షితును పిలిచి భోజనం పెడితే నేను కూడా భుజించినట్టే” అని వినిపించింది.
కాకాకు ఉత్తరం వ్రాశాడు. శనివారం రానే వచ్చింది. కాకా రాలేదు. అంతా వృధాయేనా? అనుకున్నాడు.
ఇంతలో టెలిగ్రాం వచ్చింది కాకా బయలుదేరాడని, కార్యక్రమానికి కాకా వచ్చాడు. కృష్టారావ్ సంతోషానికి అవధులు లేవు.
ఈ ఉదంతం డిసెంబరు, 1925 లో జరిగింది.
సాయి భక్తులను సాక్షాత్తు సాయి స్వరూపులుగా చూచెదము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎన్నటికీ వీడని బంధం …..సాయి@366 డిసెంబర్ 19….Audio
- వైద్యో నారాయణో సాయి: …..సాయి@366 డిసెంబర్ 5…Audio
- తల్లిని మరువని బిడ్డ …..సాయి@366 డిసెంబర్ 16….Audio
- బాధల బదిలీ…..సాయి@366 డిసెంబర్ 18….Audio
- నేనున్నాను …..సాయి@366 డిసెంబర్ 31…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments