Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబాను తండ్రిగానే గాక తల్లిగా భావించిన భక్తులు కూడా ఉన్నారు. పాండురంగని కూడా అట్లే భావించిన వారున్నారు.
దేవీ భాగవతము ప్రకారము సృష్టి కర్త లలితా దేవి.
విష్ణు, శివ పురాణాలు విష్ణువును, శివుని (అంటే పురుషుని) సృష్టికర్తగా తెలుప్తుతాయి.
తిరుమల మందిరములోని సుందరాకృతి ఎవరిది? పాలకడలిపై శేష తల్పమున పవళించిన శ్రీపతా? వెండి కొండపై నిండు మనసుతో వెలిగే గౌరీపతా? ముగురమ్మలకే మూలపుటమ్మగా భువిలో వెలసిన ఆది శక్తా? ఎవరివో? నీవెవరివో?
ఇక జైన మతంలో 19వ తీర్థంకరుడు.
అపర్విదేహ (Aparvideh) ప్రాంతంలో విట్షోక (Vitshoka)ను మహాబలుడు అనే రాజు పాలించేవాడు. అతనితో పాటుగా మరో ఆరుగురు బాల్య స్నేహితులున్నారు. వారందరూ రాజులే.
అందరూ కలసికట్టుగా తమ తమ రాజ్యాలను పాలించేవారు. మహాబలునకు ప్రపంచమంటే విరక్తి కలిగింది. ఈ విషయాన్ని తన బాల్య స్నేహితులతో ముచ్చటించాడు. “మనం అందరం కలిసే ఉన్నాం. మేమూ నీ లాగే ఉంటాం” అని మహాబలునకు తమ సంసిద్ధతను తెలిపారు.
ఆ ఏడుగురు వరధర్మ అనే ముని వద్ద ఒకేసారి, ఒకే విధంగా దీక్షను తీసుకున్నారు. అందరూ ఒకే దీక్షలో ఉన్నారు మోక్ష దిశగా.
ఒకసారి మహాబలునకు స్వార్థం ఏర్పడింది. ఇతను ఆరుగురు రాజులకంటే తాను ఉన్నతుడవ్వాలనే కోరిక కలిగింది. ఏదో సాకు చూపి, ఆహారం తీసుకోకుండా, తపస్సు లేదా దీక్షను కొనసాగించే వాడు.
అయితే దీక్షను నిజాయితీగా కొనసాగించారు. మోక్షము పొందాలి అన్న చిరు కోరికతో తపస్సు చేయుటచే ఆ ఏడుగురకు మోక్షము రాలేదు.
ఆ ఏడుగురు మరో జన్మను ఎత్తవలసి వచ్చింది. మహాబలుని స్నేహితులైన ఆ ఆరుగురు రాజులుగా జన్మించారు. ఇక మహాబలుని విషయం, కొంచెం ఖిన్నంగా ఉంటుంది.
జైన మతంలోని శ్వేతాంబర శాఖ వారు, మహిళలు కూడా మోక్షానికి అర్హులంటారు.
శ్వేతాంబరుల ప్రకారం మహాబలుడు మహిళగా మల్లి కుమారిగా జన్మంచి, ఈ జన్మలో మోక్షం పొంది 19వ జైన తీర్ధంకరుడైనాడు.
జైన మతంలోని దిగంబర శాఖ ప్రకారం మహిళలకు మోక్ష ప్రాప్తి లేదు. కనుక మహాబలుడు మల్లినాథునిగా (పురుషునిగా) జన్మ నెత్తి మోక్షమంది, 19 జైన తీర్థంకరుడైనాడు.
19 తీర్థంకరుడు పురుషునిగా దిగంబర శాఖవారు, మహిళగా శ్వేతాంబరులు విశ్వసిస్తారు.
ఆ రెండు శాఖలలోను 19 తీర్థంకరుని జన్మ, దీక్ష మోక్ష దినాలు ఒకటే.
19వ తీర్ధంకరుడుని జన్మ, దీక్ష దినం మార్గశిర బహుళ ఏకాదశి.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఇంపు – కంపు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 12
- శుభ్రత!…. మహనీయులు – 2020… డిసెంబరు 20
- గడ్డిపోచ! .. …. మహనీయులు – 2020… డిసెంబరు 16
- శతాధిక వసంతాల కుర్తాళ పీఠం.. …. మహనీయులు – 2020… డిసెంబరు 28
- పరీక్షలున్నాయి … …. మహనీయులు – 2020… డిసెంబరు 5
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments