Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయిబాబా సన్నిధిలో ఏ పండుగ వచ్చినా రాధాకృష్ణమాయి లేనిదే జరిగేదికాదు.
పండుగలే కాదు, ఆరతులు ఇవ్వాలన్నా రాధాకృష్ణమాయి ప్రసక్తి వస్తుంది. ఎందుకంటే, ఆరతి సామగ్రిని పంపేది రాధాకృష్ణమాయియే.
ఒకసారి రాధాకృష్ణమాయి గాఢ నిద్రలో ఉన్నది. మధ్యాహ్న ఆరతివేళ అయింది. ఆరతి పళ్ళెం వగైరాలన్నీ రాధాకృష్ణమాయి గృహం నుండే రావాలి. ఆరతి సామాను ఆలస్యంగా వచ్చింది. సాయిబాబా ఏమీ కోపగించుకోలేదు రాధాకృష్ణమాయి మీద.
అసలు ఆమెకు భూదేవికున్నంత ఓర్పు ఉన్నది.
సహనంలో ఆమెకు ఆమే సాటి.
1914 గురుపూర్ణిమ (సామాన్యంగా జూలై నెలలో వస్తుంది). ఉత్సవాలకు రాధాకృష్ణమాయి మసాలా దినుసులు పొడిచేసేందుకు ఒక పెద్ద రోలును కదల్చవలసి వచ్చింది.
ఆమెకు సాయం చేయటానికి రేగే అనే భక్తుడు వచ్చాడు. అదే సమయంలో రఫువీర భాస్కర పురందరే అనే మరో భక్తుడు కూడా అక్కడకు వచ్చాడు.
రేగే, పురందరేలు కూడా రాధాకృష్ణమాయికి రోలు కదల్చటంలో సాయం చేస్తున్నారు. అలా కదిల్చేటప్పుడు రేగే చేయిపై రోలు పడి రేగే చేయి నుజ్జు, నుజ్జు అవ్వవలసి ఉండేది. కాని, రాధాకృష్ణమాయి ఒడుపుగా రోటిని తనవైపు తిప్పుకున్నది.
అలా తిప్పుకోవటంలో ఆమె చూపుడు వ్రేలుకు గాయమైంది. రక్తం కారుతోంది. వెంటనే రాధాకృష్ణమాయి ఒక గుడ్డను నూనెలో తడిపి తన వ్రేలుకు చుట్టుకున్నది.
మిగిలిన ఆ పనిని ఆమె పూర్తి చేసింది. వంటా, వార్పు పూర్తి చేసింది. పని అంతా అయిపోయింది.
రేగేను పిలిచింది.
రేగేను తీసుకుని ఒక నిర్జన ప్రదేశానికి వెళ్ళి తన చేతి వ్రేలు బాధ తీరేదాకా – సుమారు ఒక అరగంటసేపు విలపించసాగింది.
మిగిలిన పనులన్నీ ఆగిపోతాయని, ఆమె వ్రేలు చిట్లినప్పుడు బాధను బయటపడనీయకుండా దిగమింగింది ఆమె. పనులన్నీ పూర్తి అయ్యేవరకు ఆ బాధను ఆమె ఎంతో సహనంతో భరించింది.
సాయిబాబా కోసం పనిచేస్తున్నా, నా వ్రేలు చిట్లాలా అని ఆమెలా అనుకొనక పోవటం, బాధను భరించటం అందరకూ సాధ్యమయ్యేనా?
బాబా బోధించిన శ్రద్ధ, సహనాలకు ప్రతీకగా రాధాకృష్ణమాయిని చెప్పుకోవచ్చు. ఆమె ఏ పని చేసినా ఎంతో శ్రద్ధతో చేసేది.
ఆ పని చేయటానికి ఎంత సమయం పట్టినా సహనాన్ని కోల్పోయేది కాదు. మనం కూడా రాధాకృష్ణమాయిలాగా శ్రద్ధ, సహనాలను అలవరుచుకుందుము గాక!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎన్నేళ్ళనేది కాదు…అర్హతే కొలమానం ….. సాయి@366 ఫిబ్రవరి 25….Audio
- బాబా చిరునవ్వు నవ్వి ‘సరే’ అన్నారు–Audio
- రాత్రి నిద్రించని సాయి…..సాయి@366 డిసెంబర్ 21….Audio
- సిద్దావతారుడు…..సాయి@366 అక్టోబర్ 9….Audio
- సాయిబాబానా? రామకృష్ణుడా? …..సాయి@366 జూన్ 11….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments