నాకెలాగూ ఇష్టం లేదు.మీరేలాగు ఇవ్వరు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ముందు భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై !!

ఒకరోజు మా బాబాయ్ ఒకరు ఫోన్ చేసారు తమిళనాడులో గ్రీన్ సిగ్నల్ బయో ఫార్మా అనే కంపెనీ లో వాళ్ళ అల్లుడు మేనేజర్ గా చేస్తున్నాడు.కనుక నాకు జాబ్ దానిలో ఉంది. వెళ్లి ఇంటర్వ్యూ కి అటెండ్ అయినట్టు అయి జాయిన్ అవడమే అని.నాకు అది నచ్చలేదు.

ఎందుకంటే ఇతనివల్లే అంతకుముందు వచ్చిన రెండు ఎం.యెన్. సి జాబ్స్ లో, జాయిన్ అవలేకపోయా అని,మళ్ళీ బంధువులు చూపించిన జాబ్ లో జాయిన్ అవ్వకూడదు.మళ్ళీ ఎప్పుడైనా మేము ఇప్పించాము జాబ్ అంటే నాకు కష్టం అని అనుకున్నాను.అదే కాకుండా నాకు జాబ్ వస్తే అది నాకు నేనుగా తెచ్చుకోవాలి, లేదా బాబా అయినా ఇవ్వాలి కానీ ఇంకేవిదంగా జాయిన్ కావద్దు అని అనుకున్నాను.

సో, నాకు ఇష్టం లేదు.మళ్ళీ బాబా నాకు గవర్నమెంట్ జాబ్ అని చెప్పారు కాబట్టి అదే జాబ్ రావాలి అని ఇంకొక అలోచన.కానీ ఇంటర్వ్యూ డేట్ వచ్చింది.నాకు లోపల చిన్న భయం.

ఏంటి బాబా చెప్పిన దానికి అపోజిట్ గా జరుగుతుంది అని.ఇక రేపు తమిళనాడుకి స్టార్ట్ అవుతాం అనగా నాకు ఏడుపు వచ్చింది..బాబా చెప్పింది జరగలేదు..ఇక ఈ జాబ్ ఆపడం కష్టం.ఐన నేను ఎలా నమ్ముతున్నాను ఈ కలలని,అవి జస్ట్ కలలే కానీ రియల్ లైఫ్ లో జరగవు కదా! బాబా కలలో చెప్పింది రియల్ లైఫ్ లో ఒక్క ఇన్సిడెంట్ కూడా జరగనప్పుడు ,ఎలా నమ్ముతున్నాను అనుకున్నాను.

ఆ రాత్రి కలలో మా అమ్మ ఒక స్టూల్ పై నిలుచుని పైన నుండి యేవో పాత ఫోటోలు తీస్తూ కింద ఎవరికో ఇస్తుంటే వాళ్ళు తీసి పక్కనపెడుతున్నారు దానిలో బాబా పాత ఫోటో, ఇంకేవో పాత ఫోటోలు ఉన్నాయి .మెలుకువ వచ్చాక అనుకున్నా, మా ఇంట్లో అంత పాత ఫోటోలు అసలు ఉండే ఛాన్స్ లేదు.అది ఏదో కలలే అని.

అప్పటికే నాకు,మా నాన్నకి గొడవ అయింది. ఆ చిరాకుతో ఉండి బయట బుక్ చదువుతున్నట్టు చేస్తూ ఉన్నాను.

ఎందుకో తలపక్కకి తిప్పి చూసేసరికి కిచెన్ లో మా అమ్మ స్టూల్ పై నిలుచుని ,పై నుండి కలలో జరిగినట్టే పాత ఫోటోలను తీస్తూ కింద నిలుచున్న మా చెల్లికి ఇస్తుంది. తను తీసుకునిపక్కన పెడుతుంది.

నాకు అర్థమైంది ఓహో నిన్న అనుకున్నా కదా! కలలో జరిగింది రియల్ లైఫ్ లో జరగ లేదు అని. సో బాబా ఇలా చూపించారు అని.

అసలేంటి అని తెలుసుకుందాము అని మా అమ్మని అడిగా ఈ ఫొటోస్ ఎక్కడివి అని.దానికి మా అమ్మ అంది పిన్ని వాల్ల షో రూమ్ లో ఉండేవి వాళ్ళు షో రూమ్   తీసేసినప్పుడు అన్నీ సామాన్లు ఇక్కడ పెట్టేసి వెళ్లారు.అందులో ఈ ఫొటోస్ కూడా ఉన్నాయి .నిన్న చూసినప్పుడు ఇవి పాతగా అయిపోయాయి,అక్కడే ఉంటె గ్లాస్ ఏమైనా పగిలి గుచ్చుకుంటుందేమో తీసేద్దాం అనుకున్నాను..ఇప్పడు తీసేస్తున్నాను అని.

నాకు బాబా మీద ఇంకా కోపం వచ్చింది.కలలో వచ్చింది జరగలేదు అంటే జరిగింది అని చూపించావు .ఇప్పడుఎలా ఆపుతారు ఈ జాబ్ ని..నాకెలాగూ ఇష్టం లేదు.మీరేలాగు ఇవ్వరు.దీనికోసం నేను అంతదూరం వెళ్లి రావాలా ? పైగా దానికోసం మా నాన్నతో గొడవ పెట్టుకుని మరీ..మీరు కావాలంటే ఈ గొడవ జరగకుండా చూసేవారు. i కానీ ఆలా చేయలేదు .మీరంటే నాకు కోపం వస్తుంది.యూ స్టుపిడ్ , ఇడియట్ అని ఏవేవో తిట్టుకున్నాను బాబా ని కోపం లో.

(ఇది చదువుతుంటే మీకు నా మీద కోపం రావచ్చు కానీ అప్పుడు నేను అలాగే అనుకున్నాను .ఇది చూడడానికి బాబా మీద కలుగుతున్న అనుమానం, కోపంలాగ కనిపించినా,మా నాన్న మీద ప్రేమ వల్లే నాకు ఆలా కోపం వచ్చింది.కోపం లో తను,నేను ఏదో అనుకున్నాము.బాబా దీనిని ఆపగలడు కదా ఆపవచ్చు కదా అని. ఎక్కడో చదివా ..భగవంతుని ధర్మాన్ని గురించి మాత్రమే ఆలోచించడం జరిగితే సమాధానం ఎప్పటికీ లభించదు.ప్రాప్తం పట్ల అవగాహన లోపిస్తున్నప్పుడు భావనాపరంగా భగవంతుడిని బాధ్యుడిని చేయడం జరుగుతూ ఉంటుంది.నా విషయం లో కూడా అలాగే జరిగింది! ఎవరిలోనైనా ముందుగా కలిగే భావం వారికి కలిగిన కష్టాన్ని గురించే కానీ ,వారు చేయవలసిన ధర్మాన్ని గురించి కాదు.మానవ నైజం అలాంటిది )

తరువాత నాకు బాబా మీద కోపం పోయింది ..ఏమి తొలగించడానికి బాబా నన్ను ఇంతదూరం ప్రయాణం కి పంపించారోలే అనుకున్నాను .

ఇంటర్వ్యూ కి వెళ్ళా. అక్కడ ఎక్కువగా ఏమీ ప్రశ్నలు అడగలేదు. బాబాయ్ వాళ్ళ అల్లుడు 10 డేస్ లో కాలింగ్ లెటర్ వస్తది అని చెప్పారు .కానీ నాకు తెలుసు కదా.అది రాదు అని అలాగే రాలేదు.

రీసన్ ఆడిగితే వాళ్ళ సర్, అమ్మాయి కదా మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతే ట్రైనింగ్ కి పెట్టిన మనీ వేస్ట్ అవుతుంది. అని నా ప్లేస్ లో ఒక అబ్బాయి కి జాబ్ ఇచ్చారట .నాకు నవ్వు వచ్చింది . ఎందుకంటే నా అన్ని సంగతులు తెలిసీ ఇంటర్వ్యూ కి పిలిచి జాయిన్ అయ్యే సమయానికి, ఆయనకి నేను అమ్మాయిని అని గుర్తుకువచ్చిందా? ఆలా బాబా అతనితో చెప్పించారు.అని హ్యాపీ అనిపించింది.

తరువాతి భాగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “నాకెలాగూ ఇష్టం లేదు.మీరేలాగు ఇవ్వరు

Sai Suresh

you are very lucky sai, very nice experiences sai. morning jarigina oka chinna incident valana na manassu disturb ga undi daniki baba eppudu mi leela dwara samadhana paricharu. బాబా లీలలు అనూహ్యం.

సాయినాథుని ప్రణతి

మీ అనుభవం బాగుంది .నేను కూడ బాబాతో మీలాగే పొట్లడుతాను కాని తిటలేదు ఎంటి తండ్రి ఇలా చెసావ్వ అని కొపడతాను బాదపడతాను ,ఎడుస్తాను .తరువాత బాబా ఎదో ఒక సంగటన ద్వర cool చెస్తారు. బాబా మిద మీకు అంత ప్రేమ వుండబటే అంత కోపం వచిందనిపిస్తుంది. మన హృదాయాని ఆక్రమించుకున బాబాతో పొట్లడటం తపేమికాదు అనిపిస్తుంది. బాబా తో ఒక్కొక్కరి ఫిలింగ్ ఒక్కోలాగా వుంటుందా అనిపిస్తుంది. మి అనుభవానికి జోహర్లు.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles