Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (11)అహింస -(1వ.భాగమ్)
ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్
తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు
అహింస యొక్క అర్ధంమేమిటంటే ఏ ఒక్కరినీ శారీరకంగా కాని, పరుష వాక్యాలతో గాని, మానసికంగా కాని బాధించకుండా ఉండటమే. ‘అహింసా పరమో ధర్మః’. ఇది అనాదిగా వస్తున్న నానుడి. (అహింస అనేదే గొప్పమతం).
మనుస్మృతిలో కూడా (హిందూమతంలో ప్రముఖ ధర్మశాస్త్ర కర్త మనువు రచించిన ధర్మసూత్రాలు) అహింసకి ప్రధమ స్థానం కల్పించబడింది.
అహింసా సత్యమస్తేయ శౌచమిందియనిగ్రహః I
ఏవం సామాసికం ధర్మ చారుర్వణ్యే డ బ్రవీన్మనుః II
(అహింస, సత్యము పలుకుట, దొంగతనము చేయకుండుట, పవిత్రత, ఇంద్రియ నిగ్రహము, ఇవన్నీ కూడా నాలుగు వర్ణాల వారికి అనగా బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు, వీరందరూ ఆచరించలవసిన నీతి నియమాలు)
సాయిబాబా గారు కూడా అహింసా సిధ్ధాంతాన్నే బోధించారు. ఆయన పద్ధతులు కూడా ఆయన స్వయంగా ఆచరించి చూపినవే. ఉదాహరణకి కొన్ని మతాలలోను కులాలలోను వారి వారి మతాచారాలను బట్టి తరతరాలుగా మాంసహారాన్ని భుజిస్తూ ఉన్న వారికి మాంసాహారము నిషిధ్ధము కాదు. ఇలాంటి వారందరికీ మాంసాహారాన్ని త్యజించమని సాయిబాబా ఎప్పుడూ చెప్పలేదు. సాయిబాబా తానే స్వయంగా ఒక ముస్లిమ్ ఫకీరులాగా మసీదులో నివాసం ఏర్పరచుకొన్నారు. ఆయన ఒక ముస్లిమ్ ఫకీరుగా ఉన్న కారణం చేత దానికి తగ్గట్లుగానే ఆయన మాంసాహారాన్ని రుచి చూడటానికి ఎటువంటి అభ్యంతరం లేదు. అంతేకాదు, మాంసాహారాన్ని వండి వడ్డించేవారు కూడా. కాని, ఆయన మాంసాహారులకు మాత్రమే వడ్డించారు గాని శాఖాహారులకు వడ్డించే వారు కాదు. వారిని దగ్గరకు కూడా రానిచ్చేవారు కాదు. వాళ్ళని మాంసాన్ని ముట్టమని కూడా ప్రోత్సహించలేదు.
సహజంగానే సాయిబాబా చరుతులు. అందువల్ల తన వద్దకు వచ్చే కొంతమంది భక్తులతో మాంసాహారం పట్ల ఏవగింపు ఉన్న వారిపై హాస్యమాడుతూ ఉండేవారు. ఒకసారి పవిత్రమయిన ఏకాదశి రోజున బ్రాహ్మణుడయిన దాదాకేల్కర్ ను బజారుకు వెళ్ళి మాంసము కొని పట్టుకురమ్మని చెప్పారు బాబా. విధేయత కలిగిన శిష్యుడిగా దాదాకేల్కర్ బజారుకు బయలుదేరగానే బాబా అతనిని వెళ్ళవద్దని వారించారు.
అలాగే ఒకరోజున పేదరికాన్ని అనుభవిస్తున్న ఒక బ్రాహ్మణుడు సాయిబాబా వద్దకు వచ్చాడు. ఆయన తనకు ఏదయినా ధనసహాయం చేస్తారేమోననే ఆశతో వచ్చాడు. ఆసమయంలో అక్కడ కొంతమంది కుఱ్ఱవాళ్ళు వంటకోసం మాంసం ముక్కలు కొడుతున్నారు. అపుడు బాబా ఒక పిల్లవాడిని పిలిచి కొన్ని మాంసపు ముక్కలను బ్రాహ్మణుని సంచిలో వేయమని చెప్పారు. బ్రాహ్మణుడికి చాలా కోపం వచ్చింది. కాని భయంవల్ల ఏమీ మాట్లాడలేకపోయాడు. తిరిగి తన గ్రామానికి వెడుతూ ఉండగా దారిలో కాలవ కన్పించింది. ఆబ్రాహ్మణుడు ఆముక్కలను బహిరంగ ప్రదేశంలో విసిరేసి గుడ్డను నీళ్ళలో ముంచి శుభ్రంగా ఉతకడం మొదలుపెట్టాడు. ఆసమయంలో అతనికి తను ఉతుకుతున్న గుడ్డలో ఏదో గట్టిగా తగిలింది. బహుశ అది ఏ ఎముకముక్కో అయి ఉంటుందని భావించాడు. తరువాత పరీక్షగా చూసేటప్పటికి అది మిలమిల మెరుస్తున్న బంగారపు ముక్క. చాలా ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆబ్రాహ్మణుడు తాను ముక్కలను విసిరేసిన చోటకు వెళ్ళాడు. కాని అతనికి ఏముక్కలూ కనిపించలేదు. తన దురదృష్టానికి నిందించుకుంటూ మాంసాహారియైన బాబా మీద బాగా కోపగించుకున్నాడు. సద్గురువు యొక్క వేశాబాషలు పట్టించుకోక ఆయనను విశ్వసించిన వారె కృతర్దులౌతారు.
సాయిబాబా గారు జీవించి ఉన్న కాలంలో బ్రాహ్మణులందరూ కూడా ముఖ్యంగా ఆధ్యాత్మికంగా పురోగతి సాధించాలనుకునే వారందరూ మాంసాహారాన్ని భుజించరాదనే ఆలోచన కలిగి ఉండేవారు. అందుచేతనే మాంసాహారులని వారు కాస్త నిరసనగా (తేలికభావంతో) చూచేవారు. బహుశ అందుకనే బాబా అటువంటి వారందరికీ మంచి హితోపదేశం చేశారు. ఆధ్యాత్మికంగా ఎదగాలంటే మాంసాహారాన్ని త్యజించడమే కాదనీ, గురువు చెప్పిన ఆజ్ఞలను వినయవిదేయతలతో ఆచరించాలని, అంతేకాకుండా సత్పురుషులు లేక యోగీశ్వరులు ఏది ఇచ్చినా వాటిని సవినయంగా స్వీకరించాలని చెప్పారు. ఈ విషయంలో సాయిబాబా దృష్టిలో ఆయన చెప్పినది సరియైనదే. ఒకవేళ ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి మాంసాహారం తీసుకోవడం అడ్దంకే అయినట్లయితే మహమ్మద్ ప్రవక్త, జీసర్ క్రైస్ట్ వంటివారు మాంసాహారులే. మరి వారు ఆత్మసాక్షాత్కారాన్ని పొందలేదా? దీనినిబట్టి మనం గ్రహించుకోవలసినదేమిటంటే ఆత్మసాక్షాత్కారానికి మాంసాహారము అడ్డింకి కాబోదు.
ఆవిధంగా సాయిబాబా అహింస అనే మాటకి అసలయిన అర్ధాన్నిమనకందరికీ తెలియచేశారు.
(ఇంకా ఉంది)
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (11)అహింస -(2వ.భాగమ్)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (7) మానవజన్మ (1వ.భాగమ్)
- శ్రీసాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (3) వాక్కు 1వ.భాగమ్–Audio
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (7) మానవజన్మ (3వ.భాగమ్)
- శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (10)అహంకారం (1వ.భాగం)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments