Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
కళ్ళు మూసుకున్నారు బాబా. ధ్యానం చేయసాగారు.తనని దైవంగా నమ్మి, తన పట్ల భక్తి విశ్వాసాలు కనబరిచే వారిని కంటికి రెప్పలా కాపాడతారు బాబా.
రామచంద్రపాటిల్ బాబా భక్తుల్లో చెప్పుకోదగినవాడు. మనశ్శాంతి కోసం అతను బాబానిదర్శించాడు. ఆశించింది అందుకున్నాడు. మనశ్శాంతిని పొందాడు. నాటి నుంచి బాబా సాన్నిధ్యాన్ని అనుక్షణం కోరుకోసాగాడతను.
శ్రీరామనవమి, ఉరుసు ఉత్సవాల్లో రామచంద్ర చాలా ఉత్సాహంగా పాల్గొనేవాడు. అతని పనితనం, ఉత్సాహం చూసి, రామచంద్రని బాగా అభిమానించేవారు బాబా. షిరిడీకి పటేలుగా వ్యవహరించేవాడు రామచంద్ర.
ఆ కారణంగా షిరిడీలో ఉత్సవ సమయాల్లోనూ, భక్తులు బారులు తీరిన రోజుల్లోనూ తగు జాగ్రత్తలు తీసుకునేవాడు రామచంద్ర. గ్రామసేవకుల్ని నియమించి శాంతి భద్రతలను కాపాడేవాడు.
ఆ రోజుల్లో లక్షలాది భక్తులు బాబాని హాయిగా ఆనందంగా దర్శించుకోగలిగారంటే అదంతా రామచంద్ర చలవే!‘‘నువ్వు పటేలు కాదయ్యా, దాదావి.’’ అన్నారు బాబా, ఓసారి రామచంద్రతో.
‘‘దాదానా’’ నవ్వాడు శ్యామా.రామచంద్ర సన్నగా పీలగా ఉంటాడు. అతన్ని పట్టుకుని బాబా దాదా అనేసరికి నవ్వొచ్చింది శ్యామాకి.
‘‘రామచంద్రే దాదా అయితే షిరిడీలో అంతా దాదాలే’’ అన్నాడు మళ్ళీ నవ్వుతూ.‘‘కండా గుండె ఉంటేనే దాదా కాదయ్యా, అవి లేకపోయినా ఉన్నట్టుగా ప్రవర్తించేవాడు దాదానే!
రామచంద్రకి బలం లేకపోవచ్చు. బలగం ఉంది. ఆ బలగంతోనే షిరిడీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కాపాడుతున్నాడు. అందుకతను దాదానే, అనుమానం లేదు.’’ అన్నారు బాబా.
ఆనాటి నుంచి అంతా రామచంద్రని ‘దాదా’ అని సరదాగా ఆట పట్టించేవారు.
1916లో రామచంద్ర తీవ్రంగా జబ్బు పడ్డాడు. బాబా ‘సీమోల్లంఘనం’ ప్రకటించిన కొద్ది రోజులకే అతను మంచం పట్టాడు. ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. నీరసించిపోతున్నాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- “నీ దరిదాపుల్లో మరణం లేదు, నా బాధంతా వాడి గురించే”
- ‘‘భయం నా గురించి కాదు, తాత్యా గురించి”
- రామచంద్ర మాలిక్ ఊది! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 27
- నువ్వు పెట్టిన ప్రసాధం నాకు అందినది నువ్వు చింతించకు
- గాడ్గే మహరాజ్ గారి శిష్యుడు రామచంద్ర మహరాజ్ గారికి బాబా సహాయం–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments