సాయి బాబా చూపిన మార్గము మూడవ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

పేరు తెలియని భక్తుని మనోభావాలు నిన్నటి తరువాయి బాగం…

లీలామృతం చదివినపుడు ఆచార్య భరద్వాజ గారి గుఱించి తెలుసుకోవాలని అనిపించలేదు. నా ధ్యాస మొత్తం సాయి లీలలు చదవడం మీద ఉండేది.  క్రమేపి సాయి సన్నిధి, చదివిన తరువాత ఆయన అందిచిన గిఫ్ట్ ఏంటో తెలుస్కున్న.

సాయి కి ముఖ్య భక్తులైన వారి చరిత్రను సంక్షిప్తముగా సేకరించి వ్రాసారు.  ఆ బుక్స్ చదివితే  సాయి భక్తుడిని అని భావించే నాలాంటి వాళ్ళకు ఆ పుస్తకం నిజమైన నమ్మకము, ఓపిక అంటే ఏమిటి – ఎలా ఉంటుంది అని అర్థం అవుతుంది.

ఆ తరువాత రచయిత గుఱించి చదవాలనిపించింది.  తరువాత తెలిసింది భరద్వాజ గారికి ఎంత మంది భక్తులు ఉన్నారని. ఇంత మంది followers ఉన్నారంటే ఆయన సామాన్యుడు కాదు అని అనిపించింది.  ఇంటర్నెట్ లో ఆయన గుఱించి , వారి శిష్యులు రాసిన పుస్తకం చదివాక భరద్వాజ గారు “ఒక యోగి” అనే భావం కలిగింది.

తరువాత ఆయన యోగి కాదు, ప్రపంచానికి లేదా ఆంధ్ర దేశానికి సాయి ని  గూర్చి తెలిపిన మహానుబావుడు  అనిపించింది. ఇప్పటికి ఆయన ఎవరో చెప్పలేను గాని, భరద్వాజ గారి గుఱించి ఏమి చెప్పినా ఒకటి మాత్రం నిజం –

సాయి భక్తి అంటే ఎలా ఉండాలో? సాయి ని నిజంగా ఎలా సేవించాలో , సాయి ని ఏమి అడగాలో, నమ్మకము అనే పదానికి అర్థం, సాయి కి ఎలా దక్షిణ సమర్పించాలో, ఇంక ఎన్నో విషయాలు ఆయన వలననే తెలిసాయి….

భరద్వాజ గారి గుఱించి, ఇంక మనము తెలుసుకోవలిసిన విషయాలు చాలా ఉన్నాయి అని మాత్రం నాకు ఎప్పుడు అనిపిస్తుంది. మన అదృష్టం చేత, సాయి కృప వలన ఆయన గురించి రచించిన పుస్తకాలు, ఆయన ప్రసంగాలు మనకి అందుబాటులో ఉన్నాయి.

సాయి సేవకులు ఎవరికైనా నా విన్నపం ఏమిటంటే – ముందు ఆయన రచించిన పుస్తకాలు చదవండి అప్పుడు మీకు సాయి అంటే ఏమిటో కొంతవరకు భోధపడుతుంది. చదవడం అంటే – చదవడం కాదు, పారాయణ చేయాలి. పారాయణ చేసి మననం చేయాలి. సాయి గుఱించి చింతన ఆరంభించాలి. తరువాత మనకి చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి.

అప్పుడు ఆయన రచించిన మిగతా గ్రంధాలు, ఇతర యోగుల చరిత్రలు చదువుకోవాలి. మన ప్రశ్నలు సమాధానపడవు సరి కదా! ఇంక పెరుగుతాయి – అంటే ఏమిటన్న మాట, అసత్యమైన మన జీవితంలో సత్యం అనే దానిని తెలుసుకోవాలి అనే ఆసక్తి ప్రారంభం అయ్యిందన్న మాట.

దానికి కూడా భరద్వాజ గారి దగ్గర సమాధానం ఉంది… ఆయన రాసిన పరి ప్రశ్న, మతం ఎందుకు మొదలైన గ్రంధాలు చదవాలి…

సాయి గుఱించి భరద్వాజ గారు చేసిన ప్రసంగాలు రికార్డు చేయబడి ఉన్నాయి. అవి వింటే చాలా వరకు మన ప్రశ్నలు సమాధాన పడటమే కాకుండా, సాయి గుఱించి కూడా కొంత తెలుస్తుంది….

సాయి భక్తుడైన భరద్వాజ గారు ఎంతో సాధనతో సాయి కృప పొందారు. ఆయన పొందడమే కాకుండా ఎంతో మంది సాయి కృప పొందే మార్గాన్ని చూపారు. 

ఐతే ఒక సందేహం మనకు రావొచ్చు – సాయి దృస్టిలో భరద్వాజ గారు ఎంతో మనం కూడా అంతే కదా!… అటువంటప్పుడు మనం సాయి కృప పొందలేమా?..  అంటే… పొందవచ్చు. ఐతే దానికి దానికి తగిన యోగ్యత సంపాదించుకోవాలి.

భరద్వాజ గారు సంపాదించిన యోగ్యతే ఆయన చేత అంత సేవ చేయించింది. ఆధ్యాత్మికతలో మొదటి మెట్టుపై ఉన్న మనకి ఆయన రచనలు escalator లాగ పని చేస్తాయి.

భరద్వాజ గారు ఎంతో సాధన చేసి అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఎన్నో విషయాలు మనకు ఎదురయ్యే చాలా ప్రశ్నలకు సమాధానం చూపిస్తాయి.

భరద్వాజ గారు రాసిన, హేమడ్ పంత్ గారు  రాసిన  –  అంత సాయి కృపే, అదే వాళ్ల చేత అలాంటి గ్రంధాలు వ్రాయించింది. మనం గుర్తుంచుకోవాల్సింది ఒకటి ఉంది.  సాయి కృప అందరి మీద ఎల్లప్పుడు ఉంటుంది. దానిని కొందరే గ్రహిస్తారు. అది గుర్తించాలంటే, సాయి చెప్పినట్లు మన అహంకారం ఆయన పాదాల దగ్గర పెట్టాలి. సాయి కృప ఉంటే గాని అది మనం చేయలేము.

మనలో ఉండే గుణాలు మనల్ని అలా చేయనివ్వవు. వాటిని అధిగామించాదనికే మనం చేసే సాధన ఉపయోగపడాలి. సాయిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. భరద్వాజ గారి లాంటి వాళ్ళు ఆ మార్గాన్ని చేరుకోవడానికి వారధి లాంటి వాళ్ళు.

అందరు ఆయన రచనలు చదివి – నిస్వార్థంగా భరద్వాజ గారు చేసిన సాయి సేవకు పూర్తి అర్ధాన్ని ఇవ్వాలంటే – సాయి ప్రేరణ వల్ల మనలాంటి వారు ఆ గ్రంధాలను పాటించి  – బాబాని ఆశ్రయించి – నిధి ధ్యాస చేయడమే – సాయి కి మనం ఇచ్చే దక్షిణ.

సమాప్తం….

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles