దైవానుగ్రహము



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

దైవానుగ్రహము

ఈ ప్రపంచంలో దైవానుగ్రహము వలన లభించేవి 1) మానవ జన్మ, 2) పరమాత్ముని తెలుసుకోవాలి అనే కోరిక, 3) ఆత్మజ్ఞానాన్ని పొందిన మార్గదర్శకుల ఆశ్రయం.

యే జీవినందైన భగవంతునికి అపారమైన కృప కలిగినప్పుడు ఆ జీవికి మానవ జన్మ ప్రసాదిస్తాడు. ఆ విథంగా మానవ జన్మ లభించిన చాలా మంది జీవులలో పరమాత్మను తెలుసుకోవాలనె కోరిక బహు కొద్దిమందికి మాత్రమే కలుగుతూ ఉంటుంది.

మనం యెందుకు పుడుతున్నాము? యందుకు పెరుగుతున్నాము? యెందుకు చనిపోతున్నాము? ఈ బ్రతికి వున్న సమయంలో కష్టాలు గాని, సుఖాలు గాని, శాశ్వతంగా ఉంటున్నాయా? అసలు మన జీవితము యొక్క  గమ్యం, లక్ష్యం పరమావథి యేమిటి? అని ఈ విథంగా మనలో యెంతమందిమి ఆలోచిస్తున్నాము.

అందుకే భగవద్గీతలో శ్రీ కృష్ణపరమాత్మ ఇలా చెప్పాడు.

వేలకొలది జనులలో యే ఒక్కడో జ్ఞాన సిథ్థి కొఱకు ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించిన వారిలో ఒకానొకడు మాత్రమే పరమాత్మను తెలుసుకోగలుగుతాడు. కనక భగవంతుడు మనకు ఇచ్చిన వివేకాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకుని ఆయన అనుగ్రహంతో సంపాదించిన ఈ మానవ జన్మ లక్ష్యాన్ని తెలుసుకోవాలి.

ఓక్కసారి పైన చెప్పిన దానిని మరలా చదవండి. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాసులు ఉన్నాయి. మరి ఆ జీవరాసులన్నిటిని కాదని మనకు ఈ మానవ జన్మ లభించింది. లోగడ మనము సత్సంగ మహాత్మ్యం లో ఒకనొక పురుగు జన్మనించి, పక్షి, ఆవుదూడల జన్మలనించి మానవ జన్మ ఎట్లా  లభించిందో తెలుసుకున్నాము. మరి అటువంటి ఈ జన్మని మనం సార్థకం చేసుకోవాలి కదా. మనకి వివేకము, ఆలోచనా శక్తి అన్నీ ఉన్నాయి.

ఇంక  మనకి గురువులకే గురువు సద్గురువు బాబా గారు లభించారు. ఇంతకన్నా మనకి యేమికావాలి. ఆయన చెప్పిన మణిహారాలు, ప్రేరణలో చదువుకున్నాము. లీలలను చదివాము. బోథలు విన్నాము. మరింకేమి కావాలి? యేవి శాస్వతమో తెలుసుకోవాలి.

బాబా గారు యెప్పుడో ఆయన జీవించి ఉన్న రోజులలో చెప్పిన బోథలు ఇప్పటికీ మనము చదువుకుంటున్నాము, వింటున్నాము. అవి యెప్పటికి శాశ్వతంగా ఉంటాయి. మరి ఆరోజులలొ కంటికి కనిపించినవన్ని శాశ్వతంగా ఉన్నాయా. అందుచేత మనము ఆయన చెప్పిన నిత్య సత్యాలని మరలా మరలా మననం చేసుకుంటూ ఆయన చెప్పిన బాటలో పయనిస్తే అంతకన్నా కావలసినదేముంది. బాబా మనదగ్గిరే ఉన్నప్పుడు యెన్ని వేల కోట్ల థనంతో సరిపోల్చగలము. ఆయన సన్నిథి మనకు తరగని పెన్నిథి.

యేమానవుడూ కూడా యేవిథమైన సహాయము లేకుండా విజయాన్ని సాథించలేడు. దానికి తనలో నమ్మకం, మార్గదర్శి యొక్క సంపూర్ణ సహాయసహకారాలు అవసరం. అందుచేత యెవరయితే అన్ని అడ్డంకులూ దాటి దారి సుగమం చేసుకుని నడిచారో వారే యితరులకు మార్గం చూపెట్టగలరు. ఈ మార్గం చూపించేవాడికి ప్రకృతి యొక్క రహస్యాలన్నీ తెలిసివుంటాయి. ఆయననే సద్గురువు అంటాము. అందుచేతే మనము సద్గురువుని పట్టుకోవాలి.

ఆయన బిడ్డలమైన మనము సాయి ప్రవచనాలు ఆయన చెప్పిన విలువైన అమృతవాక్కులు మననం చేసుకుంటూ వాటిని ఆచరణలో పెట్టాలి. సాయి యేవ్యక్తుల మథ్య భేదం చూపలేదు. అందుచేత మనం కొంచమైనా యితరులకు సాయపడాలి. సాయి చూపిన ప్రేమతో మనం కూడా ఆయన అడుగు జాడలలో నడవాలి.

“సాయి రహం నజర్ కరనా, బచ్చోంకా పాలన్ కరనా”

సాయీ మీ దయాదృష్టి మామీద ప్రసరింపచేయి. మీ పిల్లలమైన మమ్ము రక్షించు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles