అదృష్టవంతురాలివమ్మా గురువుగారి ఫోటో కి పెర్మిషన్ వచ్చింది



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై !!
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై !!

నాకు పెళ్లి అయ్యాక,మా ఇంట్లో బాబాది లైఫ్ సైజు ఫోటో పెట్టుకోవాలని ఉండేది.ఇప్పుడు గురువుగారు కూడా ఉన్నారు.కదా! బాబా తో పాటు గురువు ది కూడా లైఫ్ సైజు ఫోటో కూడా పెట్టుకుంటే బాగుంటుంది అనిపించింది.మళ్ళీ డౌట్ వచ్చింది.

అంకుల్ వాళ్ళ ఇంట్లో, రజని అక్క వాళ్ళ ఇంట్లో కూడా గురువు గారివి చిన్న సైజు ఫొటోస్ ఉన్నాయి.గురువు గారివి, బాబా అంత పెద్ద ఫొటోస్ ఉంటాయా ? ఒకవేళ ఉన్నాకూడా గురువుగారు ఆలా పెట్టుకోవడానికి అనుమతిస్తారా?(అప్పటి వరకు తెలియదు,గురువుగారు అనుమతి ఇవ్వరు పెద్ద ఫొటోస్ కి అని ) ఏవరైనా ఆలా పెట్టుకున్నారా?గురువుగారిది పెద్దగా ఉన్న ఫోటో ఎలా ఉంటుంది.?ఇలా అన్ని అనుకున్నాను.

రాత్రి కలలో ఒక పెద్ద హాలులో సోఫాలో కాలు మీద కాలు వేసుకోని కూర్చున్నారు.నేను ఇంకా కొంత మంది సోఫా కి వెనక వైపు కొంచం దూరంలో ఒక పక్కకి గోడకి ఆనుకుని,చేతులు కట్టుకుని నిల్చున్నాము. లైన్ ప్రకారం చూస్తే,నిల్చున్నవాళ్లలో నేను 2nd పర్సన్ ని .నా ముందు ఎవరో అంకుల్ ఉన్నారు.

మాకు గురువు గారి సైడ్ ఫేస్ మాత్రమే కనిపిస్తుంది.గురువు గారి దగ్గర ఒకతను చేతులు కట్టుకుని నిల్చుని ఉన్నాడు.

ఇంకొక ఇద్దరు బాబా ది పెద్ద ఫోటోని గురువు గారి దగ్గరకు తీసుకొచ్చారు.గురువుగారు ఆ ఫోటో ని చేతితో ఆలా టచ్ చేయగానే వాళ్ళు ఆ ఫోటో ని తీసుకెళ్లారు.తరువాత ఇంకొక ఇద్దరు గురువుగారి ఫోటో ని తీసుకుని వచ్చారు.గురువుగారు ఆ ఫోటోని కూడా టచ్ చేయగానే ఆ ఫోటోని కూడా తీసుకెళుతున్నారు.

గురువుగారి దగ్గర నిల్చున్న అతను గురువుగారితో మీరు ఎప్పుడు బాబా ఫోటోకి అనుమతిస్తారు కానీ ఇంట పెద్ద మీ ఫోటోకి అస్సలు అనుమతినివ్వరు.1 st టైం ఇలా చేసారు ఎందుకో తెలుసుకోవచ్చా?అని అడిగారు.దానికి గురువుగారు, అది ఇందాక తాను అడిగింది లేవయ్యా అందుకే అన్నారు.

ఇందాక నుంచి ఇక్కడ ఎవరు మాట్లాడట్లేదు.అందరు కాం గానే ఉన్నారు.మరి గురువుగారు ఇందాక తాను అడిగింది లేవయ్యా అని ఎవరిని అన్నారు అనుకున్నాను.మళ్ళీ అనిపించింది ఇందాక నేను అనుకున్నాను కదా గురువుగారి ఫోటో పెట్టుకోవాలని సో నా గురించే అన్నారా ఏంటి? నేను ఇక్కడ మనసులో అనుకుంది గురువు గారికి తెలిసిపోయిందా అనుకున్నాను.మెలుకువ వచ్చింది.

జనార్దన్ అంకుల్ కి చెపితే ,గురువుగారు ఆలా బాబా అంత పెద్ద సైజు ఫోటోకి జనరల్ గా అనుమతి ఇవ్వరు.నీకు ఆలా ఇచ్చారేమో అన్నారు.తరువాత ఒకసారి భాగ్యలక్ష్మి ఆంటీ అంకుల్ వాళ్ళ ఇంటికి సత్సంగం వార్షికోత్సవం కి ఇన్వైట్ చేయడానికి అంకుల్ వాళ్ళింటికి వచ్చినప్పుడు ఆంటీ తో చెపితే అదృష్టవంతురాలివమ్మా గురువుగారి ఫోటో కి పెర్మిషన్ వచ్చింది అన్నారు.

అప్పుడు నాకు అంతగా అర్ధం కాలేదు.ఎందుకు వాళ్ళు గురువుగారి ఫోటో పెట్టుకోవడానికి నాకు పెర్మిషన్ ఇచ్చారంటే అంతగా హ్యాపీ అయ్యారు అని.

కానీ,చాల రోజుల తరువాత గురువుగారి సత్సంగం ఆడియో వింటున్నప్పుడు,అక్కడున్న భక్తులు,గురువుగారి ఫోటో పెట్టుకోవడానికి గురువుగారిని పెర్మిషన్ అడుగుతుంటే గురువుగారు స్ట్రాంగ్ గా రిజెక్ట్ చేస్తున్నారు.

అప్పుడు వద్దు అని గురువుగారి అంత స్ట్రాంగ్ వాయిస్ వింటే,గురువుగారికి అస్సలు ఇష్టం లేదు అని తెలిసిపోయింది.

అలాంటిది నేను ఆరోజు జస్ట్ బాబా తో సమానంగా గురువుగారి లైఫ్ సైజు ఫోటో పెట్టుకుంటే ఎలా ఉంటుంది.పెర్మిషన్ ఇస్తారా?అని అనుకోగానే ఇలా కలలో ఆశీర్వదించారు కదా అనిపించింది. 

స్టార్టింగ్ లో బాబా కి అప్పుడప్పుడే దగ్గరవుతున్నప్పుడు.మా హాస్టల్ లో ఒక అక్క వాళ్ళ రూమ్ లో బాబా నవ్వుతు ఉన్న పింక్ కలర్ ఫోటో చూసాను.నాకు అలాంటి బాబా ఫోటో కొనాలనిపించింది.చాల షాప్స్ లలో చూసాను కానీ,అక్క దగ్గర ఉన్న ఫోటో నన్ను ఆకర్షించినంతగా ఏ ఫోటో కూడా ఆకర్షించట్లేదు.

ఆ సైజు లో ఆ కలర్ లో ఉన్న ఫొటోస్ ఎక్కడ కన్పించలేదు.నాకు అలాంటి ఫోటోనే కొనాలి అప్పటి వరకు కంప్రమైస్ అయి వేరే ఫొటోస్అ కొనద్దు అనిపించింది.

ఇలా ఉండగా ఒకరోజు ఆ అక్క హాస్టల్ వెకేట్ చేసి వెళ్ళింది.అన్ని తీసుకెళ్లింది కానీ,ఆ ఒక్క బాబా ఫోటో మాత్రం ఎదురుగా టేబుల్ మీదే వదిలేది వెళ్ళింది.ఆ ఫోటోకి కొన్నప్పుడు ఉండే కవర్ కూడా తీయలేదు తాను.

నేను ఆ రూమ్ ముందు నుండి వెళ్తూ చూస్తే ఫోటో ఉంది.అక్క లేదు,రూమ్ మొత్తం ఖాళీగా ఉంది.ఫోటో తీసుకుందామా అనిపించింది కానీ,యెంత ఇష్టమైతే మాత్రం ఒకరిది నాకెందుకు.ఎవరైనా ఇస్తే తీసుకుంటే ఓకే కానీ,ఆమె మర్చిపోయింది ఎవరు లేరు కదా అని తీసుకుంటే బాగోదు.నేను అలాంటిది కొనుక్కుంటాలే అనుకున్నాను.

నా మనసు అటునుండి వెళ్తున్నప్పుడల్లా ఫోటో వైపు పీకుతోంది.తరువాతి రోజు మా రూమ్ లో ఉండే అక్క ,ఆ రూమ్ కి షిఫ్ట్ అయింది.ఆమె రూమ్ సర్దుకుంటూ అటుగా వెళ్తున్న నన్ను పిలిచి ఆ అమ్మాయి బాబా ఫోటో మర్చిపోయింది.ఆమెకి కాల్ చేస్తే మళ్ళీ ఫోటో కోసం హాస్టల్ కి రావడం కుదరదు అంది .

నేను ఎలాగూ పూజలు చేయను.నీకు బాబా అంటే ఇష్టం కదా అని నీకు ఇద్దాం అనుకున్నాను తీసుకుంటావా అంది.అప్పుడు చూడాలి నా ఆనందం.వెయ్యి వోల్టుల బల్బు కూడా సరిపోదేమో నా మొఖం ముందు అనిపించింది అక్కకి థాంక్స్ చెప్పి నా రూమ్ కి తెచ్చుకున్నాను.

అప్పటి నుండి ఎప్పుడు ఆ ఫోటో నాతోనే ఉంటుంది.ఆ ఫొటోలోని బాబా,నా దగ్గరకు రావడం కోసమే నేను ఎన్ని షాప్స్ లో చూసిన ఏ ఫోటో నచ్చలేదు అనుకున్న.

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles