శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (21)బోధనలు సంగ్రహంగా



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయిబాబా వారి బోధనలు మరియు తత్వము – (21)బోధనలు సంగ్రహంగా

ఆంగ్లమూలం : లెఫ్టినెంన్ట్ కల్నల్ ఎమ్.బి. నింబాల్కర్

తెలుగు అనువాదమ్ : ఆత్రేయపురపు త్యాగరాజు

సాయిబాబా వారి అంకిత భక్తుడయిన కాకాసాహెబ్ దీక్షిత్ ‘రఘునాధ్ సావిత్రి సాయినాధ్ భజనమాల’ పుస్తకంలో ముందు మాటగా సాయిబాబా వారు చెప్పిన బోధనలను కొద్ది మాటలలో వివరించారు.

“భగవంతుడనే వాడు ఉన్నాడు.  ఎవ్వరూ ఆయన కన్నా గొప్పవారు కాదు.  ఆయన సకల జీవరాశులలోను, ఆఖరికి చలనం లేని వాటిలో కూడా వ్యాపించి ఉన్నాడు.  ఆయన లీలలను తెలుసుకోవడం అసాధ్యం.  అవి అగాధం.  సృష్టి, స్థితి, లయకారకుడు ఆయనే.  రక్షకుడు ఆయనే.  నిర్వహించేది, అంతంచేసేది ఆయనే.  ఆయన మనలను ఏవిధంగా నడిపిస్తే ఆవిధంగా జీవించాలి.  అనవసరమయిన వాటికోసం ఆశ పడకుండా ఆయన ప్రసాదించిన వాటితోనే సంతృప్తిగా జీవించాలి.  ఆయన అనుజ్ఞ లేనిదే ఆకయినా కదలదు.”

“ప్రతివారు నిజాయితీగా ప్రవర్తించాలి.  వివేకంతో (ఏది మంచి, ఏది చెడు అని నిర్ణయించుకునే జ్ఞానం) మెలగాలి.  నేనే కర్తననే అహంభావం లేకుండా మన పనిని మనం నిర్వర్తించాలి.  ఫలితాన్ని భగవంతునికి వదలి మనం నిమిత్త మాత్రులుగా ఉండాలి”.

“సకల ప్రాణుల ఎడల దయ కలిగి ఉండాలి.  వాదాలలో తల దూర్చరాదు.  ఎవరయినా మనలని నిందించినట్లయితే శాంతం వహించాలి.”

“ఇతరులు మన మీద చేసే నిందాపూర్వకమయిన మాటలని మన శరీరానికి తూట్లు పొడవవు.  ఇతరులపై శతృత్వాన్ని పెంచుకోరాదు.  దూషణ చేయరాదు.  ఎవరేమి చేసినా మనం పట్టించుకోకూడదు.  ఎవరి పని వారిదే మన పని మనదే.”

“ఎల్లప్పుడూ శ్రమిస్తూనే ఉండాలి.  సోమరితనంగా ఉండవద్దు.  భగవంతుని నామాన్ని స్మరిస్తూ ఉండాలి.  తిండి తినడం, నీరు త్రాగడం ఏవీ మాననక్కరలేదు. అన్నీ మితంగా ఉండాలి. మన మనస్సు మన స్వాధీనంలో ఉండాలి.”

(సమాప్తం)

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles