Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా “నీకు తోచిన దానినే నీవు నిర్దారణ చేయుటకు ప్రయత్నించకుము” అనే వారు.
పండిత హరిభట్టు (హరిభద్ర) మహాపండితుడు. రాజపురోహితుడు. ఆయనకు వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు కొట్టినపిండి.
తనకు తెలియని శ్లోకాన్ని, దాని అర్ధం వివరించిన వారికి దాసుడనవుతాననే వాడు. అతడు జైన మత ద్వేషి.
ఒకసారి ఒక మహిళ ఏదో శ్లోకాన్ని వల్లెవేసుకుంటూ పోయింది. ఆ శ్లోకానికి అర్ధం తెలియలేదు హరిభట్టుకు.
మరునాడు కూడా అలానే జరిగింది. ప్రయత్నించినా అర్ధం తెలియలేదు. చివరకు ఆమెనే అడిగాడు.
“నాకు తెలియదు. నా ఆచార్యులు వివరిస్తారు” అని ఆమె హరిభట్టును ఆచార్యుల వద్దకు తీసుకుని వెళ్ళింది. ఆచార్యులు అర్ధం చెప్పి వివరించారు. ఆ శ్లోకం క్రొత్తగా ఉంది హరిభట్టుకు.
ఆచార్యుని పేరు జినదత్త సూరి. ఆ మహిళ పేరు సాథ్వియాకిని మహత్తర. వారు జైనులు. హరిభట్టు జైన మతం స్వీకరించాడు.
హరిభట్టు ఇద్దరు మేనల్లుళ్ళు బౌద్ధుల వలన మరణించారు. ప్రతీకారం తీర్చుకోదలచాడు హరిభట్టు.
అయన మంత్రవేత్త కూడా. భగ భగ మండే అగ్నిపైన పెద్ద మూకుడు పెట్టి, అందులో నూనెను సల సల మరిగేటట్లు చేసి, అందులోనికి, ఆకాశమార్గాన ఒకొక్క బౌద్ధుడే వచ్చి ఆ కాగే నూనెలో పడి మరణించాలని ఏర్పాటు చేశాడు.
మంత్ర బలంతో తన మేనల్లుళ్ళ చావుకు ప్రతీకారం తీర్చుకుందామని తయారయ్యాడు. ఆశ్రమము తలుపులు మూసివేయించాడు.
ఇక మంత్రాలు చదువ నారంభించాడు. ఇంతలో ఆశ్రమపు తలుపులు ఎవరో కొడుతున్నారు. పట్టించుకోలేదు. మరల కొట్టారు. పట్టించుకోలేదు.
“నేనే సాథ్వి మహత్తరను. ప్రాయశ్చిత్తం తెలుసుకోవటానికి వచ్చాను. తలుపు తెరువు” అన్న మాటలు వినబడ్డాయి. సాథ్వి మహత్తరను హరిభట్టు గౌవరవించేవాడు. వెంటనే తలుపు తెరచాడు.
“నా పాదాల క్రింద ఒక కప్ప పడి మరణించింది. ప్రాయశ్చిత్తం ఉంటుందా?” అని అడిగింది. “ఉంటుంది” అన్నాడు హరిభట్టు.
“సరే, నా పాదాల క్రింద అసంకల్పంగా ఒక అల్పజీవి పడి మరణిస్తే ప్రాయశ్చిత్తం ఉంటుంది అంటున్నావు. నీవు 1444 మనుజుల ప్రాణాలను సంకల్పించి మరీ తీస్తున్నావు. నీకు ప్రాయశ్చిత్తం ఉండదా?” అని అడిగింది సాథ్వి మహత్తర.
మాత మహత్తర మాటలు ఆలోచింపచేశాయి ఆయనను.
క్షణికోద్రేకానికిలోనై 1444 నిండు ప్రాణాలను తీయబోయాను. క్షణం ఆలస్యమైతే ఎంత పాపాన్ని మూటగట్టుకునే వాడినో? అని, మాత ఆ పాపాన్నుండి కాపాడింది అని, ఆ మహత్తరను క్షమింపమన్నాడు.
1444 జైన గ్రంథాలను వ్రాశాడు ప్రాయశ్చిత్తంగా. ప్రతి రచనలో సాథ్వి యాకిని మహత్తర పుత్రుడని వ్రాసుకున్నాడు హరిభట్టు. తేదీ వివరాలు లభించలేదు.
కోపం రాక్షసునిగా, క్షమ దైవీగుణ సంపన్నుడిగా చేస్తుంది.
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ప్రేమ బీజాన్ని నాటిన సాయి ….. సాయి@366 మార్చి 7….Audio
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- ఆరోగ్యం ప్రభాకరరాదిచ్చేత్ …. మహనీయులు – 2020… ఆగస్టు 29
- చెరసాలలో జననం… మహనీయులు – 2020… జూలై 23
- అడ్డదారి …. …. మహనీయులు – 2020… ఆగస్టు 3
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments