Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఓం సాయి రామ్,
తాత, మనవరాలు (లక్ష్మి ప్రసన్న).
ఇది ఏ బందమో కానీ తాత చూపించే ప్రేమ అనిర్వచనీయం.
దానిని ఒక పదజాలంతో వర్ణించి దాని విలువను నేను తగ్గించలేను.
నా దగ్గర బాబా వారిది చిన్న విగ్రహం ఉంటుంది. ఆయనకు సోప్ తో స్నానం చేయించి కొత్త బట్టలు వేసి, అన్ని ఒకటే కలర్ ఉండేలా వేసి చూసుకుంటూ ఉంటాను.
ఒకసారి నాకు అనిపించింది బాబా వారిది పెద్ద విగ్రహం తేవాలి అని, అదీ షిర్డీ నుండి తెస్తే ఇంకా బాగుంటుంది అనీ .
అదీ దసరా సమయం మేము షిర్డీ బయలుదేరుతూ ఇంట్లో ఒక పీటం వేసి వెళ్లాను బాబా ఎలాగైనా సరే, మీరు వచ్చి ఆసీన్నులు కావలసిందే అని.
మేము షిర్డీ చేరుకొని తిరిగి ఇంటికి వచ్చే రోజు బాబా విగ్రహం తీసుకున్నాము. చాలా బరువుగా ఉంది. కష్టం కాని అదే విగ్రహం కావాలి, ఆయనకు సరిపడే టోపీలు, దండలు, కూడా తీసుకున్నాము.
బట్టలు, అవి చాలా రేట్ చెప్పారు. అసలు తగ్గడం లేదు నాకు ఏమో అంత రేట్ పెట్టాలని లేదు ఎందుకు అంటే నాకు టైలరింగ్ వచ్చు బాబాకి కావలసినవి అన్ని నేను తయారుచేకుంటాను. అంతే తప్ప వేరే కాదు.
కానీ ఈలోపే తాత ఈ పిల్ల బట్టలు కొనేలా లేదు అనుకున్నట్టు ఉన్నారు. ఇక ప్యాకింగ్ చేసే సమయం నేను వద్దు అని చెప్పా, ఆగండి నేను షిర్డీ అంతా తిప్పుకొని వస్తా అని చెప్పా.
ఆ షాప్ అతను మీరు మోయ్యలేరు అయిన లోపలికి రానివ్వారు పెద్ద విగ్రహాలని అన్నాడు.
ఆ మాటలు అన్ని విన్నా అప్పుడు నేను ఇలా చెప్పా తాత మీరు బరువు తగ్గండి ప్లీజ్ లేదా నాకు శక్తి ఇవ్వండి. అని చెప్పి, మొదట నాకు ఇష్టం అయిన ద్వారకామాయి కి తీసుకువెళ్ళా అదీ లైన్ లో.
కాని లోపలికి వెల్లాగానే అమ్మా లైన్ లో ఎందుకు వచ్చారు, మామూలుగా రావచ్చుకదా ఇంత బరువు అయ్యో అని బాబాని లోపల అంతా తాకించి ఇచ్చారు.
మరలా సమాది మందిర్ అసలు లోపలి వెళ్లనీయలేదు. కానీ తాత ఇష్టం కాని వాళ్ళది కాదుకదా అక్కడ ఊడ్చే అతను ఒక అతను అమ్మా ఇలా ఇవ్వండి అని చెప్పి బాబాని సమాది వద్దకు తెసుకొని వెళ్ళాడు.
మామూలుగా లోపలికి వెళ్ళిన బాబా గందo, గులాబి మాలతో తిరిగి వచ్చారు. అతను జేబు లోంచి ఇవిగో అమ్మా బాబాకి బట్టలు తీసుకో అని ఇచ్చారు. హా ! ఇక అందరూ దండం పెట్టడం మొదలుపెట్టారు.
ఇందాక ఇలా లేదు ఇప్పడు ప్రాణం పోసుకున్నారు బాబా అనిపించింది. మరల ఒక జంట వచ్చి ఇవి బాబా వస్రాలు సమాది మందిర్ లో ఇచ్చారు మాకు ఇవి ఇంటికి తీసుకువెళ్ళడం ఇష్టం లేదు అని నాకు ఇచ్చి వెళ్ళారు.
అయ్యో తాత నేను రమ్మంటే బట్టలు కూడా సర్దుకొని నువ్వు నాతో వస్తున్న అతిదిలా అనిపిస్తున్నారు. కాని ఈ అతిది మళ్ళీ నానుండి వెళ్ళే అతిది కాదు. చాలా నవ్వుకున్నాము. అయ్యో తాత . ఇక చిన్నగా ట్రైన్ లో చేరాము.
అసలు ఎక్కడ పెట్టాలి బాక్స్ అర్ధం కాలా, మా వారి బెర్త్ లో తల దగ్గర పెట్టి తను సర్దుకొని పడుకున్నాడు.
కాని మద్య రాత్రి నా బెర్త్ లో ఒక ముసలి ఆయన కూర్చున్నారు, నన్ను ఎక్కడ తాకుతాడో అని ఆయన , నేను ఎక్కడ తాకుతానో అని నేను ఇద్దరమూ ముడుచుకొని ఉన్నాము. లేద్దాం అంటే నిద్రలో ఉన్నా.
ఉదయం లేచాక మా వారు చెప్పారు రాత్రి అంతా కూడా ఆ బాక్స్ లోంచి ఒక వైబ్రేషన్ అది ఎదో ఒక విదమైన ఓం అనే విదంగా వస్తుంది. సరిగా పడుకోలేదు అని చెప్పారు.
మరి నేను చూసింది !! కచ్చితంగా తాత మాతో వచ్చారు తన మూటతో సహా.
ఇంటికి వచ్చాక ఆయనకు కావలసిన అన్నీ ఆయనే సమకూర్చుకున్నారు.
ఇవి అన్నీ ఇప్పుడు గుర్తువస్తే తాత ప్రేమ మన మీద ఎంతగా ఉంటుందో.
బాబా మమ్ము అందరిని ఈ ప్రాపంచికo నుండి దూరం చేసి నీ లీలలతో తరించి పోయేలా అందరికి ఆశీర్వాదం ఇవ్వు తండ్రి.
Latest Miracles:
- బాబా తనకు కావలసినవన్నీ సర్దుకొని నాతో వచ్చారు.–Audio
- పారాయణ లో భక్తుడు తనకు తాను పెట్టుకున్న ఆంక్షలకు బాబా సమ్మతి.
- తనకు ఆరోజు నైవేద్యం పెట్టలేదని భక్తుని కలలో కనిపించి గుర్తుచేసిన బాబా వారు
- బాబా నిన్ను గొడుగు పట్టి ఇక్కడకు తీసుకు వచ్చారు. ఎవరినీ ఏమి అడగకు….శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ
- బాబా నాతో భగవద్గీత చదివించారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments