నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడతారు.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మాండనాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ  శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా      …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

శాంతారాం బల్వంత్ నాచ్నే దహనూకర్,హెడ్ గుమస్తా,తాలూకా షెరిస్తాడార్,మెజిస్ట్రేటు కోర్టు,కుర్లా,కాయస్థప్రభు.

కానీ అది సాధారణ హితవాక్యం కాదని,నాకు ప్రత్యేకంగా చేసిన హెచ్చరిక అని 1914లో జరిగిన ఒక సంఘటన ద్వారా తెలిసింది.

నేనప్పుడు దహనులో కోశాధికారిగా పనిచేస్తూ ఉండేవాడిని,రామకృష్ణ బల్వంత్ పాన్సే అనే వ్యక్తి అక్కడ ఉండేవాడు.అతనికి మతిస్థిమితం లేదు.ఎవరికీ ఏ హానీ తలపెట్టనందున అతనిని ఎవరు పట్టించుకునేవారు కాదు.

ఒకరోజు నా దినచర్యలో భాగంగా బాబా ఫోటోను ఇతర దేవతామూర్తులను పూజిస్తున్నాను.మా పూజగది సమీపంలో ఉన్న వంటింటి గుమ్మంలో ఆ పిచ్చివాడు నిలబడి ఉన్నాడు.

అకస్మాత్తుగా అతను నా మీద పడి రెండు చేతులతో నా మెడ పట్టుకొని,”నీ రక్తం త్రాగుతాను” అంటూ నా గొంతు కోరికేందుకు ప్రయత్నించాడు.

నాకప్పుడు ఏం చేయాలో తోచక నా చేతికి అందిన ఉద్ధరని తీసుకొని అతని నోట్లో గుచ్చాను.దాంతో పాటుగా నా చేతివేలు అతని నోట్లోకి వెళ్లిపోయింది.అతడు నా వేలును గట్టిగా కొరకసాగాడు.నేను మరోచేత్తో నా మెడను విడిపించుకునేందుకు ప్రయత్నించసాగాను.అతని గోళ్ళు నా మెడలోకి గుచ్చుకుపోయాయి.

అంతలో మా అమ్మ పరుగున వచ్చి అతని పట్టునుండి విడిపించడానికి సహాయపడింది.అప్పటికే నేను స్పృహ కోల్పోయాను.తరువాత ఏవో చికిత్సలు చేసి నన్ను మామూలు స్థితికి తెచ్చారు.నా వేళ్ళకైన గాయాలు కూడా మానిపోయాయి.

ఆ తరువాత నేను శిరిడీ వెళ్ళినప్పుడు అక్కడున్న అణ్ణాచించినీకర్ అను భక్తునికి బాబా నన్ను చూపించి  “అన్నా,నేను ఒక్క క్షణం ఆలస్యం చేసినా ఇతను చనిపోయి ఉండేవాడు.

ఆ పిచ్చివాడు ఇతని గొంతు నులిమేసి ఉండేవాడు.అతని బారి నుండి నేని విడిపించాను.ఏం చేస్తాం?నా బిడ్డలను నేను కాపాడకపోతే మరెవరు కాపాడతారు?”అన్నారు.

31.3.1915న మాకు ఒక భయానక సంఘటన ఎదురయ్యింది.నేను,శాంతారాం మోరేశ్వర్ పాన్సే,మరికొందరం ఎడ్లబండిలో ఒక దట్టమైన అడవిగుండా రాత్రి వేళ ప్రయాణిస్తూ ‘రాన్ షెట్ కనుమ’ వద్దకు వచ్చాము.

ఆ ప్రదేశంలో పెద్దపులుల బెడద ఎక్కువని చెబుతారు.అకస్మాత్తుగా ఒకచోట భయంతో ఎద్దులు వెనుకకు నడవసాగాయి.

అదృష్టవశాత్తు అవి బండిని ప్రక్కకు లాగలేదు.ఆ ఇరుకు దారిలో బండి ఏమాత్రం ప్రక్కకు జరిగినా అక్కడున్న అగాధమైన లోయలో పడి ఎడ్లబండితో సహా మేమందరము నామరూపాలు లేకుండా పోయేవాళ్ళం.

అంతలో శాంతారాం ఎదురుగా పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపించాడు.మా బండికి కాస్త దూరంలో ఒక పెద్దపులి పడుకొని మా వైపే చూస్తూ ఉంది.చీకటిలో దాని కళ్ళు మిల మిలా మెరుస్తున్నాయి.

బండి లోయలో పడిపోకుండా,చక్రాలు వెనక్కి వెళ్ళకుండా అడ్డంగా పెద్దరాయిగానీ,కర్రగానీ పెట్టేందుకని శాంతారాం పాన్సే క్రిందకు దిగదలచి నన్ను బండి పగ్గాలు పట్టుకోమన్నాడు.నేను పగ్గాలు పట్టుకొని ఎలుగెత్తి “ జై  సాయిబాబా!పరుగున వచ్చి మమ్మల్ని కాపాడు”అని అరిచాను.మిగిలిన వారు కూడా పెద్దగా అరిచారు.దానితో పులి భయపడి మా బండి ప్రక్కనుండి వెళ్లి పోయింది.

బాబాపై నాకున్న నమ్మకమే నాకు ధైర్యాన్నిచ్చి ఆ సమయంలో బాబాను ఎలుగెత్తి పిలిచేలా చేసి ఆ ప్రమాదం నుండి బయట పడేసింది.

పై సంఘటన జరిగిన తరువాత అదే సంవత్సరం (1915లో)శిరిడీ బయలుదేరాను.

స్టేషనులో వి.ఎస్.సామంత్ అను భక్తుడు ఒక టెంకాయ,రెండణాలు ఇచ్చి,ఆరెండణాలతో కలకండ కొని,వాటిని బాబాకు సమర్పించమని కోరాడు.

నేను శిరిడీ చేరి బాబాను దర్శించి టెంకాయ సమర్పించాను.కానీ సామంత్ ఇచ్చిన రెండణాల విషయం పూర్తిగా మర్చిపోయాను.

నేను ఇంటికి వెళ్ళడానికి బాబా అనుమతి కోరినప్పుడు “ అలాగే చితలీ మీదుగా వెళ్ళు.కానీ ఈ పేద బ్రాహ్మణుడి రెండణాలు నీ దగ్గరే ఎందుకు పెట్టుకున్నావు?(మాఝే గరీబ్ బ్రాహ్మణాచే దోన్ ఆణే కా ఠేవ్ తోస్)” అని బాబా అడిగారు.

బాబా అన్న మాటతో నాకు ఆ సంగతి గుర్తుకొచ్చి సామంత్ ఇచ్చిన రెండణాలు సమర్పించాను.నేను తిరిగి అనుమతి కొరకు ప్రార్థించినప్పుడు “ఇప్పుడు నీవు వెళ్ళవచ్చు.ఏదైనా పనిచేస్తానని ఎవరి దగ్గరైనా ఒప్పుకుంటే దానిని బాధ్యతాయుతంగా నిర్వహించు.లేదా ఒప్పుకోకు” అని నవ్వుతూ హితపు పలికారు.

ఒకసారి నేను శిరిడీలో ఉన్నప్పుడు శంకరరావు బాలకృష్ణవైద్య  వచ్చాడు.బాబా అతనిని 16 రూపాయలు దక్షిణ అడిగారు.శంకరరావు తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు.

కాసేపాగి మళ్ళీ శoకరరావును 32 రూపాయల దక్షిణ అడిగారు.శంకరరావు మళ్ళీ అదే సమాధానమిచ్చాడు.

మరి కాసేపాగి ఈసారి 64 రూపాయలు దక్షిణ అడిగారు. “బాబా మేము ధనవంతులము కాదు.మా దగ్గర అంతంత పెద్దమొత్తాలెలా ఉంటాయి?” అన్నాము.”అయితే వసూలు చేసి ఇవ్వండి?“అన్నారు.బాబా,ఈ మాటలు బాబా త్రికాలజ్ఞతకు అద్దం పడతాయని మాకు తరువాత తెలిసింది.

ఎలాగంటే కొన్ని రోజుల తరువాత బాబా అస్వస్థకు గురయ్యారు.అప్పుడు నామసప్తాహం జరిగింది.వచ్చిన వారందరికీ పెద్ద ఎత్తున అన్నసంతర్పణ జరిపేందుకు చందాలు సేకరించాల్సి వచ్చింది.

ధాబోళ్కర్ ఆదేశానుసారం నేను,శంకరరావు చందాలు వసూలు చేశాము.వసూలైన మొత్తం సరిగ్గా 64 రూపాయలు మాత్రమె.ఆడబ్బు శిరిడీ పంపాము.

ప్లేగు జ్వరంతో బాధపడుతున్న రావూజీ సఖారాం వైద్య కుమారుడు “మోరు” కొరకు నేను బాబా ఊదీని ఇచ్చాను.ఊదీ మహిమతో జ్వరం తగ్గింది.

తలారీగా పనిచేసే పరశురాం అప్పాజీ నాచ్నే ఒక దీర్ఘవ్యాధితో బాధపడేవాడు.

కాస్త వైద్య పరిజ్ఞానమున్న మా నాన్న,మరికొందరు వైద్యులు చేసిన చికిత్సలు విఫలమయ్యాయి.కానీ బాబా పటం ముందు సాంబ్రాణి కడ్డీలు,అఖండ నేతి దీపం వెలిగించి ప్రార్థించడం ద్వారా అతని వ్యాధి నయమైoది.

1915 లో నేను ఎస్.బి.వైద్యతో కలిసి బాబాను దర్శించాను.అతను బాబాకు వెండి పాదుకలు సమర్పించాడు.వాటిని బాబా చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలని అతని ఉద్దేశ్యo.

కాని బాబా వాటిని నాకు బహుకరించారు.నేను వాటిని వైద్యకు ఇవ్వడమే సరైనదనిపించి అతనికి ఇచ్చేసాను.

మాధవరావు దేశ్ పాండే కల్పించుకోవడంతో పాదుకలు తిరిగి నావద్దకే వచ్చాయి.వైద్య వద్ద మరొక జత పాదుకలు ఉన్నాయి.బాబా స్వయంగా ఆ పాదుకలు అడిగి తీసుకుని వాటిని కూడా నాకే బహూకరించి “వీటిని నీ వద్ద ఉంచుకొని పూజించుకో”అన్నారు.

నేను “బాబా,ఇవి వైద్య చేయించినవి.అతనికే చెందాలి కదా?”అనడిగాను.అందుకు బాబా “ప్రస్తుతానికి నీవే ఉంచుకో,కావాలంటే తరువాత అతనికి ఇవ్వవచ్చు”అన్నారు.

నేను వాటిని కొద్ది రోజులు నా దగ్గరే ఉంచుకొని తరువాత ఒక జత పాదుకలు వైద్యకు ఇచ్చాను.

బాబా తన భక్తుల ఛాందస భావాలను నిరసించేవారు.అందరిని సమదృష్టితో చూసే వారనీ,బాబా చెంత అందరికీ ఒకే న్యాయమని తెలియజేసే సంఘటన ఒకటి ఉదహరిస్తాను.

1915 మేనెలలో మా అత్తగారు తదితరులతో కలిసి శిరిడీ వెళ్లాను.మేమప్పుడు సాఠేవాడాలో (ఆ తరువాత కాలంలో అది చేతులు మారి నవాల్కర్ వాడా అయింది)బసచేశాo .

మేమున్న వాడాలోనే దాదాకేళ్కర్ అను పూర్వాచార పరాయణుడైన బ్రాహ్మణుడు ఉండేవాడు.అతనికి ఉల్లిపాయలంటే అసహ్యం.

ఒకరోజు ఉదయం మా అత్తగారు వంటకు ఉల్లిపాయలు తరుగుతూ ఉంది.అది చూసి కేళ్కర్ ఆమెను దూషించాడు.మా అత్తగారు ఎంతో నొచ్చుకున్నారు.అలా జరిగిన కొన్ని గంటల తరువాత కేళ్కర్ మనుమరాలు తీవ్రమైన కంటినొప్పితో బాధపడసాగింది.

కేళ్కర్ బాబా దగ్గరకెళ్ళి తన మనుమరాలి బాధను తగ్గించమని వేడుకున్నాడు. “ఉల్లిపాయలతో కాపడం పెట్టు”అని బాబా చెప్పారు.

కేళ్కర్,”ఉల్లిపాయలను ఎక్కడ నుండి తెచ్చేది బాబా?”అనడిగాడు.బాబా దగ్గర ఎప్పుడూ ఉల్లిపాయలుoడేవి.

అందువల్ల బాబానే తనకు ఉల్లిపాయలు ఇస్తారనే ఉద్దేశ్యంతోనె కేళ్కర్ ఫై విధంగా అడిగి ఉండవచ్చు.కానీ బాబా అంతర్యం మరో విధంగా ఉంది.

మా అత్తగారిని చూపిస్తూ “ఈ తల్లినడుగు ఇస్తుంది”అన్నారు.తన మనస్సులో అణచి పెట్టుకున్న బాధను సరైన రీతిలో పోగొట్టుకునే అవకాశాన్ని (చెడుకు మంచి చేయడం ద్వారా)బాబా మా అత్తగారికి కల్పించారు.

తాను ఆ ఉదయమే వంటకు ఉల్లిపాయలు తరుగుతుంటే దాదా తనను దూషించాడని తనకు ఇవ్వాలని లేకపోయినా బాబా ఇవ్వమంటే ఇస్తానని చెప్పింది.బాబా ఆదేశించడంతో మా అత్తగారు కేళ్కర్ కు ఉల్లిపాయలనిచ్చింది.

మాకు సంతానం లేదు.పుట్టిన బిడ్డలు పురిటిలోనే చనిపోతూ వచ్చారు.అందువల్ల మాకు సంతానం ప్రసాదించమని మా అత్తగారు బాబాను ప్రార్థించింది.మా అత్తగారి అభ్యర్థనపై మాధవరావు దేశ్ పాండే(షామా)నా భార్యను బాబా వద్దకు తీసుకువెళ్ళి,ఒక టెంకాయను ఆమ చీరచెరగులో వేయమని బాబాను అభ్యర్థించాడు.

నా భార్యకు టెంకాయ ఇస్తున్నప్పుడు బాబా కళ్ళు చెమర్చాయి.తరువాత బాబా నన్ను దగ్గర కూర్చోపెట్టుకొని తమ పాదాలు పట్టమన్నారు.నేను బాబా పాదాలు పడుతుండగా,వారు తమ చేతితో నా వీపుని నిమిరారు.

బాబా నాపై చూపుతున్న కరుణకు నేను వారికి కృతజ్ఞతలు తెలుపుతూ పిచ్చివాడు నన్ను చంపడానికి వచ్చినప్పుడు బాబా ఫోటో నా దగ్గర ఉన్నందువల్లే నేను రక్షింపబడ్డానని వారితో అన్నాను.

బాబా నా మాటలు విని “భగవంతుడే యజమాని(అలా మాలిక్ హై)అన్నీ వారి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి” అన్నారు.తరువాత మేమిద్దరం ఆలింగనం చేసుకున్నాము.

బాబా తమ భక్తులందరి పట్ల ఎంతో ఆదరణ చూపేవారు.అంతేగాక ఒక భక్తుడు తమకు చేసే సేవలో మరొకరు జోక్యం చేసుకోవడం వారికి బొత్తిగా నచ్చేది కాదు.

ఇప్పుడు నేను చెప్పబోయే సంఘటనే దానికి నిదర్శనం.ఒకరోజు బాబా తమకు కడుపునొప్పిగా వుందని చెప్పారు.ఇంతలో మావ్ సిబాయ్ ఒక ఇటుకను ఎర్రగా కాల్చి బాబా పోట్టికడుపై(కఫ్నీ మీద)పెట్టింది.

పదినిమిషాలు దానినలాగే ఉంచి తీసివేసింది.బాబా కళ్ళు మర్ధన చేస్తున్న నేను అఆమే సేవను చూసి అదొక క్రూరమైన చికిత్సగా అనుకున్నాను.

తరువాత ఆమె ఇటుకను తీసి తన శక్తినంతా ఉపయోగించి బాబా కడుపును నొక్కసాగింది.అది చూసి నేను ఓర్చుకొనలేక “కాస్త నెమ్మదిగా ఒత్తు,బాబాకు బాధ కలుగుతుంది”అన్నాను.

బాబా వెంటనే “ఫో అవతలకి”అని నాతో గట్టిగా అన్నారు.నేను అక్కడ నుండి వెళ్ళిపోయాను.

ఆ రాత్రి 8 గంటలకు నేను మసీదుకు వెళ్లి నాకు ఉపదేశమివ్వమని బాబాను ప్రార్థిస్తూ “ఏ జపం చేసుకోమంటారు?” అనడిగాను.

వారు వెంటనే,”దేవ్ పూర్(కోపర్గాం నుండి 20 మైళ్ళ దూరంలో ఉన్న గ్రామం) వెళ్లి,అక్కడ నీ పూర్వికులు పూజించిన శిలలను పూజించుకో” అన్నారు.

దహనుకు వెళ్ళిన తరువాత బాబా మాటలలోని అర్థం మా నాన్నగారిని అడిగాను.దేవ్ పూర్ లోని విగ్రహాలను,మా పూర్వికులు పూజించిన విధానాన్ని మా నాన్నగారు ఇలా చెప్పారు.

ఐదు తరాల మునుపు,మా పూర్వీకులైన బాబా ప్రయాగ్ కు 60 సంవత్సరాలు వయస్సు వరకు సంతానం లేదు.బాబా భగవత్ అను మహాత్ముని అనుగ్రహంతో కొంతమందికి సంతానం కలిగిందని అతనికి తెలిసింది.

బాబాభగవత్ ఏకనాథ్ మహరాజ్ గారి శిష్యుడు.వారు చాలా అరుదుగా త్రయంబక్ లోని నివృత్తినాథ్ ఆలయానికి వస్తూ వుండేవారు.

అలా వచ్చినప్పుడు బాబాప్రయాగ్ సంతానం కొరకు వారిని దర్శించగా,ఆయన ఆశీర్వదించి ఒక టెంకాయను ప్రసాదించారు.

ఆ తరువాత బాబాప్రయాగ్ కు అరవై ఒక్క సంవత్సరాల వయసులో మగపిల్లవాడు పుట్టాడు.ఆ బాబుకి కృష్ణారావ్ అని నామకరణం చేసారు.

ఏడాది వయసున్న ఆ పిల్లవాడిని బాబాభగవత్ దేవపూర్ తీసుకెళ్ళి జ్ఞానేశ్వరి వ్రాతప్రతిని యిచ్చి ఆశీర్వదించి పంపారు.

ఆ వ్రాతప్రతి ఎంత మహిమగలదంటే దానిని బయటికి బయటికి తీసినప్పుడల్లా శుభసంకేతాలు కనిపిస్తాయి!(ఆ వ్రాతప్రతిని మా ముందుంచారు.అదే సమయంలో వీధిలో నుండి సంగీతం వినిపించింది)అప్పటి నుండి మా పూర్వీకులు బాబాభగవత్ గురుపరంపరలోని వారిని దర్శించి వారివద్ద ఉపదేశoపొందేవారు.

బాబా ఇచ్చిన ఆదేశం వల్ల అప్పటివరకూ తెలియని మా పూర్వీకుల వృత్తాంతం నాకు మా తండ్రి ద్వారా తెలిసింది.

1961లో బాబా అనుగ్రహంతో నేను జలగండం నుండి రక్షించబడ్డాను.అప్పడు దహనులో ప్లేగు వ్యాపించి ఉంది.నేను ఆఫీసుకు వెళ్లేందుకు ఒక చిన్న సముద్రపుపాయను దాటి వెళ్ళవలసి వచ్చేది.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles