సాయి భక్తుడైన అన్నను తిట్టినా చెల్లికి, బాబా కలలో కనిపించి మందలించిన వైనం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


రాజేశ్వరరావు గారి అనుభవములు ఐదవ మరియు చివరి భాగం

కాశిబుగ్గలో సుజాత, అశోక్‌ గారింట్లో శ్రీ సాయి సత్చరిత్ర పారాయణ చేసాను. ఆమెకి ఆ రోజు బాబా కలలో కనబడి నా గొంతుతో మాట్లాడాడని ఆశ్చర్యంగా చెప్పింది.

సుజాతకి ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్లని, బాధ్యతలు మొయ్యాల్సి వస్తుందని అశోక్‌ ఇంట్లోచి వెళ్ళిపోయాడు.

ఎక్కడికి వెళ్లి పోయాడో తెలియదు. ఆమె అన్ని చోట్లా వెతికించింది అయినా ప్రయోజనం లేదు జ్యోతిష్కుల దగ్గరకి జాతకం చుపితే 18 సంవత్సరాలకి గానీ తిరిగి రాడు అని చెప్పారు.

ఆ సమయంలో నేను శిరిడి వెళుతున్నాను, సుజాత నా దగ్గరకి వచ్చి “రాజన్నా! నువ్వు ఎలాగూ శిరిడి వెలుతున్నావు కదా, అక్కడ ఈయనే మన్నాకనపడతాడేమో చూడు అంటూ నాకు అశోక్‌ ఫోటో ఇచ్చింది.

నేను శిరిడి బయలు దేరేముందు బాబాకి ప్రదక్షిణలు, స్తోత్రం చెయ్యి అని చెప్పాను. నేను శిరిడి లో మూడు రోజులుండి అశోక్‌ కోసం బాబాని ప్రార్ధించాను.

శిరిడి నుండి వచ్చాక అయన ఖమ్మం లో ఉన్నట్లు తెలిసి, అతన్ని తీసుకోని వరంగల్లో మా ఇంటికి తెచ్చింది. రాజన్నా ఈయనకి ఉద్యోగం కావాలి అంది.

నేను బాబా వాళ్ళు సంతోషంగా ఉండాలంటే అతనికి Job కావాలి, బాబా అతనికి జాబ్‌ ఇచ్చేయ్‌ బాబా అని మొక్కితే, ఆయనకు జాబు వచ్చి వాళ్ళు సంతోషంగా వున్నారు.

బాబా వెయ్యి నామాలు రాసి శిరిడిలో ఇవ్వమని నాకు ఇచ్చింది. మళ్ళి గర్భవతి అయినప్పుడు ఆడపిల్ల పుడితే వాళ్ళ ఆయన ఇల్లు వదిలి వెళతాడని భయపడితే నేను బాబాని ప్రార్ధించాను. అబ్బాయి పుట్టాడు. సాయి చరణ్‌ అని పేరు పెట్టి బాబా పూజలు చేయసాగారు.

ఏకాదశి రోజు రాత్రి అంతా విష్ణు సహస్ర నామం చదవాలనిపించింది. చిన్న జీయర్‌ స్వామి శిష్యుడు ఫోన్‌ చేసి విష్ణు సహస్ర నామం చదవాలి అంటే వెళ్ళాను.

ఆరోజు శిష్యులు వారిలో వారు కలహించుకొని అందరూ వెళ్లి పోయారు. నేను ఒక్కడినే రాత్రి అంతా స్వామి వారి మాట పోగొట్టకూడదు అన్న ఆలోచన తో చదివాను.

యోగులు నిద్ర లేకుండా వుంటారని నేను కూడా నిద్ర లేకుండా వుండాలి అనుకున్నాను.

కాశీకి వెళ్ళినప్పుడు నాకు గుండెల్లో నొప్పి అనిపించింది, శ్వాస కష్టం గా వుంది, నేను నాతొ పాటు మరో ముగ్గురు కూడా ఉన్నారు.

నాకిలా నెప్పిగా ఉందన్న విషయం నేను ఎవరికీ చెప్పలేదు. రాత్రి అంతా నిద్ర పోలేదు, నేను రోజూ బాబాకి చెప్పుకుంటున్నాను.

మరు రోజు దగ్గరలో ఉన్న మెడికల్‌ షాప్‌ కి వెళ్లి మందు కొనుక్కొని వేసుకున్నాను. దానికి తోడూ విరోచనాలు కూడా అవుతున్నాయి.

నేను ఎక్కడికి వెళ్ళినా, బాబా కనబడతారా అని చూస్తాను. నేను సాయంత్రం దాకా వెతుకుతూనే ఉన్నాను. ఒక చోట బాబా ఫోటో కనపడింది, గుడికి దారి అని వుంది.

కాశీలో కూడా బాబా గుడి వుందా అని ఆశ్చర్యపోయి గుడికి వెళ్ళాను. అక్కడే పూజారి గారి ఇల్లు వుంది. వాళ్ళ ఇంటికి వెళ్లాను, వాళ్ళ ఇంటి నిండా బాబా ఫోటోలే ఉన్నాయి.

అక్కడ నాలుగు అడుగులలో బాబాగుడి ఉంది? ఆ అడుగులలో బాబా గారు వచ్చి కుర్చున్నారని అందుకే అక్కడ బాబా గుడి కట్టామని చెప్పారు.

అయోధ్య, గయా,  ప్రయాగ వెళ్ళాం. అప్పటికి నాకు నిద్ర లేక రెండు రోజులు అయింది, నాకు నొప్పి అలానే వుంది,

హరిశ్చంద్ర ఘాట్‌ లో వుంటే వైరాగ్యం వచ్చేస్తుంది. ఎక్కడి వారో ఇక్కడికి చేరుకుంటారు. చనిపోతూంటారు, ఇక్కడ తగులబెడుతూంటారు. అక్కడ 10 నిముషాల సమయము గడిపితే చాలు ఎక్కడ లేని వైరాగ్యం వచ్చేస్తుంది.

నేను కనుక ఇక్కడ చనిపోతే నన్ను ఏం చేస్తారు అన్న ఆలోచన వచ్చింది. బుద్ధ గయలో రూమ్‌ తీసుకున్నాం. నాకు ఊపిరి కష్టం అయింది.

ఏమయ్యిందో ఏమో గానీ కొద్ది కొద్దిగా నాకు గుండెల్లో నొప్పి తగ్గు ముఖం పట్టసాగింది. మూడు రోజులు నిద్ర లేకుండా గడపాలి అనుకున్నా కదా అది పూర్తీ అయింది.

అక్కడనుండి పూరీ జగన్నాద్‌ చేరి, దర్శనం చేసుకుని వరంగల్‌ తిరిగి వచ్చాము. గానుగాపురం వెళ్ళినప్పుడు బాబా లా ఒకాయన ద్వారాకమాయి గోడకు బాబా అనుకొని నిలబడ్డ ఫోజ్‌ లో నిలబడ్డాడు. నేను స్వీట్‌ పెట్టాను తీసుకోని వెళ్ళాడు.

యాదగిరి లో శివరాత్రి కి మాత్రమే దర్శనం ఇచ్చే జ్ఞాన మాణికేశ్వరి మాత ను చూడడానికి వెళ్ళాం. ఓం శివాయ నమః అని భజన చేస్తున్నారు.

శూలం పట్టుకొని బయటకు వచ్చి లోపలికి వెళ్ళగానే చుట్టుతా గోడలు కట్టి ముసేయమని చెప్పి వెళ్ళిపోతుందట. బయట వున్న శిష్యులు ఆవిడ లోపలికి వెళ్ళంగానే గోడలు కట్టేస్తారు.

సంవత్సరం తర్వాత గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వస్తుంది. ఆవిడ దర్శనం అయింది. ఒక్క అర గంట మాత్రమే ఆవిడ భక్తులకి దర్శనం ఇస్తుంది.

శ్రీశైలం వెళ్ళాలంటే ట్రాఫిక్‌ జామ్‌ని తెలిసి, ఎలా అనుకుంటే బ్రహ్మ కుమారీల శివలింగాల ఉరేగింపు వలన మాకు శ్రీశైలేశ్వరుడి దర్సనం అయ్యింది.

దండం పెట్టుకొని బస్సు ఎక్కాం. నా పక్కన కూర్చున్నాయన మొహం బాబాలాగా వుంది.

మాది శాయంపేట, ఆక్కడ పిన్ని వంటి మీదకి దేముడు వస్తాడు, వచ్చి మీ అక్క కొడుకు దగ్గర సాయిబాబా వున్నాడు అయన ఏది చెబితే అది జరుగుతుందని చెప్పాడట.

ఆమె నా కాళ్ళు పట్టుకుంది, ఏమిటి పిన్నీ నువ్వు పెద్దదానివి ఇలా నా కాళ్ళు పట్టుకోవచ్చ అంటే దానికి మా పిన్ని నీ దగ్గర బాబా ఉన్నారట ఆయన ఏం చెబితే అది జరుగుతుంది అని నాకు దేవుడు చెప్పాడు అంది.

మా పిన్ని కూతురు మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ “మీ అన్నయ్య ఇంటిలో ఏమి పట్టించుకోవడం లేదు అని చెబితే, ఆమె అన్నయ్యా నువ్వు వదినని మంచిగా చూసుకో, బాబా బాబా అని తిరగక వదిన కష్ట పెట్టుకుంటోంది అని తిట్టింది.

ఆమెకి కలలో బాబా కనబడి “మా వాడ్ని తిడతావా? ఏమనుకుంటూన్నావు మీ అన్న గురించి” ఆని మందలించారు. ఆమె తర్వాత బాబా భక్తురాలు ఆయింది.

మా బావ. అయ్యప్ప మాల వేసుకుంటే వెళ్ళి అందరం మాట్లాడుతున్నాం. మా పిన్ని ఉన్నట్లు వుండి, రాజూ! నీ వెనకాల బాబా కనబడుతున్నాడు రా! అంది.

మా ఇంట్లో బాబా నామం చేస్తున్నాను. నా ఆత్మ నాకు కనబడుతోంది. ఒకసారి పడుకొని భజన చేస్తున్నాను. నా గుండె ఆగిపోయింది. ఒక దీపంలా వెలుగుతోంది.

నా ఆత్మ ధ్యానం చేస్తుంటే ‘నా శరీరం చాల పెద్దగా అయిపోయింది. కింద అందరు చీమలు లాగా కనబడుతున్నారు.

ఒకసారి పంది కనపడింది, దాని కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయి, అది ఎందుకు ఏడుస్తోంది అని దానికి ఆహారం తీసుకువచ్చి పెట్టాను. అది తిని వెళ్లి పోయింది.

నేను అందరిని సాయి అని పిలుస్తాను. అందరిలో సాయి ని చూస్తాను. కోతుల్ని కూడా సాయి అనుకుంటాను.

సర్వం శ్రీ సాయినాధ చరణారవిందార్చణ మస్తు

శుభం భవతు

పదమూడవ రోజు పారాయణం సమాప్తం

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles