Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు
చెన్నై నుండి శ్రీమతి కృష్ణవేణి గారు పంపిన అనుభవం. అడిగితే బాబా ఏదీ కాదనరనే విషయం ఈ అనుభవం చదివితే మనం తెలుసుకోగలం. అడిగితే ఏదీ కాదనరంటే అర్ధం పర్ధం లేనివి అడగకూడదు కదా. మనం ఏది అడిగినా మనకు మేలు చేసేవే ప్రసాదిస్తారు ఆయన. ఇక చదవండి.
ఒకసారి నేను సంక్రాంతి సెలవులకి నా ఒంగోలు ప్రయాణం బాబా వారి అనుమతితో జరిగింది. చెన్నైనుండి ఒంగోలు వెళ్ళేటప్పుడు నన్ను మావారు దిగబెట్టారు. మరలా ఒంగోలు నుండి చెన్నైకి తిరిగి తీసుకురావడానికి ఆఫీసులో మావారికి సెలవు దొరకలేదు. అందువల్ల మా నాన్నగారికి ఫోన్ చేసి మీరు తీసుకు వచ్చి దిగబెట్టగలరా అని అడిగారు. మా నాన్నగారికి చాలా పనులున్నా గాని మా వారు అడిగేసరికి అలాగే వీలు చూసుకుని దిగబెడతాను అన్నారు. పాపకి స్కూలు కూడా తిరిగి తెరిచారు. మా నాన్నగారు రేపు వెడదాం అని అంటూ ఉండేవారు. అలా రెండు మూడు రోజులు గడిచిపోయాయి. పాపని స్కూలులో మాస్టార్లు ఏమన్నా అంటారేమోనని భయం వేసింది. పైగా నాకు రెండవసారి డెలివరీ అయినపుడు పాప 3 నెలలు స్కూలుకు వెళ్ళలేదు. మావారు, ఎప్పుడు వస్తున్నారు రిజర్వ్ చేయించుకున్నారా ఇంకా లేదా అంటూ మా నాన్నగారికి రోజూ ఫోన్ చేస్తుండేవారు. ఫోన్ చేసిన ప్రతిసారి ఇంకా లేదని చెప్పడానికి చాలా ఇబ్బందిగా ఉండేది. దానితో నాకు మనసులో చాలా చికాకు కలిగి “ఏమిటి బాబా! మీ అనుమతితోనే కదా బయలుదేరాను. ఇప్పుడు నాతో ఎవరొస్తారు. మీరు వచ్చి దిగబెడతారా” అని మనస్సులో ప్రార్ధించుకున్నాను.
ఆ తరువాత మా నాన్నగారు మరుసటి రోజు వెడదామని టికెట్స్ బుక్ చేయమన్నారు. అంతా బాగానే ఉందని బయలుదేరాము. రైలు శింగరాయకొండ వచ్చేసరికి మాముందు సీట్లో ఒక ముసలాయన వచ్చి కూర్చున్నారు. ఆయన ఫాంటు, చొక్కా వేసుకుని బాగా పొడవుగా ఉన్నారు. మొహం చాలా ప్రశాంతంగా మంచి కళగా ఉంది. దారి పొడవునా మాకు ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. మా పెద్ద పాప సీటు పైన నుంచుని ఉంది. ఆయన పెద్ద పాపతో అమ్మా జాగ్రత్త కింద పడతావు సరిగ కూర్చో అన్నారు. చిన్న పాప ఏడుస్తుంటే నేను ఒడిలో పడుకోబెట్టుకున్నాను. ఆయన పాపని భుజం మీద పడుకోబెట్టుకో ఏడుపు ఆపుతుంది అన్నారు. నేను అల్లాగే చేశాను. పాప ఆయన చెప్పినట్లుగానే ఏడుపు ఆపింది. అలా చెన్నై చేరుకున్నాము. మావారు పర్మిషన్ పెట్టి మమ్మల్ని తీసుకురావడానికి సెంట్రల్ స్టేషన్ కి వచ్చారు. వచ్చి మా బోగీ దగ్గర నుంచున్నారు. మా పాప అమ్మా నాన్న వచ్చారు అంటూ పిలిచింది. అపుడు నేను దిగేముందు మా ఎదుట కూర్చున్న ముసలాయనకి వెళ్ళి వస్తామని చెప్పడానికి చూశాను. ఆయన కిటికీలోనుండి మా వారి వైపు చూసి ఒకలాగ ఆయనలో ఆయనే ఏదో మాట్లాడుకుంటున్నట్లుగా కనిపించారు. నేను రైలు దిగి మావారి దగ్గరకు చేరుకుని ముసలాయన వైపు చూశాను. నేను మా వారికి చూపిద్దామని పిలిచేలోగా ఆయన నాకక్కడ కనిపించలేదు. తరువాత జరిగినదంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నాను. “నాతో మీరు వచ్చి దిగబెట్టగలరా” అని కోరినందుకు ఆయన నన్ను మావారి వద్దకు చేర్చే వరకు ఉండి మళ్ళీ కనిపించలేదు. నేను నన్ను దిగబెట్టగలరా అని విసుగుతో అన్నా కూడా ఆయనకు నా మీద ఎటువంటి కోపం లేకుండా నిరంతరం మన వెంటే ఉంటారని తెలియచేయడానికి ఇంతకంటే వేరే నిదర్శనం లేదనుకుంటున్నాను. ఆయన వదనం లోని ప్రశాంతత, ఆ చిరునవ్వు, ఆయన మావారి వైపు చూసిన చూపు, తనలో తనే మాట్లాడుకోవడం చూసిన తరువాత బాబాయే ఆరూపంలో మాకూడా వచ్చారని నా గట్టి నమ్మకం.
మరో చిన్న అనుభవం. నేను రోజు 5 గంటలకే లేచి దీపం వెలిగిస్తాను. ఒక గురువారం నిద్ర పట్టేసింది. సాయి బానిస గారు మా పడక గది తలుపు వద్ద ఉండి నన్నే చూస్తూ ఉన్నారు. అపుడు నేను కళ్ళు తెరచి ఒక్క క్షణం చూశాను ఆయనని. వెంటనే లేచి హడావిడిగా దీపం వెలిగించాను.” (బాబా వారు ఆమెకి సాయిబానిస గారి రూపంలో కనిపించారు. )
ఈ సమాచారం ఈ లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.
సర్వం సాయినాథర్పాణమస్తు
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- నా భక్తులు పిలిచిన వెంటనే పరుగున వస్తాను
- భక్తులు మరిచిపోయిన బాబా మరవరు
- నా మట్టి సమాధానమిస్తుంది,నా సమాధినుండి కూడా నేను నా కర్తవ్యాన్ని నిర్వహిస్తానని బాబా ఇచ్చిన అభయ హస్తపు జల్లులను గురూజీ నిరూపించారు.
- నా బ్యాగ్ తప్పిపోయింది అని తెలిసి నాకు కన్నీళ్లు వచ్చాయి బ్యాగ్ లో నా సర్టిఫికెట్స్ ఉన్నాయి.
- ఎవరయితే జీవ కోటిలో నన్ను చూడగలుగుదురో వారే నాప్రియ భక్తులు-Gopal Rao–12–Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments