కొడుకు కావాలి …. మహనీయులు – 2020… ఆగస్టు 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సిద్ధారూఢుల ప్రవచనాలను వినటానికి ఎందరెందరో వచ్చేవారు. పశుపక్ష్యాదులు కూడా ప్రవచనాలు వింటాయి. ఈ విషయం సెయింట్ ఆంటోని జీవిత చరిత్రలో కూడా చూడవచ్చును.

సిద్ధారూఢులు ప్రవచనం ప్రారంభించే సమయానికి ఒక కాకి తడి శరీరంతో వచ్చి, ఒక చెట్టుపై కూర్చునేది. ఈ విషయాన్ని సిద్ధారూఢులు శిష్యులకు చెప్పారు.

“దీన్ని కాపాడండి. వారం రోజులపాటు ప్రవచనం విని, చేరువుగట్టు మీద ప్రాణాలు విడుస్తుంది” అన్నారు శిష్యులతో.

శిష్యులంతా ఉత్సుకతతో ఆ కాకిని గమనిస్తున్నారు. ఏడవ రోజు ప్రవచనం పూర్తికాగానే, కాకి సిద్ధుల పాదాల మీద వ్రాలింది. ముక్కును అటు ఇటు త్రిప్పింది. ప్రణామం చేసింది.

సిద్ధారూఢులు ఆ కాకిని ఆశీర్వదించారు. అది ఎగిరి చెరువు గట్టు మీదకు వెళ్ళింది దాని ప్రాణాలు అక్కడ పోయాయి.

ఈ విషయాలను గమనించిన శిష్యులకు కాకి గత జన్మలో యోగభ్రష్టుడని, ఈ జన్మలో అది ఆత్మోద్ధరణ చేసుకున్నదని తెలిపారు సిద్ధారూఢులు.

సాయిబాబా జీవిత చరిత్రలో ఒక పులి సద్గతిని పొందింది. రమణ మహర్షుల జీవిత చరిత్రలో ఒక కాకి కూడా సద్గతి పొందింది. సిద్ధారూఢుల వంటి మహనీయాలు జంతుజాలాన్ని గూర్చి చెబితే కానీ తెలియని విషయాలు అవి.

సిద్ధారూఢుల బాల్య నామం సిద్ధుడు. ఈయన గురు శాంతప్ప, దేవమల్లమ్మ పుణ్య దంపతులకు జన్మించారు. బాల్యం నుండి ఈయన అనేక అలోకిక లీలలు ప్రదర్శించారు.

బాల్యంలో సంక్రాంతి పండుగనాడు ఒక చిన్న కుండ నుండి నువ్వు ఉండలను శివ పంచాక్షరి మంత్రం చదువుతూ ఎందరికో పంచిపెట్టారు. “ఇదంతా ఎలా జరిగింది?” అని తల్లి ఆశ్చర్యపోతే

“ఇదంతా నీ పాద మహిమే అమ్మా!” అన్నాడాయన అందరూ శివుని అవతారమే అని నిశ్చయించారు.

బాల్యంలోనే ఒక గేదె మీద కూర్చొని “నేను ఏనుగు మీద కూర్చున్నాను. మీరంతా మేళాలు వాయిస్తూ నడవండి” అన్నాడా బాలుడు. గేదె నడవలేదు.

“దీనికి పొగరెక్కువైంది. పడిపో” అన్నాడా బాలుడు. అది పడి చనిపోయింది. తల్లి వచ్చి చనిపోయిన గేదెను చూచి విచారించింది. బాలుడు పంచాక్షరి చదివి, చనిపోయిన గేదెనే బ్రతికించాడు. సిద్ధుడు జీవమును తీయగలడు, జీవమును పోయగలడు.

ఒకసారి సిద్ధారూఢులు ఒక అన్న సత్రంలో భోజనం చేసి, లేచి వెళ్లిపోతుంటే “ఈ ఎంగిలాకు నీ యబ్బ తీస్తాడా?” అని ఒక వ్యక్తి అడిగాడు.

“కొడుకు కావాలాలనుకుంటే తండ్రే తీస్తాడు” అన్నాడు సిద్ధుడు. అప్పుడే ఎవరో ఒక శివ యోగి వచ్చి ఎంగిలి విస్తరి తీయటం, స్త్రీ మూర్తి వచ్చి సిద్ధుల చేయి కడగటం కొందరు చూచారు. అక్కడి వారికి సిద్ధుని శక్తులు తెలిసినవి.

విష ప్రయోగమని తెలిసినా, సహించి జీవాన్ని వదిలారు సిద్ధారూఢులు. అయన సమాధి దినం 21 . 08 . 1929. నేడు ఆగస్టు 21. అయన సమాధి దినం.

సిద్ధారూఢులను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles