Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
కుతుబ్ మీనార్ పేరు వినని వారుండరు. క్వాజాకుతుబుద్దీన్ భక్తియార్ కాకి పేరిట అప్పటి ఢిల్లీ సుల్తాను నిర్మించిన కట్టడం అది.
సుల్తాన్ ఆ సూఫీ యోగిపై పూర్తి విశ్వాసంతో ఉండేవాడు. కానీ ఆ చిస్తీ సాంప్రదాయ యోగి అత్యంత నిరాడంబరంగా జీవితాన్ని గడిపాడు.
ఈయన తనకున్న సంపదను అందరకూ పంచేవాడు. అందరికీ భోజనాలు పెట్టేవాడు. ఏమి పెట్టలేక పొతే, నీటిని ఇచ్చే వాడాయన.
సాయిబాబా కూడా ఇంటికి వచ్చిన అతిధులకు ఏదో ఒకటి పెట్టాలని, ఏదీ లేకపోతె, కొంచెం బెల్లం ముక్క అయినా ఇవ్వాలనే వాడు.
కొన్ని దినాలపాటు, ఆహారం లేకుండా ఈయన పస్తుంలుండే వారు, ఈయనతోపాటుగా ఆయన భార్యా, పిల్లలు కూడా పస్తులుండే వారు. వారు బాధపడేవారు కాదు.
ప్రక్కనున్న ఇంటిలోని ఒక ధనికురాలు వారికి ఆహారం ఇచ్చి ఆదుకునేది. అలా ఆదుకోవటం ఆ ధనికురాలిలో గర్వాన్ని పెంచింది. ఈ సంగతి సూఫీ యోగికి తెలిసింది.
ఆయన భార్యతో పవిత్ర ఖురాన్ నుండి బిస్మిల్లా షరీఫ్ ను పఠించి కావలసినన్ని కాక్ లను (రుచికరమైన రొట్టెలను) తీసుకో అని చెప్పారు.
ఆయన భార్య అలానేచేయసాగింది. కాక్ లను సృష్టించే ఆ మహాశక్తివంతుడు ‘కాకి’ అనే బిరుదును సంపాదించాడు.
హజ్రత్ ఖాజా (క్వాజా) కుతుబుద్దీన్ దేశ సంచారం చేసి అనేక మంది మహానీయులను దర్శించి, వారి వివరాలను లిఖించాడు కూడా.
ఒకసారి హజ్ యాత్రలో షేక్ అబుబకర్ షిబ్లీ వంశస్తుని చూచి, ఆయన వెనుక ఆయన పాదముద్రలను శిరోధార్యం అనే భావనతో నడవసాగాడు.
ఈ విషయాన్ని గ్రహించిన షిబ్లీ వంశీయుడు “గౌరవ భావన చాలదు. లోనున్న వెలుగుతో పయనించాలి” అని సలహా ఇచ్చాడు కుతుబుద్దీన్ కు.
మాటల సందర్భంలో షిబ్లీ వంశీయుడు “ప్రతి దినం పవిత్ర ఖురాన్ ను వెయ్యిసార్లు పారాయణ చేస్తాను” అన్నారు.
“నమ్మశక్యంగా లేదుకదూ? నేను అక్షరమక్షరం పఠిస్తాను” అని కూడా అన్నాడాయన.
ఇంకా ఈ విషయాన్ని నమ్మలేకపోయాడు, ఎవరితోనో ఈ విషయాన్ని చెప్పాడు కుతుబుద్దీన్ “ఇది సంభవమేనా?” అంటూ.
“సంభవమే. మానవ మేధస్సు కొంతవరకే పరిమితం. దైవ లీలలను (వేయిసార్లు పఠించటం) అందరు గ్రహించలేరు” అన్నాడు ఈ విషయాన్ని విన్న మరో మహాయోగి.
భక్తితో ప్రార్థిస్తే కోరినన్ని రొట్టెలను ప్రసాదించే ఆ దైవము, భక్తితో కోరుకుంటే దినానికి వేయిసార్లు పవిత్ర గ్రంథాన్ని పఠించేటట్లు చేయడా!
భక్తియార్ కాకి నవంబర్ 27, 1235న దేహాన్ని త్యజించారు.
దైవ శక్తిని గ్రహించు భాగ్యము మనకు కూడా కాల్కుగును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- కొడుకు కావాలి …. మహనీయులు – 2020… ఆగస్టు 21
- పయనమైన ప్రియతముడు…. మహనీయులు – 2020… మే 21
- బాబా కాకి రూపమున వచ్చి కాపాడుట–Audio
- కఠిన సాధన…. మహనీయులు – 2020… మే 7
- ఇంటి బావిలో గంగమ్మ! …. మహనీయులు – 2020… నవంబర్ 26
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments