Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
This Audio Prepared by Mrs Lakshmi Prasanna
- Mir-21 బాబా విగ్రహం నుండి కారిన చెమట అగ్ని ప్రమాదాన్ని గురించి హెచ్చరించింది 2:46
నా బౌతిక శరీరాన్ని విడిచిపోయినా, నేను జీవించే వుంటాను, ఈ నిజాన్ని గ్రహించి నా వైభవాన్నీ, లీలలనూ అనుభవించు – ఇది బాబా వాగ్దానం.
బొంబాయి కి చెందిన శాంబాయి సావంత్ బాబా కి అచంచల భక్తుడు. అదృష్ట వశాత్తూ సంస్థాన్ కి ట్రస్తు బోర్డు సభ్యుడిగా కూడా నియమించబడ్డాడు.
సంస్థానానికి, బాబా కీ ఎన్నో వైభవోపేతమైన పనులు చేసాడు, దూరదర్శన్ ద్వారా బాబా నిత్య ఆరాధన మరియూ ఆరతులు ప్రసారమయ్యేలా చర్యలు తీసికున్నాడు.
ట్రస్టు బోర్డు సభ్యుడిగా కొనసాగినంత కాలమూ షిరిడీ కి బాబా దర్శనానికి తరచు గా వస్తూవుండేవాడు.
సమాధిమందిరంలో ధ్యానంలో కూర్చున్నంత సేపూ బాబాని చూస్తూనే వుండడం ఆయనకి తప్పించుకోలేని అలవాటు.
తరచుగా ధ్యానంలో కన్నులు తెరచి బాబా విగ్రహాన్ని తదేకంగా చూసేవాడు.
ఒకరోజు కొన్ని గంటలు అలా బాబా విగ్రహాన్ని చూస్తూ వున్నప్పుడు విగ్రహానికి చెమటలు పట్టడం గమనించాడు. నుదుటినుండి ఆరంభమయిన చెమట బాబా గడ్డం మీదుగా జారి చుక్కలు చుక్కలు గా పడుతోంది.
అక్కడున్న పూజారి చెమటని తువ్వాలుతో తుడుస్తూ బాబా వంక ఆశ్చర్యంగా చూడసాగాడు. కొన్ని క్షణాల తర్వాత బాబా కి చెమట బిందువులు విపరీతంగా కారసాగాయి. అప్పుడే ’నిప్పు, నిప్పు అని ఎవరో కొందరు అరవడం సావంత్ విన్నాడు.
సమాధిమందిరానికి ద్వారకామాయికి మధ్యన కొన్ని గదులున్నాయి.
ధుని మాయికి వెనుక వున్న గదిలో నిప్పంటుకుంది. వెంటనే ఆ నిప్పు ఆర్పవేయబడింది.
’బాబా చెమటోడుస్తూ గదిలో నిప్పంటుకున్నదని మనలని హెచ్చరించదలిచారు, కానీ పరమ మూర్ఖులమైన మనము బాబా చర్యలని అర్దం చేసికోలేకపోయాము’ అంటాడు శాంబాయి సావంత్.
శాంబాజీ సావంత్ ద్వారా సాయి అనుభవ్ నుండి…
విన్నీ చిట్లూరి సంకలీకరించిన బాబాస్’ డివైన్ సింఫనీ గ్రంధం నుండి సేకరణ మరియూ అనువాదం
సాయిబాబా చాగంటి
csaibaba@gmail.com
whatsapp 7033779935
Voice call: 9437366086, 8270077374
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- శ్రీ దస్తూర్జీని బాబా అప్రమత్తం చేసి అగ్ని ప్రమాదం నుండి రక్షించారు
- పాఠకుడాయె – సంపాదకుడు …..సాయి@366 జనవరి 8…..Audio
- పాలరాతి విగ్రహం కావాలనుకుంటే, పంచలోహ విగ్రహం గా ఇంటికి వచ్చిన బాబా …!
- బాబా శాంతించి మామూలు స్థితికి వచ్చారు–Taarkad-30–Audio
- షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments