Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
సాయికి అంకిత భక్తులు కావాలంటే, సాయి జీవిత కాలంలోనే పుట్టి, షిర్దీలోని సాయిని దర్శించనక్కర లేదు.
సాయి మహాసమాధి అనంతరం, సాయిబాబా పేరు విన్నవారు కూడా అంకిత భక్తులు కావచ్చును. ఎటొచ్చి మనసులో సాయి అంటే గాఢమైన భక్తి, ప్రేమలు ఉండాలి.
సాయి మహా సమాధి అనంతరం విడుదలైన సాయి లీల మాసపత్రికను నాగేశ్వర్ ఆత్మారాం సావంత్ చదివాడు.
సాయి లీలలు ఆయనను అమితంగా ఆకర్షించాయి. అప్పటికింకా సాయి సచ్చరిత కూడా రాలేదు. అతను సాయి భక్తుడయ్యాడు.
సహా ఉద్యోగి అయిన పి. దేవ్ వద్ద నుండి సాయి చిత్రాన్ని అడిగి తీసుకున్నాడు. ఆ చిత్రాన్నే పూజిస్తుండే వాడు.
సావంత్ ఇన్ స్పెక్టరు అవటానికి కావలసిన పరీక్షలు ప్యాసు కాలేదు. కానీ సాయి కృపతో తాత్కాలిక ఇనస్పెక్టరుగా 5 ఏండ్లు కొనసాగాడు.
ప్రతి పుణ్య తిధికి షిరిడీ వెళ్ళేవాడు. 1926లో కూడా షిరిడీ వెళదాం అనుకున్నాడు. కానీ అది ముస్లింల లెక్క ప్రకారం మొహరం మాసమయింది. ఆ నెలలో అధికారులు సెలవను మంజూరు చేయరు.
అతడు నిరుత్సాహ పడ్డాడు. సాయి అతనికి స్వప్నంలో కన్పించాడు. ఏదో కాగితం మీద సాయి సంతకం పెడుతున్నట్లు అనిపించింది.
మెలకువ రాగానే సేలవకు అర్జీ పెట్టుకోగా అధికారులు మంజూరు చేసారు. సాయి కరుణ అదే.
1929 లో బొంబాయిలో మతపరమైన అల్లర్లు జరిగాయి. బందోబస్తు పనిలో ఉన్నాడు సావంత్. ఉన్నట్టుండి జ్వరం, తలనొప్పి రాగానే అధికారులతో చెప్పి వెళ్ళి పోయాడు.
అదే చోట కాల్పులు జరిగాయి. అతడు అక్కడ ఉంటె కాల్పులలో మరణించివుండే వాడు. సాయి అతనిని మరణం నుంచి అలా కాపాడాడని గ్రహించాడు.
అదే సంవత్సరములో ఆయనను శాశ్వత పోలీసు ఇన్ స్పెక్టరుగా నియమించారు. అతనికి సాయి సాహిత్యం అంటే అభిలాష ఎక్కువ.
అతని తీరు తెన్నులను గమనించి డాక్టర్ గావంకర్ సాయి లీలా మాస పత్రికకు సంపాదకునిగా నియమించగా 1954 నుండి 1961 వరకు సాహిత్య పరంగా ఎంతో సేవ చేశాడు.
జీవిత చరమాంకంలో షిరిడీలోనే గడిపాడు. ఒకసారి బొంబాయిలో కుమారుని చూచి వద్దామని వెళ్ళి, స్నానం గదిలో కాలుజారి పడ్డాడు.
అక్కడనే జనవరి 8, 1976 న సాయిలో ఐక్యం అయ్యారు ఆయన తన 81 వ ఏట.
సాయి కోరేది నిండు ప్రేమనే అని ఈయన జీవితం రుజువు చేస్తుంది. అంతటి ప్రేమ మనలోను నిలచిన చాలును.
ఇది సాధారణ పాఠకుణ్ణి సంపాదకునిగా చేసిన “సాయి లీల”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గ్రహణం వీడింది.! …..సాయి@366 జనవరి 21….Audio
- షిరిడీలో నివాసం …..సాయి@366 జనవరి 23….Audio
- బాబా విగ్రహం నుండి కారిన చెమట అగ్ని ప్రమాదాన్ని గురించి హెచ్చరించింది–Audio
- భక్తుడా? అంకిత భక్తుడా? …..సాయి@366 మే 13….Audio
- ఏ మంత్రంతోను పనిలేదు…..సాయి@366 జూన్ 8….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments