నాగసాయి …..సాయి@366 జనవరి 7….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


మహా సమాధి ముందుగాని, తర్వాత గాని సాయిబాబా షిరిడీ పొలిమేరలకే పరిమితం కాదు. మానవ రూపానికే పరిమితం కాదు.

సాయి సచ్చరితలో నెవాసాలో సాయిబాబా (సమాధి చెందక పూర్వం) బాలాజీ పాటిల్ నెవాస్కర్ గారి ఆవుల కొట్టంలో సర్ప రూపంగా కన్పించారని తెల్పుతుంది.

సర్ప రూపంలో సాయి ఉన్నాడని అనుకోనని ఆ గృహంలోని వారంతా కలత చెందారు. బాలాజీ పాటిల్ కు మాత్రం ఆ సర్ప రూపంలో వచ్చింది సాయియే అని దృఢ విశ్వాసం.

అతడు భీతిల్లక గిన్నెడు పాలు తెచ్చి పాము ముందు పెట్టి “బాబా! ఎందులకు బుస కొడుతున్నావు? ఎందులకీ అలజడి? మమ్ము భయపెట్ట దలచితివా? ఈ గిన్నెడు పాలను త్రాగుము” అన్నాడు ప్రశాంతముగా.

అందరూ చాలా భయపడుతున్నారు. కొన్ని క్షణాలలో తనంతట తానె మాయమైనది ఆ సర్పము.

సాయిబాబా మహా సమాధి చెందారు.  అది కోయంబత్తూరు, జనవరి 7, 1943 అప్పటికే అక్కడ ఒక సాయి మందిరం వెలసింది.

సాయంత్రం సుమారు అయిదున్నర గంటలయింది. రామారమీ నాల్గు అడుగుల పొడవు గల సర్పం సాయి మందిర మండపం ముందుకు రాగా, ఎవరో చూచి “పాము వచ్చింది” అని అరచారు.

అందరూ దానిని చూచి పక్కకు తప్పుకున్నారు. అది నేరుగా సాయి మందిరం ముందు నృత్యం చేసింది. జనాలకు సుమారు పది అడుగుల దూరంలో ఉన్నను భక్తులెవ్వరు భయపడలేదు.

ఆ రాత్రంతయు కొందరు భక్తులు భజన చేస్తున్నా ఆ సర్పం అలానే ఉంది, తెల్లవారింది. అష్టోత్తరం చదివి, పూజ చేసి బుట్టెడు పూలు పాము తలపై వేశారు. ఆ సర్పం ఏమి చేయలేదు.

ఈ లోగా ఫొటోగ్రాఫరును పిలిపించారు. ఫోటోలు తీసారు. ఆ సర్పానికి ముందు పాలతో నిండిన గిన్నెను ఉంచారు. అది పాలు తాగింది.

11 గంటలకు అది ఉత్తరం వైపుగా వెళ్ళి అదృశ్యమైంది. ఆ సాయి మందిరంలో గాని చుట్టుపక్కల గాని అప్పటి వరకు పాము పుట్ట లేనే లేదు.

ఈ సంఘటన తరువాత అక్కడ పుట్ట వెలవగా దాని మీదనే మండపాన్ని నిర్మించారు. ఆ మందిరమే నాగ సాయి మందిరము.

ఓం సాయీశ్వరాయ నమః

ఓం నాగ సాయినే నమః

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles