ఏ మంత్రంతోను పనిలేదు…..సాయి@366 జూన్ 8….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


జ్ఞానిని జ్ఞానియే గుర్తిస్తాడు. అది చివటం గ్రామం. ఆ గ్రామంలో యోగిని అచ్చమ్మ ఉండేవారు.

సాయికి ఉన్నట్లు ఆమెకు భక్తులెందరో ఉండేవారు. ఆమె భక్తుడైన విస్సయ్య పంతులు తమ్ముడు వచ్చి విజయనగరం పోతానని చెప్పాడు అమ్మకు. ఆమె వద్దన్నది.

సాయిబాబా చరిత్రను చదువుకొనమని చెప్పింది. అతడు అలానే చేశాడు. అతడు ప్రయాణం చేసి ఉంటే ప్రాణాపాయం సంభవించేదని ఆమె చెప్పింది. అలానే జరిగింది. అతనికి గండం తప్పింది.

ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. ఇటువంటి సంఘటనలు అనేకం సాయి సచ్చరిత్రలో చూడవచ్చు. విశేషం ఏమిటంటే ఆమె సాయిబాబా సచ్చరిత్రను పారాయణ చేయమనటం.

ఒకసారి ఆమె వద్దంటే సాయి భక్తుడైన సుధీంద్ర బాబు గారు ఊరికి వెళ్ళారు. ఆయన తన సామానులను పోగొట్టుకున్నాడు ప్రయాణంలో.

ఆమె లీలలు, చేష్టలు సాయిని పోలి ఉంటాయి. ఒక భక్తురాలు ఆమెను సజ్జనులతో పాటు దుర్జనులు కూడా తమ దర్శనానికి వస్తారు కదా అని సందేహం తెలిపింది.

చివటం అమ్మ ”నేను దుకాణం పెట్టుకున్నానే. మంచి వారు, చెడ్డ వారు, ఎవరైనా వస్తారే” అన్నది.

సాయి వద్దకు కూడా అంతే. వేశ్యలు, దొంగలు కూడా వచ్చేవారు. అందరిని సాయి సమానంగానే చూసేవాడు, చేరదీసే వాడు.

సాయి వలె ఆమె తన భక్తులను సద్గ్రంధ పఠనం చేయమనేది. ఆమె సాయి వలె తన ఒక పన్నును పీకి సూరమ్మ అనే ఒక భక్తురాలికి ఇచ్చి దాచుకొమ్మన్నది.

సాయి తన సేవకుడైన అబ్దుల్‌తో ”తక్కువ తిను, తక్కువగా నిద్రించు” అని సలహా ఇచ్చారు.

చివటం అమ్మ‘మనిషిలో ఇద్దరు దొంగలున్నారు. ఒకటి నిద్ర, రెండోది తిండి. పగలు తిండి, రాత్రి నిద్ర అయితే దేవుడిని ఎప్పుడు చూస్తావు?’అనేది.

”ఏసుక్రీస్తు భక్తులు రాముడిని కొలవరు కానీ, ఆ ఏసూ, రాముడు ఒక్కరే” అని సర్వ మత సమానత్వాన్ని చాటినారు.

సాయి కూడా ఒక క్రిస్టియన్‌ పోలీసు గురించి మాట్లాడుతూ ”అతడు క్రిస్టియన్‌ అయితేనేం, నా సోదరుడే” అన్నారు.

ఒక భక్తుని ప్రశ్నకు సమాధానిమిస్తూ ”సాయి వద్దకు వెళ్ళిన తర్వాత ఏ మంత్రంతోను పనిలేదు” అని చెప్పింది అమ్మ.

ఆ అవధూత సాయిని దర్శించలేదు. ఆమె దేహాన్ని 8 జూన్‌, 1981 అర్ధ రాత్రి వదిలారు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles