భవతారిణి…. మహనీయులు – 2020… మే 31



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


షిరిడీ పేరు వినగానే సాయి గుర్తుకు వస్తారు. దక్షిణేశ్వరం పేరు వినగానే రామకృష్ణ పరమహంస జ్ఞప్తికి వస్తారు. దక్షిణేశ్వర ఆలయ సముదాయాన్ని కట్టించిన జమిందారిణి రాణి రస్మణి.

రాణి రస్మణి కాశీ క్షేత్రానికి వెళ్ళి కాశీ విశ్వనాథుని, అన్నపూర్ణను దర్శిద్దామని అన్ని ఏర్పాట్లు చేసుకుంది.

ప్రయాణానికి ముందు రోజు రాత్రి జగజ్జనని ఆమె కలలో దర్శనమిచ్చి “నువ్వు కాశీకి వెళ్ళ నవసరంలేదు. నా ప్రతిమను ఒక సుందరమైన మందిరంలో ప్రతిష్టించి, పూజాదులకు తగిన ఏర్పాట్లు చేయించు. ఆ ప్రతిమలో నేను నిరంతరం కొలువైవుండి సదా పూజలు స్వీకరిస్తాను” అంది.

కలకత్తాకు దగ్గరలో గంగానదీ తూర్పు తీరాన దక్షిణేశ్వరంలో దాదాపు ఇరవై ఎకరాల స్థలం కొన్నది.

ఆలయ నిర్మాణం 1847లో మొదలైంది. కాళీమాత కొలువైవున్న ప్రధాన దేవాలయంతోపాటు రాధాకాంతాలయం, 12 శివాయాలున్నాయి.

ఆనాడే ఆమె స్థలం కోసం 50, 000  రూపాయలు దేవాలయ నిర్మాణానికి 9,00,000 రూపాయలు,

గంగా తీరం వెంబడి మెట్లు కట్టించటానికి 1,60,000 రూపాయలు వెచ్చించటమేగాక 2,26,000 రూపాయల విలువగల ఆస్తిని దేవాలయ పోషణ నిమిత్తం ఆమె ఇచ్చింది.

కాళికాదేవి విగ్రహం తయారుచేయటం ప్రారంభించినప్పటి నుండి, రస్మణి శాస్త్రానుసారం తీవ్ర తపశ్చర్యలు చేయసాగింది.

రోజుకు మూడు సార్లు స్నానమాచరిస్తూ, సామాన్య శాకాహారం తింటూ, కటిక నేలమీద ఆ జమిందారిణి నిద్రించేది. తయారైన కాళికామాత విగ్రహాన్ని ఒక పెట్టెలో పదిలపరచారు.

ఒకనాటి రాత్రి రస్మణికి స్వప్నం వచ్చింది. “ఇలా ఎంతకాలం నన్నిలా మూసిపెడతావు? ఊపిరాడటం లేదు. వెంటనే నన్ను ప్రతిష్టించు” అని రస్మణికి చెప్పింది దేవి.

వెంటనే ఆమె శుభ ముహూర్తం కోసం పండితులను సంప్రదించింది 1855 మే 31వ తేదీని నిర్ణయించారు పండితులు. రామకృష్ణ పరమహంస సోదరుడు విగ్రహ ప్రతిష్టాపన చేశాడు.

భారత దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని కాళీకామాత ప్రసాదాన్ని స్వీకరించి తరించారు. ఆ ఒక్క రోజే 2,00,౦౦౦ రూపాయలను ఖర్చు చేసింది ఆ భక్తురాలు.

రామకృష్ణులు 30 సంవత్సరాలు ఇక్కడనే కాళీమాతను సేవించారు. ఆమె దర్శనం ఇచ్చింది. ఆ కాళీ మాత పేరు భవతారిణి. అంటే భవ (సంసార) సాగరాన్ని దాటించేది.

నల్లని చలువరాతితో సౌందర్యరాశైన ఆ దేవి, శివుని హృదయస్థానం మీద నిలబడి ఉంటుంది

విగ్రహ ప్రతిష్ట జరిగిన దినం నేడే.

ఆ భవతారిణిని రాణీ రస్మణి తన అంతిమ క్షణాల్లో కూడా స్మరించి ధన్యురాలైంది.

నేడు మే 31. విగ్రహ ప్రతిష్ట దినం. ఆ భవతారిణిని ప్రత్యక్షంగా చూడకున్నా, స్మరిద్దాం, తరిద్దాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles