హరిపంతు



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

పూనా పట్టణ వాస్తవ్యుడు హరిపంతు. అతడు వసిష్ణ గోత్రజుడైన, హిరణ్యకేశి బ్రాహ్మణుడు, జ్ఞాన సంపన్నుడు. అతడు గొప్ప అధికార పదవిలో ఉండేవాడు. అతడు గొప్ప శ్రీమంతుడైన దయార్ధహృదయుడు అతను బ్రహ్మకర్మల యందు అత్యంత నిష్ట గలవాడు. అతనికి అగ్నిహోత్రుని ఆరాధించాలని కోరిక. కాని భార్య మరణించింది. భార్య లేకుండా నిత్యాగ్నిహోత్రమేలా సాధ్యం?

గృహంలో ఎంతో సంపత్తి ఉంది కాని అతనికి సంతానం కూడా లేదు. అతని వయస్సు 50 ఏళ్ళు నిండి పోయాయి. అకారణంగా రెండవ వివాహం చేసుకోవడానికి అతని మనస్సు అంగీకరించలేదు.

పళ్ళ తోటను పెంచుకోవాలని కోరికగా ఉంటే దాని కోసం ముందు భూమిని సంపాదించుకోవాలి. తర్వాత దాన్ని త్రవ్వుకోవాలా – అవేం లేకపోతే తోట, పళ్ళు ఎలా వస్తాయి? మీరు మళ్ళి పెళ్లి చేసుకోండి. ప్రయత్నం చేస్తేనే నారాయణుని అనుగ్రహప్రాప్తితో ఎదైనా ఫలిస్తుంది. అందువల్ల మీరు ఒక సులక్షణమైన వధువును చూచుకొని రెండవ వివాహం చేసుకోండని అనేక మంది అతనికి సలహా ఇచ్చారు.

హరిపంతు వారితో “నా వయస్సు 50 సంవత్సరాలు దాటాయి. ఇప్పుడు నేను మరల వివాహం చేసుకుంటే లోకులు నవ్విపొరూ! అయినా ఈ ముసలి వయసులో నాకు సంతానం కలుగుతారా? నేనంతటి భాగ్యవంతుణ్ణా?ఆ ఆశపెట్టుకోవటం వ్యర్ధమే. అయినా సత్పురుశులేవరైనా వివాహం చేసుకొమ్మని చెప్పితే తప్పక చేసుకుంటానని” చెప్పారు.

అదృష్టవశాత్తు హరిపంతు షిర్డీకి వెళ్లి సాయిబాబా దర్శన భాగ్యాన్ని పొందారు. బాబా అతనితో “హరిబా! నువ్వెంతో భాగ్యవంతుడవు. త్వరగా వివాహం చేసుకో. భోలనాధ శంకరుడు, శూలపాణి, పరమాత్మ నీకు ఋణపడి ఉన్నారు. కనుక నీకు తప్పక పుత్రున్ని ప్రసాదిస్తారు. నీ కోరిక తీరుతుంది” అని చెప్పారు.

ఆ మాటలు విన్న హరిపంతు యొక్క స్నేహితులు ఎంతో సంతోషించారు. రెండవ వివాహం చేసుకోవడానికి సత్పురుషుని ఆజ్ఞ అయింది కదా! ఇంకెందుకు అలస్యమని హరిపంతుని నిలదీసి అడిగారు.

అప్పుడతడు జ్యోతిష్యుని అభిప్రాయం కూడా ఇదే అయితే నేను రెండవ వివాహం తప్పక చేసుకుంటానని చెప్పారు. ఒక గొప్ప జ్యోతిష్యుడు వచ్చి నగరులో ఉన్నారని అతనికి ఉత్తరం ద్వార తెలిసింది. హరిపంతు నగరుకు వెళ్లి ఆ జ్యోతిష్యుని సలహా కూడా తీసుకొని, సాయిబాబా దయవల్ల రెండవ వివాహం చేసుకున్నారు.

తరువాత సాయి అనుగ్రహం వలన ఆ దంపతులకు సంతానం కలిగారు. ఆ విధంగా హరిపంతుకు సాయి చరణాల యందు బాగా నిష్ఠ కుదిరింది.

సాయి సద్గురువు కృపారాసి. జ్ఞాన భాస్కరుడు. భావికులకు కోరిన ఫలలనిచ్చే చింతామణి. అనునిత్యం వారె పాదాలను స్మరిస్తే అపదలన్ని హరించుకొని పోతాయి. అందుచేత స్వప్నం నందు అయిన సరే వారిని మరచిపోకుండా ఉండటం ద్వారానే మనకు శుభం కలుగుతుంది.

source: దాసగణు గారి రచన భక్తలీలామృతం చాప్టర్ 31

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles