శ్రీ ఉపాసనీ బాబా మొదటి భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు 

పాండిత్యానికి, భక్తికీ ప్రఖ్యాతి చెందిన మహారాష్ట్ర బ్రాహ్మణ ఉపాసనీ కుటుంబంలో మే 5, 1870న సట్నాలో జన్మించాడు కాశీనాథ్. బడి చదువులు విడచి కాలమంతా సంధ్యావందనం, యోగాభ్యాసము, విష్ణు సహస్రనామ పారాయణలో గడిపేవాడు. వివాహం చేశాక గూడ అతనిలో మార్పేలేదు. సరికదా ఒకనాడు ఇల్లు విడచి కాలినడకన నాసిక్ చేరాడు. రెండు నెలల తర్వాత తల్లికి జబ్బు చేసిందని తెలిసి, తిరిగివచ్చిన కొద్ది కాలానికే అతని భార్య, తల్లీ మరణించారు. పెద్దలు రెండవ వివాహం చేసినా మళ్ళీ ఇల్లు విడిచి వెళ్ళిపోయి, ఎన్నో కష్టాలోర్చి సాధు సాంగత్యం చేస్తుండేవాడు.

తర్వాత మళ్ళీ స్వగ్రామమైన సట్నాకు వెళూండగా ఒక అడవిలో ఒక కొండమీద గుహ కన్పించింది. అందులో కూర్చొని ప్రాయోపవేశం చేయదలచి ఒక పెద్దచెటు పైకెక్కి అందులో దూకాడు.అక్కడ నిరంతరం జపంచేస్తూ త్వరలో బాహ్యస్మృతి కోల్పోయాడు. ఒకనాడు మెలకువ వచ్చినపుడు ఒక దివ్యదర్శనమైంది. ప్రక్కన ఎవరో నిల్చొని అతని చర్మం వలుస్తున్నారు. భయపడి కళ్ళు తెరిచేసరికి ఎవరూలేరు. మళ్ళీ బాహ్యస్మృతి కలిగేసరికి విపరీతమైన దాహమేసింది. ప్రక్కనే వాననీరు చిన్న మడుగుకట్టివుంటే త్రాగి, వాటితో శరీరం తుడుచుకున్నాడు.నాల్గవరోజు మరో దర్శనమైంది. దప్పికతో తానొక కాలువ దగ్గరకెడుతున్నాడు. తనకొకవైపు ఒక ముస్లిం సాధువు, మరోవైపాక సన్యాసి వున్నారు. వారిద్దరూ అతడి పాత చర్మం తీసివేసి, లోపల బంగారం వంటి దేహమతనికి చూపి, “ఎందుకు చావయత్నిస్తావ్? మేము నిన్నెన్నటికీ చావనివ్వము!” అన్నారు. అప్పుడతడు గుహనుండి దిగి, జూలై 22, 1890న ఇలు చేరాడు. ఎన్నో నెలల తరబడి తాను సమాధి స్థితిలో వున్నట్లు తెలుసుకొన్నాడు.

ఒక సం. లోగా అతని తండ్రి, తాత, రెండవ భార్య మరణించారు. కుటుంబం అప్పుల పాలయ్యేసరికి లోకమాన్య బాలగంగాధర తిలక్ గారు ఆదుకున్నారు. తర్వాత అతడు వైద్యమభ్యసించి అమరావతిలో గొప్ప వైద్యుడై శ్రీమంతుడయ్యాడు. గాని వ్యాపారంలో అంతా నష్టపోయాడు. బంధువులు మూడవ వివాహం చేశాక ఆ దంపతులు యాత్రలు చేశారు. ఓంకారేశ్వర్లో అతడు తీవ్ర సమాధి స్థితిలో నుండగా భార్య భయపడి నీరుచల్లి మేల్కొలిపింది. అప్పటినుండి అతనికి గాలి పీల్చడమెంతో కష్టమయ్యేది. నిద్రపోతే శ్వాస నిలిచిపోయేది. ఏ వైద్యానికీ ఆ బాధతగ్గలేదు. చివరకు యోగంలో వచ్చిన బాధను యోగపూరులే తొలగించగలరని తలచి, భార్యను ఇంటవదలి, 1911లో అట్టివారిని వెదుకుతూ బయలుదేరాడు కాశీనాథ్.

అతడు రాహురిలో యోగి కులకర్ణిని దర్శిస్తే ఆయన, “నీవు మంచి స్థితిలో వున్నావు. నిన్ను సాయిబాబా మాత్రమే ఉద్ధరించగలరు” అన్నారు. కాని, సాయి “ముస్లిమ్” అని తలచి, వారిని దర్శించలేదు కాశీనాథ్. తర్వాత దారిలో ఒక వృదుడు కన్పించి, “చన్నీరు త్రాగవద్దు, వేడినీరు మాత్రమే త్రాగు!” అని చెప్పాడు. అతడా మాట లెక్కపెట్టక, వేరొకచోట నీరు త్రాగడానికి కాలువకు వెళ్తూంటే ఆ వృదుడే మళ్ళీ ఎదురై మందలించి, ప్రక్క గ్రామంలో వేడినీరు త్రాగమని ఆదేశించి అంతర్ధానమయ్యాడు! కాశీనాథుడు ఆశ్చర్యపడి అలానే చేశాడు. బాధ చాలావరకు తగ్గింది. తర్వాత అతడు ఖేడ్గాంబేట్లో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ నారాయణ మహరాజ్ను దర్శించాడు. ఆయన అతనికి తాంబూలమిచ్చి, “నీవు లోపల, బయట బంగారం పూసినటు, మంచి యోగస్థితిలో వున్నావు. నీవు కోరదగినదేమీ లేదు” అన్నారు. అతని బాధ మాత్రం తగ్గలేదు. అతడు మరలా యోగి కులకర్ణిని దర్శించాడు. ఆయన వెనుకటి సలహానే యిచ్చాడు. గత్యంతరంలేక జూన్ 27, 1911న శిరిడీ చేరాడు కాశినాథ్.

రెండు రోజులు సాయి సన్నిధిలో వుండడంతోనే అతని బాధ మటుమాయమైంది! అయినా అతనికి ‘ఫకీరు’ సన్నిధి దుర్భరమనిపించి తిరిగి వెళ్ళడానికి అనుమతి కోరాడు. “నీవు వెళ్ళిద్దు, వెడితే 8వ రోజుకు రావాలి!” అన్నారు బాబా, ఆ మాట అతనికి నచ్చలేదు. అపుడు సాయి, “సరే, వెళ్ళు. నేను చేసేది చేస్తాను” అన్నారు. కాశీనాథుడు పట్టుదలతో ఎంత వేగంగా నడచినా, 8వ రోజుకు 20 మైళ్ళలోనున్న కోపర్గాము చేరాడు! అక్కడ ప్రథమంగా శిరిడీ పోతున్న భక్తులు బలవంతాన అతనిని తోడుగా తీసుకెళ్ళారు. సాయి అతణ్ణి చూస్తూనే నవ్వి, “నీవు వెళ్ళి ఎన్ని రోజులయింది?” అన్నారు. ఎనిమిది రోజులయిందన్నాడు కాశీనాథ్. అప్పుడతనిని వాడాలో వుండమని బాబా ఆజ్ఞాపించారు. ఈసారి అతడు ఆయన మాటకు తలవొగ్గారు. 

రేపు తరువాయి భాగం…

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles