బాబావారి కఫ్నీ



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

బాబావారి కఫ్నీ

బాబా తన జీవితాంతం తలకు తెల్లని రుమాలు నడుముకు లంగోటి, ఒక కప్ని ధరించేవారు. ఆయన 6 వరాల దాక స్నానం చేసేవారు కాదు. ఆయన స్నానం అయ్యాక ఒక రంగు వస్త్రం కట్టుకొని, ఒక్కొక్కప్పుడు కప్నీ తడిపి, ధుని మీద ఆరబెట్టి తిరిగి  తోడుక్కునేవారు. ఆ కప్ని, తలకట్టు గూడా కొన్ని నెలల దాక మార్చేవారు కాదు. అవి మార్చదలచినప్పుడు కాశి నాధుడనే దర్జివాన్ని పిలిచి, కొత్తది తెమ్మనేవారు. అతడు తీసుకురాగానే అది దరించి, పాతది ధునిలో పారేసి నమష్కరించేవారు. బాబాగారు తన కఫ్నీ చిరిగిపోయి పాడయిపోయినప్పుడెల్లా దానిని యితరులకెవరికైనా యిచ్చివేసే బదులు దానిని ధునిలో కాల్చి బూడిద చేసేవారు. దానిని ధునిలో కాల్చడానికి అది పాతబడిపోవాల్సిన అవసరమే లేదు. ఒక్కొక్కసారి ఆయన కఫ్నీలను కొద్ది కాలమే ధరించినప్పటికి వాటిని కాల్చి బూడిద చేసేవారు. ఒకోసారి ఆయన వాటిని కుట్టుకొని బాగుచేసుకొని ధరిస్తూ ఉండేవారు. సాయిబాబాగారి దుస్తులు చిరుగులు పట్టినపుడు, తాత్యాపాటిల్ ఆయన దగ్గర చేరి, దానిని చూచే మిష మీద ఆ చిరుగులనింకా పెద్దవి చేసేవాడు. అయినా ఆయన క్రొత్తది వేసుకునే బదులు మధ్యాహ్నం ఒంటరిగా వున్నప్పుడు ఒక ముల్లును సూదిగా చేసుకొని, ఆ చిరుగులన్నింటికి మాసికలు వేసుకొనేవారు. 

సాయిబాబా ఏభక్తుడినయినా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని భావించినపుడు, ఆ అదృష్టవంతునికి బాబావారి దుస్తులు ప్రసాదంగా లభించేవి. బాబావారి దుస్తులలో అపారమయిన శక్తి నిండి ఉంది. ఒక సారి సాయిబాబా తన కఫ్నీని మహల్సాపతికి బహుమతిగా యిచ్చారు. దానియొక్క ఫలితం ఏమిటంటే, మహల్సాపతి తాను మరణించే వరకూ సన్యాసిలా జీవించినా, తన కుటుంబ బాధ్యతలను సామాజిక అనుంబంధాలని నెరవేర్చాడు.

మరొక సంఘటనలో సాయిబాబా తన కఫ్నీని ముక్తారాం అనే భక్తునికిచ్చారు. కఫ్నీ బాగా మాసిపోయి ఉండటంవల్ల ముక్తారాం దానిని ఉతికి వాడా (ధర్మశాల) లో ఆరబెట్టాడు. తరువాత ముక్తారాం బాబా దర్శనానికి వెళ్ళాడు. కాకాసాహెబ్ దీక్షిత్ వాడాలో కఫ్నీ ఆరబెట్టిన చోట వామనరావు ఉన్నాడు. కఫ్నీలోనించి ఈ విధంగా మాటలు వినిపించాయి, “చూడు, ముక్తారాం నన్నిక్కడకు తీసుకొనివచ్చి తలకిందులుగా ఆరబెట్టాడు”.  వామనరావు వెంటనే కఫ్నీని తీసి తాను ధరించాడు. కఫ్నీని ధరించిన తరువాత వామనరావు ద్వారకామాయికి వెళ్ళాడు. కఫ్నీని ధరించిన వామనరావుని చూసి సాయిబాబా కోపోద్రిక్తులయ్యారు. కాని, వామనరావు సన్యాసం తీసుకోవడానికి నిశ్చయించుకొన్నాడు. ఈసంఘటన జరిగిన తరువాత సమయం వచ్చినపుడు వామనరావు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి చేరుకొన్నాడు.

15, అక్టోబరు, 1918, మంగళవారమునాడు బాబావారు సమాధి చెందిన తరువాత బాబావారి పాత గుడ్డ సంచిని తెరచి చూశారు. దానిని ఆయన ఎప్పుడూ ఎవరినీ ముట్టుకోనిచ్చేవారు కాదు. ఆసంచిలో ఆకుపచ్చ కఫ్నీ, ఆకుపచ్చ టోపీ కనిపించాయి. వాటిని కాశీరాం అనే దర్జీ బాబాకిచ్చాడు. బాబా వాటిని ధరించారు. కాని, తరువాత తెల్లని దుస్తులను ధరించడానికే యిష్టపడ్డారు. మిగిలిన వస్తువులతోపాటు, ఈ సంచికూడా బాబావారి సమాధిలోపల ఉంచారు.

నేటికీ షిర్దిడీలోని దీక్షిత్ వాడాలో “సాయిబాబా మ్యూజియం లో బాబావారి మరొక కఫ్నీని చూడవచ్చు.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “బాబావారి కఫ్నీ

kishore Babu

Thank you so much Sai Suresh…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles