శ్రీ ఉపాసనీ బాబా రెండవ భాగం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులకు బాబా వారి ఆశీస్సులు

శిరిడీలో నిత్యమూ భక్తుల అనుభవాలు వినడంతో అతని మనస్సు క్రమంగా మారింది. ఒకరోజు బాబా అతనివైపు చూచి నవ్వుతూ భక్తులతో అన్నారు. “ఒకప్పుడు ఒక గర్భిణియై కొన్ని సం. లయినా ప్రసవించలేదు. ఆమెను వేడినీరు మాత్రమే త్రాగమని చెప్పాను. ఆమె నా మాట లెక్కచేయక నీరు త్రాగడానికి ఒక కాలువకు వెళుతున్నది. ఆమె గర్భంలోని బిడ్డలు నశిస్తారేమోనని నేను ఆమెను మరలా మందలించాను. ప్రక్క గ్రామంలో వేడినీరు త్రాగాక ఆమెకు బాధ చాలావరకూ తగ్గింది” అన్నారు. తనకు రెండుసార్లు దర్శనమిచ్చిన వృదుడు ఆయనేనని గుర్తించి పులకించాడు కాశీనాథ్.

తర్వాత బాబా, “కొన్నివేల సం||లుగా మనిద్దరికీ ఋణానుబంధ మున్నది” అని, “ఒక బావి ప్రక్క చెట్టుమీద రెండు పక్షులుండేవి. ఒకటి బావిలో పడితే దానిని రక్షించడానికి రెండవది తన ప్రాణాలు తెగించవలసి వచ్చింది” అన్నారు. మాయలోబడిన శిష్యుని రక్షించడానికి సద్గురువు అవతరించవలసి వచ్చిందని వారి భావం గాబోలు! తర్వాత కాశీనాథ్ తో “ఎవరితోనూ సంబంధం లేకుండా మౌనంగా ఖండోబా ఆలయంలో 4 సం||లుండు; ఖండోబా కృప లభిస్తుంది” అన్నారు బాబా.

రోజూ శ్రీ కాశీనాథ్ స్వయంగా వంట చేసుకొని, మొదట మశీదులో సాయికి నివేదించి, తర్వాత భోజనం చేసేవాడు. ఒకరోజు “నేనక్కడికి వస్తే నీవు గుర్తిస్తావా?” అన్నారు బాబా. అతడికేమీ అర్థంగాలేదు. ఒకరోజొక నల్లకుక్క అన్నంకోసం అతని వెంటపడింది. దానిని తరిమేసి నివేదనతో మశీదు చేరగానే సాయి, “ఇంతదూరం రానక్కరలేదు. నేనక్కడే వున్నాను. ఆ నల్లకుక్కను నేనే!” అన్నారు. మరొకసారి అతడు వంట చేస్తుంటే ఒక బిచ్చగాడు ఆశగా చూస్తున్నాడు. ఆచారవంతుడైన కాశీనాథ్ అతనిని తిట్టి వెళ్ళగొట్టాడు. సాయి ఆనాడు నివేదన అంగీకరించక, “అక్కడ హరిజనుడి రూపంలోనున్న నన్ను తిట్టావు. నీవెక్కడ చూస్తే, అక్కడే వున్నాను గుర్తుంచుకో!” అన్నారు. అతడు సాయి చెప్పినది మరచి వేదాంతగొష్టి చేస్తుంటే ఆయన మందలించేవారు. ఇలా 3 సం. లకు పైగా గడచింది. ఆ కాలంలో అతడెన్నో బాధలనుభవించాడు. ముక్కోపము, ఆత్మాభిమానమూ గలవాడేమో, ఈ బాధలు మరీ తీవ్రంగా వుండేవి. ఒకప్పుడు కొన్ని మాసాలు అన్న ద్వేషమనుభవించాడు. తుంటరులైన యువకులు ఆయనను ఎన్నోరీతుల బాధించేవారు. ఆ బాధలు భరించలేక అతడెన్నోసార్లు శిరిడీ వదలి వెళ్ళాలనుకున్నాడు. కాని సాయి వెళ్ళనివ్వలేదు. “నీవిప్పుడెంత ఓర్చుకొంటే నీ భవిష్యత్తు అంత ఉజ్జ్వలంగా వుంటుంది. నాలుగు సం.లు యిక్కడుంటే నా స్థితే నీకూ కలుతుంది” అనేవారు. కాని అతడు సుమారు 3 1/2 సం. లున్నాక సాయితో చెప్పకుండా భక్తులతో కలసి ఖరగ్పూర్ వెళ్ళిపోయాడు. కాని అప్పటికే అతనిలో యోగశక్తులు ప్రకటమయ్యేవి. ఉదాహరణకు, నెవాసా నుండి కొందరు భక్తులతో నరహరి సాయిని దర్శించాడు. కాని ఆయన ముస్లిమని శంకించాడు. వెంటనే సాయి అతనికేసి ఉరిమిచూచారు. అతడు బయటకు పోయి ఖండోబాలో ఉపాసనీ శాస్త్రికి నమస్కరించబోయాడు. ఆయన తనకాళ్ళు వెనక్కు తీసుకుని, “నీవు బ్రాహ్మణుడవు, సాయి ముస్లిమ్! నువ్వాయనకు నమస్కరించకూడదు! అటువంటప్పుడు నీతో నాకేమి పని?” అన్నారు. చివరకు ఆయన శిరిడీ దగ్గరున్న సాకోరిలో ఉపాసనీ బాబాగా స్థిరపడి, డిసెంబర్ 24, 1941న సమాధి చెందారు. శ్రీ సాయి ఆదేశించినట్లు ఆయన 4సం. లు పూర్తిగా శిరిడీలోనే వుంటే ఏమయ్యేదో!

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ ఉపాసనీ బాబా రెండవ భాగం

kishore Babu

Thank you so much Sai Suresh…

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles