శ్రీ సాయి దత్తావతారం మొదటి బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

శ్రీ సాయి తాము సకల దేవత స్వరూపులమని, సకల సాధు స్వరుపాలమని ఏన్నో లీలల ద్వారా ఋజువు చేసారు. దత్త అవతారలైన శ్రీ పాద శ్రీ వల్లభుడు, శ్రీ నృసింహ సరస్వతి, శ్రీ మాణిక్య ప్రభువు, శ్రీ అక్కలకోట స్వామి కూడా తమ రుపాలేనని బాబా నిరూపించిన కొన్ని లీలలను నేను మీ ముందు పెడుతున్నాను.

శ్రీ పాద శ్రీ వల్లభులు, సాయిబాబా ఒక్కరే అనే నిరూపించే లీలను నేను మీకు ఈ వ్యాసం చివరలో గాడ్గే మహారాజ్ వృత్తాంతం ద్వారా శ్రీ పాద శ్రీ వల్లభ చరితామృతం ఆధారంగా   తెలియజేస్తాను. ముందుగా మిగిలిన అవతారాల గురించి చదవండి.

శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా

సింధియాకు అందరూ కుమార్తెలే అతడు 1903లో గాణ్గాపూర్ దర్శించి, తనకు కొడుకు జన్మిస్తే దర్శనానికి వస్తానని మొక్కుకున్నాడు. కాని అది నెరవేరాక అతడు మొక్కు తీర్చలేదు.

అతడు 1914లో శిరిడీ దర్శించాడు అతడిని చూస్తూనే సాయి ఉగ్రులై, “ఒక్క కొడుకు పుట్టాడని నీకింత గర్వమా? అంతటి అదృష్టం నీ రాతలో లేదు నా శరీరం చీల్చి నీకొకణ్ణి ప్రసాదించాను” అన్నారు. 15వ శతాబ్దానికి చెందిన శ్రీ నృసింహ సరస్వతియే నేటి సాయిబాబా అని సింధియా గుర్తించాడు.

సాయి, మాణిక్య ప్రభువులు ఒక్కరే

బాబా ఒకరోజు ఒక కథ చెప్పారు.  “ఒకరోజు కొందరు ముస్లింలు వారితో విందు అరగించమని పట్టుబట్టారు. బ్రాహ్మణుడైన నాకు మాంసాహారం నిషిద్ధమని చెప్పినా వారు వినలేదు. అప్పుడు నేను వంటకాల పై గుడ్డ కప్పి భగవంతుని ప్రార్ధించాను. గుడ్డ తీసేసరికి ఆ మాంసం పెద్ద గులాబి పూలుగా మారింది. ఆ ముస్లిములు ఆశ్చర్యపడి క్షమాపణ వేడుకున్నారు. “

ఈ లీల మూడవ దత్తావతారమైన శ్రీ మాణిక్య ప్రభువుల చరిత్ర లో జరిగింది. ఈవిధంగా సాయి తాము, మాణిక్య ప్రభువులు ఒక్కరే అని నిరూపించారు.

శ్రీ అక్కల్కోటస్వామియే శ్రీ సాయి 

  • అక్కల్కోటలో దత్తావతారమైన స్వామి సమర్థ (1856-78) నిర్యాణం చెందనున్నారు. భక్తుడు కేశవనాయక్ శోకిస్తుంటే, స్వామి తమ పాదుకలతనికిచ్చి, “నా అవతారం శిరిడీలో వున్నారు సేవించుకో” అన్నారు.

ఆతరువాత నాయక్ తన కొడుకును తీసుకోని శిరిడి బయలుదేరారు. రైల్ లో శిరిడి వెళ్ళేవారు కలసి సాయి కేవలం పిచ్చి ఫకీర్ అని చెప్పారు. అయినా శిరిడి చేరాక నాయక్ తో వారు గూడా మసీదు వద్దకు వచ్చారు.

నాయక్ తో సాయి “నువ్వు నీ కుమారుడు రావచ్చు. తక్కిన వారు వస్తే భ్రష్టులవుతారు” అన్నారు. తర్వాత వేపచెట్టు నుండి కొద్ది ఆకులు అందరకు పంచి, రుచి చూడమన్నారు. అవి నాయక్ లకు తియ్యగాను, మిగిలిన వారికీ అతి చెడుగానూ ఉన్నాయి. సద్గురు భక్తులకు సంసారం మధురంగాను, విధ్యాహంకారులకు చెడుగానూ వుంటుంది.

  • హరిశ్చంద్ర పితలే (బొంబాయి) కుమారుడి మూర్ఛవ్యాధి ఎన్ని వైద్యాలకూ లొంగలేదు. మిత్రుల సలహాపై సాయిని దర్శించగా, వారి ఆశీర్వచనంతో తగ్గింది. తర్వాత వారికి సెలవిస్తూ సాయి, “బాపూ, ఇదివరకు మీకు రూ. 2/- లిచ్చాను; ఇపుడు మరో రూ. 3/- లిస్తున్నాను. వీటిని గూడా పూజించుకో, మేలవుతుంది” అని 3 కాసులిచ్చారు.

ప్రథమంగా శిరిడీ దర్శించిన పితలేకు ఆ మాటలర్ధంగాక, ఇల్లుచేరి తన తల్లినడిగాడు. ఆమె, “నీ చిన్నతనంలో మనం అక్కల్కోట స్వామిని దర్శించాము. అపుడాయన రూ. 2/-లిచ్చి పూజించుకోమన్నారు. మీ తండ్రి చనిపోయాక అవి కన్పించలేదు. ఆయనే మరల సాయిబాబా రూపంలో నిన్ననుగ్రహించారు” అన్నది.

  • అక్కల్కోట స్వామి నిర్యాణమయ్యాక భక్తుడు కృష్ణజీ తరచు వారి సమాధిని దర్శిస్తూండేవాడు. ఒకనాటిరాత్రి అతనికి స్వామి దర్శనమిచ్చి, ‘ఇపుడు అక్కల్కోటలో ఏముంది? నేనిపుడు శిరిడీలో వున్నాను. అక్కడ సేవించుకో!’ అన్నారు.

మరురోజే అతడు శిరిడీచేరి, సాయిసన్నిధిలో ఆరుమాసాలున్నారు. అలవాటు ప్రకారం అక్కల్కోట వెళ్ళడానికి అనుమతి కోరాడు కృష్ణజీ. సాయి, “ఇపుడు అక్కడేముంది? ఆ స్వామి యిపుడు నా రూపంలోనే వున్నారు. అక్కడకు వెళ్ళడమెందుకు?” అన్నారు.

  • ఠాణే కు చెందిన నారాయణ్ కు ప్రమాదంగా జబ్బు చేసినపుడు మిత్రులు సాయి పటము, విభూతి ఇచ్చారు. మరురోజే అతని జబ్బు తగ్గిపోయింది. అయినా దత్తావతారమైన అక్కలకోట స్వామి పటం ప్రక్కనే సాయి పటం ఉంచకూడదని తలచి దూరంగా ఉంచారు నారాయణ్.

నాటిరాత్రి స్వప్నంలో అతనికొక ఫకీర్ దర్శనమిచ్చి “ఆ ఫకీర్, స్వామి వేరుకాదు” అని చెప్పారు. మరురోజే అతడు సాయి పటాన్ని కూడా పూజలో పెట్టారు.

  • ఒకసారి ఆరతి సమయంలో బాపూ సాహెబ్ జోగ్ కు అక్కలకోట స్వామిగా దర్శనం ఇచ్చారు సాయి. బాబా అక్కలకోట స్వామి ఒక్కరే!

రేపు శ్రీ గాడ్గే మహరాజ్ ని శ్రీ సాయి అనుగ్రహించుట…..

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

 

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “శ్రీ సాయి దత్తావతారం మొదటి బాగం…

http://saileelas.com/m/sounds/view/03-chapterMp3
03 chapterMp3
శ్రీ సాయి సచ్చరిత్రము… తెలుగు OVI TO OVI ….మూడవ అధ్యాయం ..మరాఠి మూలం శ్రీ అన్నాసాహెబ్ దాభోల్కర్ …. తెలుగు అనువాదం కుమారి మణెమ్మ ….. ధ్వని అనుకరణ శ్రీ శ్రీనివాస ప్రసాద్

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles