Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
ఎంతటి వారికయినా ప్రారబ్ధకర్మ తప్పంటారు బాబా. ఆ దేవుడయినా మానవజన్మ ఎత్తినప్పుడు, దేహధర్మాన్ని పాటించాల్సిందేనంటారు. దేహధర్మాన్ని పాటించే అవతార పురుషులు శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దేహత్యాగం చేశారన్నారు బాబా.
‘‘అసలీ దేహధర్మం అంటే ఏమిటి బాబా?’’ అడిగాడు శ్యామా. సమాధానం చెప్పేందుకు ముందు శ్యామాని చిరునవ్వుతో చూశారు బాబా. తర్వాత ఇలా అన్నారు.
‘‘దేహధర్మం అంటే మృత్యువుని నవ్వుతూ ఆహ్వానించడం.’’శ్యామాకి అంతుచిక్కలేదు.‘‘దేహానికి బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం అని నాలుగు దశలు ఉంటాయి. ఈ నాలుగు దశలనూ మనిషి అనుభవించాలి. అనంతరం నశించాలి. అంటే మరణించాలి. అది దేహధర్మం.
కొందరు ప్రారబ్ధకర్మను అనుసరించి, నాలుగు దశలూ అనుభవించకుండానే ఏదో ఒక దశలో దేహాన్ని చాలిస్తారు. ఎప్పటికయినా మృత్యువు తప్పదు. తప్పని మృత్యువుని చూసి భయపడే కంటే దానిని నవ్వుతూ ఆహ్వానించి, ఆనందించడంలోనే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు.’’ అన్నారు బాబా.
అలాంటి మాటలు వినడం ఇష్టం లేదేమో! అసహనంగా కదిలాడు శ్యామా.
‘‘రేపు నువ్వయినా నేనయినా పోవాల్సిందే! ఎల్లకాలం ఇక్కడ ఉందామంటే కుదరదు.’’ అని నవ్వారు బాబా.‘‘నేను అంటే మామూలు మనిషిని. పోతాను. నువ్వు ఎలా పోతావు? నువ్వు మనిషివి కాదు, దేవుడివి.’’ అన్నాడు శ్యామా.
‘‘దేవుడయినా మానవ జన్మ ఎత్తినప్పుడు మరణం తప్పదు. చెప్పానుగా.’’ అన్నారు బాబా.‘‘ఒప్పుకోను, నీకు మరణమా? భరించలేను. నువ్వు నిండు నూరేళ్ళు బతకాలి. కాదు కాదు, వెయ్యేళ్ళు బతకాలి.’’ అన్నాడు శ్యామా.
‘‘నీ కోరిక అల్లా ఒప్పుకోడు. సమయం వస్తే నేనయినా తప్పుకోవాల్సిందే! తనువు చాలించాల్సిందే.’’ అన్నారు బాబా.‘‘పదే పదే ఆ మాట ఎందుకు బాబా! మీరు మాట్లాడకండి.’’ అన్నాడు శ్యామా. సన్నగా విసుక్కున్నాడు.
‘‘నువ్వు విసుక్కున్నా, కసురుకున్నా వచ్చే మృత్యువు రాక మానదు. దానిని ఎవరూ నిలువరించలేరు.’’ అన్నారు బాబా.తల కొట్టుకున్నాడు శ్యామా.‘‘బుద్ధి తక్కువై దేహధర్మం ఏమిటంటూ అడిగాను నిన్ను. తప్పు చేశాను. చాలు బాబా, చాలు! చావు గురించి ఇక మాట్లాడకు.’’ అన్నాడు శ్యామా. కన్నీరు పెట్టుకున్నాడు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- ‘‘నేనే కాపాడతాను. బయిజాకిచ్చిన మాట తప్పుతానా?’’
- అనుక్షణం నన్ను అనుమానించే నిన్ను ప్రతి క్షణం ప్రేమించాలనిపిస్తుంది. ఏం చెయ్యను
- మళ్ళీ మళ్ళీ పుట్టడం, మళ్ళీ మళ్ళీ మరణించడం నిజమా?
- ‘‘ఇక మీదట నేను మాట్లాడను. నా సమాధి మాట్లాడుతుంది.’’
- ఊది మహత్మ్యం(భాగోజీకి బాబావారి రక్షణ)
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments