మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక మొదటి బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక మొదటి బాగం…

ఈ రోజు మనము మొదటి సారి షిరిడీ సాయినాథుని దర్శనం చేసుకున్న సాయి భక్తులు, విశాఖపట్నము వాస్తవ్యులు శ్రీ నౌడురు రామకృష్ణమూర్తి గారి అనుభవాలను తెలుసుకుందాము. వారి అనుభవాన్ని వారు చెప్పిన మాటలలోనే.

శ్రీ రామ కృష్ణ గారు వారు వారి అబ్బాయి పని మీద ముంబాయి వెళ్ళి అక్కడినించి షిరిడీ వెళ్ళడం జరిగింది. యిక అక్కడ షిరిడీలో అనుభవాల పరంపరని తెలుసుకుందాము.

మేము ముంబాయినించి 2011వ  సంవత్సరం మే నెల 11 తారీకున బుథవారము బయలుదేరి గురువారము నాడు ఉదయం 5.30కి షిరిడీ చేరుకున్నాము. ఉదయం 7.30 కి సాయి దర్శనం అయింది. చాలా సెపు అక్కడె వున్నాను.

ఒక దండ కొసం బాబాను చూస్తూ వెనక్కి నడుస్తున్నా, వెంటనె ఒక ఆయన దండ తెచ్చి నాకు ఇచ్చారు .  నేను చాలా సంతోషించాను. 30 నిమిషాలు అక్కడే వున్నాను. 8.30 కి బయటకి వచ్చాను.

తరువాత 10.30 కి దర్శనం కోసం వెళ్ళాను. అక్కడ ఒక చిన్న కుఱ్ఱవాడు వచ్చి చిన్న వస్త్రం, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఇచ్చి బాబా వారికి యివ్వమన్నాడు. నేను వాటిని ఇచ్చి ఆ వస్త్రం ఇవ్వమని అడిగాను. కాని పూజారి గారు ఇవ్వలేదు. కాని తరువాత పూజారిగారె సెక్యూరిటీగార్డ్ ద్వారా వెళ్ళిపోతున్న నాకు ఇప్పించారు. నాకు చాలా అనందం వేసింది.

12.30 హారతికి అక్కడే హారతి పాడాను. నా జేబులో హారతి పుస్తకం వుంది.

తరువాత 5.30 కి దర్శనం అయింది. బాబా వారి దర్శనం రెండు సార్లు చేసుకున్నాను. మూడవసారి కూడా దర్శనానికి వెళ్ళాను. అక్కడ సమాథి మీద ఒక పువ్వుల పువ్వుల వస్త్రం పెద్దది ఒకటి ఉంది. నా మనసులో ఆ వస్త్రం కావాలనుకున్నాను.

కాసేపు అయిన తరువాత ఒకావిడ వచ్చి సమాథికి మళ్ళీ దణ్ణం పెట్టు అన్నారు. నేను దణ్ణం పెట్టుకున్నాక పూజారిగారు దణ్ణం పెట్టుకోవడం అయింది కదా, యింకా యేమి కావాలి అన్నారు. నాకు ఆ వస్త్రం కావాలి అని బయటకే అనేశాను. మొదట ఇవ్వను అన్నారు. కాని సమాథి మీద ఉన్న ఒక మీటరు పొడవు ఉన్న చిన్న వస్త్రం ఇచ్చారు. నాకు చాలా అనందం వేసింది.

రాత్రి 9.30 కి మరలా దర్శనం అయింది ఒకే రోజు 4 దర్శనాలు అయ్యాయి ద్వారాకమాయి చావడి ధుని వేపచెట్టు దర్శానాలు అయ్యాయి . శుక్రవారం ఉదయం 7.30 కి వెళ్ళాను. ఒక పెద్ద వస్త్రం సమాథి మీద వుంది అది నాకు కావాలని వుంది నాకు మనసులో. మరలా వస్త్రం లభించింది. అలా మూడు వస్త్రాలు బాబా దయ వలన నాకు లభించాయి.

నా ఆనందం చెప్పనలవి కాదు. ఒకటిన్నర రోజులో నాకు ఎనిమిది దర్శనాలు అయ్యాయి. బాబా వారి దర్శనం అయ్యాక బయట అందరకూ లైనులో ఊదీ ఇస్తున్నారు. ఒకరికి ఒక ఊదీ పాకెట్ మాత్రమే ఇస్తున్నారు. నాకూ ఒకటి ఇచ్చారు. నేను మరొకటి కావాలని అడిగాను. వెంటనే నాకు మరొకటి ఇచ్చారు.

నా వెనకున్న ఆయన కూడా తనకీ మరొకటి కావాలని అడిగాడు. ఊదీ ఇచ్చే అతను రెండు ఇవ్వరు అన్నాడు. ఆయన నన్ను ఉద్దేశించి, నా ముందున్న ఆయనకు ఇచ్చారుగా అన్నాడు. అప్పుడు ఊదీ ఇచ్చే అతను ఆయన అదృష్టం అది అన్నాడు. అలా బాబా వారు నాకు మరొక ఊదీ ని కూడా ప్రసాదంగా ఇచ్చినందుకు నాకు చాలా ఆశ్చర్యం వేసింది.

మరునాడు శుక్రవారము నాడు ఉదయం పల్లకీ సేవ జరుగుతోంది. బాబా ని పల్లకీలో ఊరేగిస్తున్నారు. నేను యెదురుగా నించుని నేను కూడా పల్లకి మోస్తానని సంజ్ణ చేశాను. పల్లకీ మోసే ఒకాయన నన్ను పిలిచి దా తీసుకో అని పల్లకీని మోసే అవకాశాన్నిచ్చారు. కాసేపు పల్లకీ మోసే భాగ్యం కూడా కలిగింది నాకు.

నేను నాసిక్ వెడదామని శుక్రవారం రాత్రి అనుకున్నాను. అక్కడ వసతి గురించి ఎలాగా అనుకున్నా, ఒక అలోచన వచ్చింది  లాకర్ లో సామాను ఉంచి బయలుదేరుదాం అనుకున్నా గది ఖాళీ చేసాము కూడా.

వెంటనే ఈరాత్రి ఇక్కడే వుండు అని బాబా సందేశం నాకు ఇచ్చినట్లు గా వచ్చింది. అక్కడ రాత్రి ఇబ్బంది పడతారు అని. ఆగిపోయాము. మరొకసారి రాత్రి బాబా దర్శనం అయింది. శనివారం ఉదయం మరొక దర్సనం అయింది. శనివారం ఉదయ నాసిక్ 10.30. కి వెళ్ళి పంచవటి ముక్తిధాం గోదావరి స్నానం త్రయంబకేశ్వర దర్శనం అయ్యాయి. ఘ్రుణేశ్వరం లో నేను ఈశ్వరుని కి పాలతో అభిషేకం చేశాను.

రేపు శ్రీ రామ కృష్ణగారి థర్మ పత్ని శ్రీమతి శారద గారి 9 గురువారముల వ్రత మహాత్మ్యం

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

0 comments on “మొదటిసారి షిరిడీయాత్ర : అనుభవాల మాలిక మొదటి బాగం…

సాయినాథుని ప్రణతి

ఈ లీల చాలా బాగుంది .నేను నా అనుభవం చెబుతాను .లస్ట విక్ శనివారం మావారు శిరిడీ కి వెలారు 4 రోజులు అక్కడ వున్నారు నాకు ఎప్పుడన మా గురువుగారిది సన్నిదానం లైవ్ చూడ్డడం అలవాటు . ఎందుకో తేలియలెదు సోమవారం సన్నిదానం లైవ్ చూసాను ఆ లైవ్ లో మావారు కనిపించారు చాలా ఆనందించాను ,మా గురువుగారి దెగ్గర రోజు సాయంత్రం క్లినింగ్ 4 గంటలకు చెస్తారు నేను అలాగే కోంచం ఆలస్యంగా పడుకొని సాయంత్రం 4:50 కి లేచ్చాను లైవ్ చూడాలని కూడ అనిపించలేదు సమయం కూడ అయిపోయింది కాని ఎందుకో సన్నిదానం లైవ్ చూసాను ఆశ్చర్యం ఆ సమయంలో కూడ మావారు లైవ్ లో కనిపించారు ఎంతో ఆనందించాను .బాబా , గురువుగారి అనుగ్రహం మా కుటుంబం మిద వుంది అనిపించి ఆనందించాను. మల్లి బాబా ఊది కూడా సమ్మరుద్దిగా ఒక గురుబందువు ద్వరా మాకు అందింది.

Prathibha sainathuni

Idi chaduvutunte naku poondi swami temple lo naku kaligina anubhavalu gurtostunnai…saibaba saibaba saibaba saibaba….

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles