Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
చైత్ర శుద్ధ చతుర్దశినాడు జన్మించిన పసిబిడ్డడికి మధురకవి అనే పేరు పెట్టారు తల్లిదండ్రులు.
పేరుకు తగ్గట్టుగానే అయన మధురమైన కీర్తనలు వ్రాసి, అతి మధురంగా గానం చేసేవాడు.
బాల్యమందే మహాభక్తుడై దేశ యాత్ర చేసాడు. ఒకసారి అయన అయోధ్యలో ఉండగా ఆకాశమున కాంతిపుంజాన్ని చూచాడు. అది కనిపించిన దిశగా ప్రయాణం సాగించాడు.
ఆ కాంతిపుంజం తిరుక్కురుగూర్ లో ఆగిపోయింది. ఆయన అక్కడున్న వృద్ధుడిని “ఈ ప్రదేశంలో వింత లేమైనా ఉన్నాయా?” అని ప్రశ్నించాడు.
గత 16 సంవత్సరాలనుండి కన్నులు తెరవక చింత చెట్టు తొర్రలో ఉన్న బాలకుని చూపాడు. ఆ బాలకుడు మహాత్ముడని తలచాడు.
శబ్దము చేసి ఆ బాలకుని కనులను తెరిపించాడు ఆయన. ఆ బాలుడే నమ్మాళ్వార్.
వయస్సు 16 సంవత్సరములు. ఆ బాలుడు మొదటిసారిగా చూచినది మధురకవినే.
“ప్రకృతిలో పుట్టిన జీవుడు దేనిని తిని, దేని యందుండును” అని ప్రశ్నించాడు మధురకవి. “దానిని తిని దానియందె ఉండును” అని సమాధానమిచ్చారు నమ్మాళ్వార్.
ఇంకా అనేక ప్రశ్నల నడిగారు మధురకవి. చక్కటి సమాధానాలు చెప్పారు నమ్మాళ్వార్.
ఇక నమ్మాళ్వారే తన ఆచార్యునిగా భావించాడు మధురకవి. అప్పటికి మధురకవి వయస్సు 60 సంవత్సరాలు.
దక్షిణామూర్తి కూడా యువకుడే. ఆయన వద్దకు జ్ఞానంకోసం వచ్చినవారు వృద్ధులే. వయసునకు జ్ఞానమునకు సంబంధము లేదు.
“ఈ రోజు మీ దివ్యానుగ్రహంతో నా పుణ్యం పండింది. నీవే నా తల్లివి, తండ్రివి, నీవే నా గురుడివి, నీవే నా దైవానివి, నీవే నా సర్వస్వం” అని ఆనందాశ్రువులతో నమస్కారం చేసాడు నమ్మాళ్వార్ కు మధురకవి.
ఇక మధురకవి నమ్మాళ్వారుల ద్రావిడ వేదాన్ని గానం చేస్తూ లోకాన్ని ఉద్ధరింపసాగాడు.
సాయివలె మధురకవికి గురువే సర్వస్వం. నమ్మాళ్వార్లను కీర్తిస్తుంటే కొందరు సహించలేక సమ్మాళ్వార్లను వచ్చి శంఖపీఠంపై కూర్చోమని సవాలు చేశారు.
ఆ శంఖపీఠం నమ్మాళ్వార్లను త్రోసివేయకపోతే, ఆయన గొప్పవారని నమ్ముతామని ఆ వ్యక్తులు తమ అభిప్రాయాన్ని చెప్పారు మధురకవికి.
నమ్మాళ్వార్లు ఎక్కడకురారని, ఆయనకు బదులు ఆయన రచించిన పాశురములలో ఒకదానిని వ్రాసి పెట్టెదనని చెప్పాడు మధురకవి.
నమ్మాళ్వార్ రచించిన ఒక పాశురాన్ని ఒక వైపు, ఇతరులు వ్రాసిన గ్రంథాలను వేరొక వైపు ఉంచారు.
ఇతరులు వ్రాసిన గ్రంథాలన్నీ త్రోసివేయబడి నమ్మాళ్వార్ పాశురమే నిలచింది. అందరూ నమ్మాళ్వారు గొప్పదనాన్ని శ్లాఘించారు.
తన గురువుల వైభవాన్ని గూర్చి 10 పాశురాలు మాత్రమే వ్రాశాడు మధురకవి. మధురకవి ఏ ఇతర రచనలను చేయలేదు.
ఆ గురు వైభవాన్ని తెలిపే రచనయే “కణ్ణినున్ శిరుత్తాంబు”. మధురకవి ఏ ఇతర రచనలను చేయలేదు. ఆ గురు వైభవాన్ని తెలిపే రచనయే “కణ్ణినున్ శిరుత్తాంబు”. గురువుకు దేవాలయాన్ని కట్టించాడు మధురకవి.
ఇతరులు విష్ణువును కీర్తించారు. ఆళ్వార్లు అయ్యారు. మధురకవి విష్ణువుని గాక, గురువును కీర్తించి ఆళ్వారుడయ్యాడు.
అంతటి గురు భక్తి మనకు కూడా అలవడు గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- వేదాన్ని తమిళం చేసిన మాఱన్…. మహనీయులు – 2020… మే 18
- ప్రసాదపు విలువ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 13
- దర్శనం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 25
- అహంకారం వద్దు .. …. మహనీయులు – 2020… డిసెంబరు 14
- సన్నుతించు వేళ…..సాయి@366 జూన్ 12…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments