Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“కొడుకు పుట్టాలి” అని సాయిబాబాను దర్శించి పుత్రులను పొందిన భక్తులెందరో ఉన్నారు.
కారియర్ ఉడైయసంగైలకు సంతానం కోసం నంబిని సేవించారు. “మేమే అవతరిస్తాం” అని అశరీరవాణి పలికింది.
పుత్ర జననమైంది. ఆ బిడ్డడు ఎడ్వడు, నవ్వడు, ఆహారం (తల్లి పాలు) తీసుకోడు, అవయవములను కదిలించడు.
ఆ దంపతులు ముందు భయపడ్డారు, తరువాత ఆశ్చర్యపోయారు. లోక విరుద్ధమైన ఈ ప్రవర్తనను చూచి పసి బిడ్డకు మాఱన్ అనే పేరు పెట్టారు. తమిళంలో మాఱన్ అంటే భిన్నుడు అని అర్ధం.
ఆ బిడ్డను ఆ దంపతులు తిరుక్కురుగూర్ లోని ఆదినాథస్వామిని దర్శించి, ఆ ఆలయ సమీపంలోని ఒక చింత చెట్టుకు ఉయ్యాలకట్టి, అందులో ఆ పసికందును ఉంచి “దేవా! నీవే బిడ్డకు రక్ష” అని వెళ్ళిపోయారు ఆ దంపతులు.
ఆ బిడ్డడు విష్వక్సేనుని అవతారం. గర్భంలో ఉన్న బిడ్డను శఠమనే వాయువు కమ్మివేస్తుంది.
కానీ ఆ బిడ్డడి హుంకారంతో ఆ వాయువు ఆ బిడ్డడి దరికి, తల్లి గర్భంలోకి రాక తప్పలేదు. అందువల్ల ఆయనను శఠకోపుడంటారు.
విష్వక్సేనుడే స్వయంగా విచ్చేసి తప్తచక్రాంకనాదుల్ని అనుగ్రహించాడు. లక్ష్మీ సమేతుడైన విష్ణువు దర్శనమిచ్చాడు.
తినెడి అన్నమును, త్రాగు నీరును, తాంబూలాది భోగ్య పదార్థములన్నియు కృష్ణుడే ఆయనకు.
108 దివ్య దేశములలో 34వ దివ్య దేశమందలి మూర్తులు ఆయనకు సాక్షాత్కరింపగా, ఆ దివ్య జ్ఞానము మనసున అనుభవించి, అది హృదయమునుండి వెలువడి వాగ్రూపమున దివ్య ప్రబంధమైంది.
వేదాల సారాన్నంతా తమిళంలో ఆయన పాశురాలలో కానవస్తాయి. ఆయనను ‘వేదాలను తమిళం చేసిన మాఱన్’ అంటారు.
ఈయన వద్దకు మధురకవి తనకు కనిపించిన కాంతిపుంజము ద్వారా చేరి, శిష్యుడై, గురువుగా భావించాడు.
మధురకవి నమ్మాళ్వార్ పై వ్రాసిన కేవలం 10 పాశురాములు 12 వేల సార్లు పఠించి, నమ్మాళ్వార్ దర్శనం పొందారు నాథముని.
నాథముని ఈయన విష్ణు భక్తుడైన ఆళ్వారుడే కాదు, ఆచార్యుడు కూడా.
ఆయన మహా విష్ణువును ఇలా కీర్తిస్తారు “అంతా ఆయనే, అందరూ ఆయనే, ఆస్తి ఆయనే, నాస్తి ఆయనే”…
ఆ స్వామి వర్ణనతో ఆయనకు తృప్తి లేదు. నాయికగా, చెలికత్తెగా, తల్లిగా ఆరాధించాడు.
నమ్మాళ్వార్ జన్మదినం వైశాఖ (సామాన్యంగా మే మాసంలో వస్తుంది) శుద్ధ చతుర్దశి.
“భగవంతుని సేవించండి. అతనికి ఆత్మార్పణం చేసుకోండి. అతని ఘనతను పొగడండి. అతని నామాన్ని జపించండి. మిమ్మల్ని అతడు రక్షిస్తాడు. కాపాడతాడు” అనేదే నమ్మాళ్వార్ సందేశం.
అందరికి మార్గం చూపే ఆ దివ్యకాంతిరేఖ సందేశాన్ని పాటిద్దాం! తరిద్దాం!!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సద్గురు వైభవం …. మహనీయులు – 2020… ఏప్రిల్ 11
- నల్లని వాడ! నేను ఫ్రెంచ్ మహిళనోయ్! …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 21
- స్కంధ! నాన్నశీర్వదించు…” …. మహనీయులు – 2020… ఆగస్టు 14
- పట్టించుకోవటం లేదు…..సాయి@366 నవంబర్ 14….Audio
- నాకెందుకు? …. మహనీయులు – 2020… మే 20
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments