స్కంధ! నాన్నశీర్వదించు…” …. మహనీయులు – 2020… ఆగస్టు 14



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అరుణగిరినాథుని గూర్చి చరిత్ర, సాహిత్యం, శాసనాలు చెబుతాయి. అవి వేర్వేరుగా ఉంటాయి. సాయినాథుని గూర్చి శాసనాలు లేకున్నా భక్తుల రచనలు కొన్ని కొన్ని అంశాలలో విభేదిస్తాయి.

అరుణగిరినాథుడు కుమారస్వామి భక్తుడు. అయన రచించిన తిరువు గళ్ భారతీయ వాగ్గేయకారులను ప్రథమ శ్రేణిలో నిలిపింది.

యవ్వనంలో కొంత పైలా పచ్చిసుగా తిరిగే వాడట ఆయన. ఒకసారి ఆయన తీవ్ర విచారగ్రస్తుడై ఉంటే ఒక సాధువు “దైవ ప్రార్థన చేసుకో, ఆయన కృపకు ప్రాతుడివిగా” అని చెప్పాడు. అలా చెప్పినది అరుణాచలేశ్వరుడంటారు.

ఆయన తీవ్రంగా ప్రార్ధించినా ఫలితం లేకుంటే, తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర ఆలయంలోని ఉత్తర గోపురం ఎక్కి క్రిందకి దూకాడు ఆత్మహత్య చేసుకుందామని.

కుమారస్వామి ఆయనను పడకుండా పట్టుకుని, నాలుకపై షడక్షరిని లిఖించి, తన ప్రశస్తిని గానం చేసి తరించ మన్నాడు. ఆ ప్రదేశం సుబ్రహ్మణ్యేశ్వర కోవెలగా అరుణాచలేశ్వరాలయంలో ఉంది.

ఇక అరుణగిరి నాథుని భక్తికి, భక్తి రచనకు అడ్డులేదు. వేల కొలది కీర్తనలు ప్రజల నాలుకపై నాట్యమాడాయి.

ఈయన కీర్తిని హరించలేని సంబంధన్ అనే ప్రౌఢదేవరాయల మంత్రి, సభలో అరుణగిరి నాథుని సవాలు చేశాడు – తాను అమ్మను సభలో దర్శింప చేయగలనని, అరుణగిరి నాథుడు కుమారస్వామిని సభలో దర్శింప చేయాలని, అరుణగిరి నాథుడు అంగీకరించాడు.

అరుణగిరినాథుడు ‘దేవేంద్రసంగవాకుప్పు” అనే గీతాన్ని పాడి అమ్మవారిని ప్రార్ధించి, సాక్షాత్కరింప చేయలేదు ఆ సభలో.

మరల ‘ఆతల సదా నారద’ అనే గీతాన్ని కుమారస్వామిని ఉద్దేశించి పాడాడు…

“స్వామి! రా! నెమలి వాహనంపై నృత్యం చేస్తూరా!

దేవీ దేవతల నాట్యం చేస్తూ వెన్నంటిరా!

ప్రౌఢదేవరాయ మహారాజు డెందం ఆనందంతో నాట్యమాడగా, రా…”

వెంటనే దివ్య కాంతులు వెదజల్లుతూ క్షణ కాలం దర్శనమిచ్చి అంతర్దానమైనాడు.

మరోసారి ప్రౌఢదేవరాయలు స్వర్గాన్నుండి పారిజాతం తెమ్మంటాడు అరుణగిరినాథుడిని.

గుడి (తిరువణ్ణామలై)లోన గోపురంలో తన దేహాన్ని భద్రపరచి, అరుణగిరినాథుడు చిలుక రూపం ధరించి, ఎగిరిపోయి, పారిజాత పుష్పాన్ని తీసుకుని తిరిగి అరుణగిరి గోపురం వద్దకు వస్తాడు (చిలక రూపంలో) అతని శరీరం కనబడదు.

అప్పుడు ఆ చిలుక రపంలో తిరుత్తణికి ఎగిరి వెళ్లి అక్కడ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి చిలుకగా ఉండిపోతాడు.

అరుణగిరినాథుని స్మారక తపాలా బిళ్లను భారత ప్రభుత్వం 14 – 8 – 1975న విడుదల చేసింది.

బ్రహ్మాండాలన్నీ ఆయనే, మాయ ఆయనే,

మాధవుడు ఆయనే,

స్కంధ! నీవాయన మేనడివి!

నన్నాశీర్వదించు……” అంటారు అరుణగిరినాథర్ తిరుప్పగళ్ లో

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles