Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా జీవిత చరిత్ర రచించిన హేమాడ్ పంత్. ఆది శంకరుడు, జ్ఞానేశ్వరులతోపాటు మధుసూధన సరస్వతి భగవద్గీతపై వాఖ్యానాన్ని లిఖించిన వారి సరసన పేర్కొన్నారు.
మధుసూధన సరస్వతి మహాజ్ఞాని, మహా మేధావి. మధుసూధన సరస్వతి పరిమితులు సరస్వతికి మాత్రమే తెలుసు, సరస్వతి పరిమితులు మధుసూధన సరస్వతికి మాత్రమే తెలుసుననే శ్లోకం వాడుకలో ఉంది.
మహనీయులు ఆ అహంకారాన్ని ఎదో విధంగా తొలగిస్తారు.
ఒకసారి మధుసూధన సరస్వతి శిష్యులకు బోధిస్తుండగా ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి అయన ప్రక్కన కూర్చున్నాడు. పైగా “మధుసూధనా…”అంటూ మాట్లాడసాగారు.
ఈ విషయం మధుసూధన సరస్వతి శిష్యులకు నచ్చలేదు. అయినా వారు ఏమీ చేయలేకున్నారు. “మధుసూధనా! నీవు జ్ఞానివై యుండి కూడా, ఇతరులతో వాదించటం మనుకున్నావా?’ అని ప్రశ్నించాడు ఆ అగంత వ్యక్తి. “లేదు” అని అన్నాడు మధుసూధనుడు.
“ఇతరులు ఓడినప్పుడు వారి మనస్సు బాధపడుతుంది కదా” అని కృష్ణ మంత్రాన్ని ఉపదేశించాడు.
మధుసూదనుడు కృష్ణ సాక్షాత్కారాన్ని పొందాడు.
అంతే కాదు, ఆయన అహంభావం అంతరించింది.
“కృష్ణుని తప్ప మరొక తత్వ మెరుగను” అంటారాయన.
“ధ్యానంలో ఇతరులు నిష్క్రియమైన జ్యోతిని చూస్తారేమో, మాకు మాత్రం, ఆ జ్యోతి యమునా తీరంలో పరుగు పెడుతూ, నీల (మాధవ) రూపంలో ఎల్లప్పుడు కన్నుల పండుగ చేయుగాక” అంటారాయన.
సాయి, ఆదిశంకరుల వలె మహాజ్ఞాని. అయినా భక్తి మార్గానికే వారు ప్రాముఖ్యం ఇచ్చారు. మధుసూధన సరస్వతి కూడా.
జ్ఞానంతో కానీ, ఇటు భక్తితో కాని సిద్దులు వస్తాయి. వాటిని స్వార్దానికి వాడుకోరు మహాజ్ఞానులు.
ఒకసారి మధుసూధన సరస్వతిని ఉత్కల దేశపు రాజైన ముకుందుడు దర్శించాడు.
ఆరాజు యొక్క భక్తి భావాన్ని మధుసూధనులు గ్రహించారు. 17 సంవత్సరముల నుండి ఉత్కల దేశంలో ఒక ప్రాంతం వర్షం లేక క్షామం బారిన పడ్డది.
“మీ రాజ్యంలో అన్నం సుభిక్షంగా ఉండుగాక” అని ఆ ముకుంద మహారాజును ఆశీర్వదించారు మధుసూధనలు. ఆ ఆశీర్వాదం ఫలించింది. క్షామం పోయింది.
ఆధ్యాత్మిక ఆకాశంలో సూర్యునిగా ఆదిశంకరులను పోలుస్తారు, ఇక చంద్రునిగా మధుసూధనుని పోలుస్తారు.
ఆయన గూర్చి తేదీ వివరాలు లభించలేదు.
ఆయన భగవద్గీతకు వ్యాఖ్యానాన్ని ‘గుడార్దా దీపిక’ అనే పేరుతొ రచించారు.
మధుసూధన సరస్వతులను స్మరించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- (అ) ద్వితీయుడు…. మహనీయులు – 2020…ఫిబ్రవరి 16
- ప్రార్దించు! …. మహనీయులు – 2020… జూలై 14
- మరో వాల్మీకి …. మహనీయులు – 2020… అక్టోబరు 23
- మధ్యముడు.. …. మహనీయులు – 2020… డిసెంబరు 22
- శ్రీ దత్త శరణం మమ…. మహనీయులు – 2020… సెప్టెంబరు 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments