Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
;Voice support by: Mrs. Jeevani
దాసగణు పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగానికి రాజీనామా చేయమన్నారు సాయి.
ఇదిగో, అదిగో అంటూ కాలం గుపుతున్నాడే కాని, రాజీనామా చేసే ఉద్దేశం లేదాయనకు.
చివరకు ఎలాగయితేనేం, చేస్తున్న ఉద్యోగమే కాకుండా, పరువు ప్రతిష్టలు పోయేటట్లుంటే, ఉద్యోగానికి రాజీనామా చేశాడు.
సాయిబాబా దగ్గరకు వచ్చి ”నాకిక జీవనాధారమేమిటి?” అని ప్రశ్నించాడు. నారు పోసిన దైవం నీరు పోయును గదా.
సాయి అతనిని ”నాందేడ్ పొమ్ము” అన్నాడు. ఆయన యోగక్షేమాలను సాయియే చూచాడు.
రామచంద్ర సీతారాం దేవ్‌ను బాలాభావ్ లేదా బాలా భట్ అని పిలుస్తారు. ఒక స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేసేవాడు.
వేడి నీళ్ళకు చన్నీళ్ళు తోడన్నట్లు ఆయన స్టాంప్ వెండర్ (స్టాంపులనమ్మే వాడుగా) పనిచేసే వాడు.
దానితో కొంత ఆదాయం వచ్చేది. అతడు అక్కల్‌కోట మహారాజ్ భక్తుడు. అమీర్ షక్కర్ అనే సాయి భక్తుడు ఆయనకు సాయిని గూర్చి చెప్పాడు.
ఒకసారి బాలాభావ్ అక్కల్‌కోట వెళదామనుకుంటుంటే అమీర్ షక్కర్ ”దారిలోనే షిరిడీ ఉన్నది. సాయిబాబాను దర్శించి అక్కల్‌కోట వెళ్ళవచ్చును” అనే సలహా ఇచ్చాడు.
ఆ సలహాను ఆయన పాటించాడు. సాయి బాబా అతని వంక చూచి ”నేను వెంటనే అక్కల్‌కోట వెళ్ళాలి” అన్నారు.
సాయినాథుని శక్తికి ముగ్దుడైనాడు. ఆయన సాయి సన్నిధిలో ఆనందాన్ని పొందేవాడు. ఇక సాయిబాబా భక్తుడైనాడు.
తరచు షిరిడుకి వెళ్ళి సాయిని దర్శించే వాడు. సెలవు పెట్టి షిరిడీ వెళ్ళవలసి వచ్చేది. పాఠశాల వారికి ఇది నచ్చక తాఖీదులు ఇచ్చేవారు.
పరిస్థితి ఎలా వచ్చిందంటే సాయి సన్నిధిని కోరుకోవాలో, ఉన్న ఉద్యోగాన్ని (ఉపాధ్యాయ) వదులు కోవాలో నిర్ణయించుకొనవలసి వచ్చింది.
సాయి కోసం, సాయి సన్నిధి కోసం చేస్తున్న ఉపాధ్యాయ ఉద్యోగాన్ని వదలి వేశాడు. అది ఆయన భక్తి.
ఇక జీవనము స్టాంపుల అమ్మకం వలననే. ఆర్థిక పరిస్థితి బాగానే ఉండేది అని ఆయన సెప్టెంబరు 18, 1936న చెప్పాడు.
ఆయన 5 వాటాల గృహం నిర్మించ దలచి బాబాను అనుమతి వేడగా బాబా నేల మీద 25 గీతలు గీసి ”ఒకొక్క గీతకు రూపాయి చొప్పున రూ.25/ దక్షిణ ఇవ్వు” అని రూ.25/ తీసుకున్నారు.
అతనికి బాబా భావం అర్థమైంది. ఉన్న డబ్బుతో 5 వాటాల గృహం కట్టినా అలా 25 వాటాల గృహాం అయింది. ఇది సాయి అనుగ్రహం అంటే. బాబాకు కావలసినది భక్తి మాత్రమే.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పేరు మార్పు – అంతే …..సాయి@366 జూలై 25…Audio
- మాటే .. మంత్రం ….సాయి@366 సెప్టెంబర్ 13….Audio
- షిరిడీ పెరటిలోని చెట్టు…..సాయి@366 జూన్ 19….Audio
- గ్యారా సాల్ బాద్ ….సాయి@366 సెప్టెంబర్ 19….Audio
- శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments