Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
నా పేరు మీనాక్షి, మాది విజయవాడ. మావారు Fire Staion లో పని చేస్తారు.
ఆయన ఉద్యోగరిత్యా కృష్ణాజిల్లాలోనే ఊళ్ళు తిరుగుతూ చివరకి పిల్లల చదువుల రిత్యా విజయవాడలో స్టిరపడ్డాము. మాకు ఇద్దరు అబ్బాయిలు.
మేము చిన్నపిల్లలుగా వున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళం అందరం కలిసి యాత్రలకి వెళ్ళాము చిన్నపిల్లలం అంటే మరీ పసి పిల్లలప్పుడుకాదు.
యుక్త వయసు వచ్చిన తర్వాతే మేము ముగ్గురం అక్కాచెల్లెళ్ళము, నాకో తమ్ముడూ, ఇంటికి నేనే పెద్దదాన్ని ఆ సమయంలో ‘ శిరిడి’ వెళ్ళేటప్పటికి నాకు పిరియడ్స్ అడ్డు వచ్చింది.
అందుకని మా కుటుంబం అంతా కూడా ‘“బాబా’ దర్శనం చేసుకోలేదు. బాబా అనుమతిలేనిదే ‘ శిరిడి’ వెళ్ళినా కూడా మేము ఆయన దర్శనం చేసుకోలేక పోయాము.
ఆ తర్వాత నా వివాహం అయ్యిం తర్వాత చాలా రోజులకి నేను, మా వారు పిల్లలం కలసి ఎవరిదో చట్టాలది పెళ్ళికి వెడుతున్నాము.
బస్సులో మాకు తెలిసిన మావారి స్నేహితుడు ఒకాయన కనిపించాడు. ఆమాట ఈమాటా మాట్లాడుతూ,
మావారు నాకు ఉద్యోగంలోనూ జీతంలోనూ పెద్దగా ఏమీ ఎదుగుదల లేదండి! ఏదో రొటీన్ గా వుంటోంది పిల్లలు ఎదుగుతున్నారు. అంటూ మావారు ఆయనతోటి ఏకరువుపెట్టుకున్నారు.
ఆయన’అయ్యో అలాగా నెహ్రుగారూ, మీరు ఒకపని చేయండి సాయిబాబాను నమ్ముకోండి. నేను నమ్మి బాగుపడ్డాను మీరూ ఆయన్ని నమ్మి కొలిస్తే మీ కష్టాలన్నీ ఆయన చిటికెలో తీరుస్తాడు అన్నాడు.
సరే అని ఈ లోపుల మేము దిగవలసిన స్టేషన్ వచ్చింది, దిగాము అక్కడ పెళ్ళి, చూసుకొని తిరిగి విజయవాడ వచ్చాక అక్కడ 15 కిలొ మీటర్ల దూరంలో సాయిబాబా’ గుడి కడుతున్నారని తెలిసింది.
మాకు బస్సు లో కనబడిన ఆయన చెప్పాడు కాబట్టి ఒకసారి చూద్దాం అని తెల్లవారురూమున. 4 గంటలకి లేచి ఏదో ఒక ప్రసాదం తయారు చేసుకొని బాబా కోసం తీసుకుని వెళ్ళే వాళ్ళం. అలా ప్రతి గురువారం ఉపవాసం వుండి ఆగుడికి వెడుతూండే వాళ్ళం.
మావారికి విజయవాడ నుండి జగ్గయ్యపేట ట్రాన్ఫర్ అయింది. అక్కడ నుండి వచ్చేటప్పుడు మాకు తెలిసిన ఒకావిడ నన్ను పిలిచి బొట్టు పెట్టి, తాంబూలం ఇస్తూ “ఇంట్లో ఏమి లేవు మీరు ఊరు నుండి వెళ్ళిపోతున్నారు ఏదయినా ఇచ్చి పంపించాలని అనుకున్నాను”అని,
ఇల్లాంతా తిరిగి చివరికి దేవుడి గది లోకి వెళ్ళి అక్కడ నుండి ఒక పుస్తకం తీసుకు వచ్చి కొంగు పట్టమని తాంబూలం తీసుకు వచ్చి తాంబూలంతో పాటు ఆపుస్తకం కూడా కొంగులో పెట్టింది. “నేను ఈ పుస్తకం చదివాను, మీరు కుడా చదవండి” అంది. ఆవిడ ఇచ్చిన ప్రస్తకం ‘శ్రీ సాయి సచ్చరిత్ర.
“ఈవిడ నాకీ పుస్తకం ఇచ్చిదేంటి? నేను ఎప్పడు చదవాలీ” అనుకున్నాను. అప్పటికి నాకు’శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం విశిష్టత తెలియదు:
జగ్గయ్యపేట వచ్చిన తరువాత, ఆపుస్తకం అప్పుడప్పుడు గుర్తుకు వచ్చి చదువుదామని ఎప్పడు ప్రయత్నించినా నావల్ల అయ్యేది కాదు.
జగ్గయ్యపేటలో మాఇంటి వెనుకనే “సాయిబాబా” గుడి వుంది. మాఇంటి ఓనర్ గుడికి వస్తారా? అని ఆడిగింది. సరే అని వెళ్ళాను
అప్పడు ప్రదక్షిణలు చేస్తారా? అని అడిగింది. నేను రోజూ 108 ప్రదక్షిణలు, ఆవిడ మాల తిప్పతుండేది, నేను ఆవిడా ఇద్దరమూ ఒక మూడు రోజులు కలిసి చేసాము.
ఆ తర్వాత నుండి అలవాటయ్యింది. నేనే ఏదో ఒక సమయంలో గుడికి వెళ్ళి 108 ప్రదక్షిణలు చేసి వచ్చేదాన్ని అలా నేను చాలా రోజుల పాటు 108 ప్రదక్షిణలు చేశాను.
మాఇంటి దగ్గర ఎవరో స్థలం అమ్ముతున్నారు అది చూసి మా ఇంటి ఓనరేమో “మీనాక్షీ! మీరు కూడా ఒక స్థలం ఎందుకు కొనుక్కోకూడదు” అంది,
“ఊరుకోండి! మేము స్థలము కొనుక్కోవటం ఏమిటి మీకు ‘తెలుసు కదండీ మా ఆదాయం అదీను”, అక్కడ మావాళ్ళు ఎవరూ దగ్గర లేకపోవటాన ఇంటి ఓనరు గారు పెద్దాఆవిడ, ఆవిడని కన్న తల్లిలాగా భావించి అన్నీ చెప్పుకోవటం, ఆవిడ మాకు తగిన సలహాలు ఇవ్వడం జరుగుతూందేది.
డబ్బులు లేకపోతే ప్రస్తుతం నీదగ్గర వున్న నగలు Bank లో తాకట్టు పెట్టి అయినా కొనుక్కుంటే, నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడా నగలు విడిపించుకోవచ్చు, మళ్ళీ ఈస్థలం ఇంత తక్కువ ధరకి రమ్మంటే రాదు చూడమ్మాయి! ఆలోచించుకో అందావిడ.
నేను మావారు వచ్చాక విషయం అంతా చెప్పాను. ఆయన నవ్వి ‘మన దగ్గర దబ్బులు ఎక్కడ వున్నాయి మీనా” అన్నారు.
‘లేదండీ! పిన్నిగారు ఇలా నీకు స్థలం వచ్చేస్తుంది నగలైనా తాకట్టుపెట్టి తీసుకోమని చెబుతున్నారు అన్నాను. అదేమీ వద్దు కానీ ‘నీదగ్గరేదయినా వుంటే చూడు నువ్వు డబ్బు పట్టు కురా కోనేసుకుందాం’ అన్నారు చలోక్తిగా.
మా వారు చలోక్తిగా అన్నా కూడా, నాలో డబ్బు నిజంగా ఎక్కడ నుండి వస్తుందా అన్న ఆలోచన ఎక్కువైంది.
“బాబాని కోరుకున్నాను “బాబా నువ్వే ఒక దారి చూపించు ఆవిడ ఎందుకందో స్థలం గురించి కొనుక్కుంటే బాగానే వుంటుంది మరి నువ్వే ఏదో ఒక మార్గం చూపించు బాబా అనుకున్నాను.
నాకు వెంటనే హైదరాబాద్ లో వున్ననా స్నేహితురాలు శేషు గారు గుర్తుకువచ్చారు, ఆవిడ దగ్గర ఇది వరకే నేను చిట్టిలు వేస్తున్నాను,
ఆవిడకి ఫోన్ చేసి “ఒక స్థలం తీసుకోవాలనుకుంటున్నాం మీరు ఈ నెల చిట్టి డబ్బులతో పాటుగా కొంత ఎమౌంట్ కలిపి ఇవ్వగలరా?” అని అడిగాను, ఆవిడ వెంటనే ‘సరే ఇస్తాలే మీనాక్షి అంది.
అంతే మా వారికి చెప్పాను, పేపర్స్ రెడీ చేసుకున్నాము. ఈ లోపు ఏమయిందో ఏమో శేషు గారు ఫోన్ చేసి “మీనాక్షి! డబ్బులు నేను సర్దుబాటు చెయ్యలేను, నాకు కుదరదు నేను మీకు ఎమౌంట్ ఇవ్వలేను” అన్నారు.
మేము నీరుగారి పోయాము ఏవస్తువు అయినా రాదు వద్దు అనుకున్నంత సేపూ ఏమి వుండదు, వస్తుంది కావాలి అనుకున్నాక అది చేతికి రాకపోతే చాలా బాధగా వుంటుంది.
నేను ఏడ్చుకుంటూ ‘బాబా’ గుడికి వెళ్ళిపోయి “ఏమిటి బాబా ఇలా అయింది. మాకా స్థలం ఇప్పించు. నేను నీ ‘సచ్చరిత్ర పారాయణం చేస్తాను”అని అనుకున్నాను.
ఇంటికి వచ్చాక శేషుగారు మళ్ళీ ఫోన్ చేసి “మీనాక్షి ఎరేంజ్ మెంట్స్ చేసుకోండి డబ్బు దొరికింది రడీగా వుంది అని చెప్పింది,
అంతే టకటకా మిగతా ఏర్పాటులన్నీ అయిపోయాయి, హైదరాబాద్ వచ్చి డబ్బులు మా వారు తీసుకుని వచ్చారు, రిజిస్టేషన్ అయి పోయింది,
ఆకాగితాలు తీసుకొని వెళ్ళి ‘బాబా పాదాల ముందుంచి మా భార్య భర్తల మిద్దరం కళ్ళనీళ్ళు పెట్టుకున్నాము, మమ్మల్ని స్థల యజమానులను చేసాడు “బాబా” అని చాలా సంతోషించాము,
The above miracle has been typed by: Sreenivas Murthy Muppalla
Latest Miracles:
- రెండు కుటుంబాల మధ్య ఉన్న పెండ్లి అడ్డంకులు, సచ్చరిత్ర పారాయణతో తొలగిపోవుట.
- దిల్ సుఖ్ నగర్ బాబా గుడి విగ్రహ ప్రతిష్ట కు ఉన్న అడ్డంకులను తొలగించిన బాబా వారు
- బాబా సచ్చరిత్ర పారాయణ వల్ల తమ్ముడు తమ్ముడి జాడ తెలిసింది-4
- బాబా వారి సత్సంగ మహిమ ద్వారా “చైనా ప్రభుత్వము వారు మా మరిదిని విడుదల చేయట.”—-Audio
- సమస్యలలో ఉన్న తన తోటి సాయి భక్తులకు సచ్చరిత్ర, సహస్రనామ పారాయణ ద్వారా పరిష్కారం చూపించిన రాజేశ్వర రావు గారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments