ఓవి అనువాదం అయిపోయి నా కంప్యూటర్ స్క్రీన్ మీద అదే వచ్చేసింది.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిరాం.

అఘటిత లీల సాయిది.

అసలు నేను చెప్పాలంటే కవిని కాదు,రచయితను కాదు.

అయిన మూల మరాఠి గ్రంథం (పద్యాలు) శ్రీ సాయి సచ్చరిత్రను హిందీలోకి అనువాదం చెయ్యాలన్న ప్రేరణ ఎలా జరిగింది.చాలా ఆశ్చర్యజనకం.నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

నా జీవితం అంతా కష్టపడుతూనే గడిచిపోయింది.

నా చదువు 10 వ తరగతి వరకే.నేను 11 సం||ల అప్పుడు నాన్న మమ్మల్ని వదిలి స్వర్గస్తులైరి.

మా పెద్దన్నయ్య,మేము నలుగురు తమ్ముళ్ళు.అయినా మా అన్నయ్య మమ్మల్ని తండ్రిలాగా చూసుకునేవారు.

ఆయన ఇచ్చిన సంస్కారం వల్లనే నేను ఇప్పుడు ఇలా రాయగలుగుతున్నాను.

మాకు 1970 వరకు సాయిబాబా తెలీదు,అసలు నమ్మేవాళ్ళం కాదు.

మేము ఒకే కుటుంబంగా వుండి వ్యవసాయం చేసుకునేవాళ్ళం.మాకు tobacco షాపు ఉండేది.

తరువాత మాకు కిరోసిన్ ఏజెన్సి కూడా ఇచ్చారు.వాళ్ళు మాకు మేము ఉండే హింగనఘట్ నుంచి 13కి.మీ దూరంలో national highway chowk దగ్గర పెట్రోల్  పంపు పెట్టుకోండి అన్నారు.

ఇంతలో అక్కడికి ఇంకో party వాళ్ళు కూడా వచ్చి “మాకు ఇవ్వండి ఆ స్థలం అన్నారు”.ఇంక మేము మాకు రాదులే అనుకున్నాం.

ఇంతలో ఒక సాయిబాబా భక్తుడు “అంబాదాస్” అనే ఆయన మా షాపుకు వచ్చేవాడు.

అతను చెప్పాడు మీరు సాయిబాబాకు మొక్కుబడి పెట్టుకోండి,తప్పకుండా పెట్రోల్ pump కోసం ఆ స్థలం మీకే వస్తుంది అని చెప్పాడు.

అయినా మేము ముందు నమ్మలేదు.మమ్మల్ని బలవంతంగా ఆయన నమ్మించాడు.

సాయి చరిత్ర పారాయణ చేసాం.అపుడు ఏ కష్టం లేకుండా ఆస్థలం మాకే వచ్చింది.అప్పటినుంచి మేము బాబా భక్తులం అయ్యాం.

కాలక్రమంలో మేము అందరం విడిపోయి మా సొంత వ్యాపారాలు పెట్టుకున్నాం.

నేను motor mechanic పని start చేసాను.mechanic పని నాకు ఇష్టం ఉండేది ముందు.కాని ఇపుడు అదే నా జవనాధారమైంది.

ఇలా మొదలై మెల్లగా చిన్న చిన్న కాంట్రాక్టర్ పనులు,canteen కూడా నడిపేవాడిని.

నా పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు,పెళ్ళిళ్ళు చేసాను.ఇంతలో నాభార్య స్వర్గస్తురాలు అయింది.

ఇంక ఒంటరి జీవితంలో సాయిబాబానే తోడు,నీడగా నిలిచారు.

బాబా ప్రేరణ వలన “ధర్మ”, ”శ్రీమద్భాగవతం” పుస్తకాలు రాసాను.

అపుడు బాబా ప్రేరణ వలన నాకు ఒకరోజు అనిపించింది,బాబా గురించి హిందీలో మంచి సాహిత్య గ్రంథాలు లేవు,అన్నీ మరాఠి ,గుజరాతి లోనే ఉన్నాయి.

అందుకే హిందీ భాషా ప్రజలకోసం హేమాడ్ పంత్ రాసిన  ఓవి to ఓవి సాయిసచ్చరిత్ర హిందీలోకి అనువదిస్తాను అనుకున్నాను.

నేను గుజరాతీ సాయిచరిత్ర నిత్య పారాయణ చేసేవాడిని.అంతలోనే బాబా ప్రేరణ వలన హిందీలో అనువదించడానికి మొదలుపెట్టాను. ఓవి to ఓవి మరాఠీ సాయిసచ్చరిత్ర లో ఆరంభంలోనే జ్ఞానేశ్వర్ మహరాజ్ ఓవి ఉంది.

నేను ఆశ్చర్యపోయాను.ఇది ఎలా అనువదించను అని.నాకు బాబా పెద్ద పరిక్ష పెట్టారు అనుకున్నాను.

అయినా బాబా స్మరణ చేస్తూ అనువాదం చేస్తూ ఉన్నాను.

ఇంతలో నా కలం ఒక పదం దగ్గర ఆగిపోయింది.ఆ శబ్దం జ్ఞానానలీ.దాన్ని హిందీలో చూస్తే “జ్ఞాన కి నలికా”.అంతే నేను దాని గురించి విచారిస్తూ కూర్చున్నాను.దీనికి నలీ  శబ్దం ఎలా కుదురుతుంది?అని ఆలోచిస్తూ కళ్ళు మూసుకున్నా.

15ని||గడిచిపోయింది.ఏమి చేయాలో తెలీలేదు.అపుడు అనుకున్నాను ఇంక ఇక్కడే ఆపేస్తాను.తరువాత చూస్తాలే అనుకోని నా కంప్యూటర్ shutdown చేద్దామనుకున్నాను,ఇంతలో ఆశ్చర్యంలో కెల్ల ఆశ్చర్యం ఆ ఓవి అనువాదం అయిపోయి నా కంప్యూటర్ స్క్రీన్ మీద అదే వచ్చేసింది.

(మాధవి,భువనేశ్వర్:నాకు ఇక్కడ మన పోతన భాగవతం,అలవైకుంఠపురంబు లో అని రాసి పాపం ఇంక తెలీక పోతన వెళ్ళిపోతాడు.అపుడు మన స్వామి ఆ రామచంద్రుడే పోతన వేషంలో వచ్చి అలవైకుంఠపురంబులో,ఆమూల సౌదంబులో అని రాయడం నాకు గుర్తు వస్తా ఉంది.మన బాబా కూడా ఆ శ్రీరామచంద్రుడే.)

హిందీలో జ్ఞానానలీ అంటే జ్ఞానికి నలికా.కాని నిజానికి అది జ్ఞానానల్ ఎలాగంటే దావానల్ లాగా.అపుడు అనుకున్నా ఓహో ఇది బాబానే రాసారు అని. ఆ గ్రంథం మొత్తం హిందీలో అనువాదం బాబా కృప వలన అయిపోయింది.

కాని గ్రంథం అయితే అయింది కానీ నాకు వ్యాకరణం సరిగ్గా రాదు.అది కూడా బాబానే చమత్కారం చేసారు.

ఒకరోజు దిలీప్ పవార్ ఆయన మరాఠీ లో భావార్థశ్రీసాయిసచ్చరిత్ర రాసారు.దానిని ఆయన హిందీలో ఎవరన్నా చెయ్యగలరా అని వెతుకుతూ నా దగ్గరికి వచ్చారు.

ముందు మేము అపరిచితులమే.నా హింది సాయిసచ్చరిత్ర చూసి వ్యాకరణం సరిచేసారు.చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు.

కానీ ఓవీలను మూడున్నర చరణాలు ఉంటాయి అని చెప్పి నా హింది రచనలో దాన్ని సరిచేసారు.

శ్రీ దిలీప్ పవార్ సహాయంతో నా హింది సాయిసచ్చరిత్ర బాబా అనుగ్రహంతో పరిసమాప్తి అయింది.

ముందు జ్ఞానేశ్వర్ మహరాజ్ ఓవీ నుండి చివర మూడున్నర చరాణాల ఓవీల వరకు అంతా వ్యాకరణంతో సహా బాబానే నా చేత రాయించారు.

నా జన్మ ధన్యం చేసారు.

Ramesh Hinganghat

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్.

సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా         …         సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

4 comments on “ఓవి అనువాదం అయిపోయి నా కంప్యూటర్ స్క్రీన్ మీద అదే వచ్చేసింది.

నాకు కూడా ఇదే విధము గా ఒక అనుభవము జరిగింది.saileelas.com వెబ్సైటు డిజైన్ చేసిన తర్వాత, ఆ కంటెంట్ సర్వర్ లో అప్లోడ్ చేసేటప్పుడు సడన్ గా నా laptop ఓపెన్ అవ్వలేదు. నేను చాల బాధపడ్డాను..ఇదేమిటి బాబా ఇలా చేసావు అని…ఇక నేను చేసింది ఏమి లేదు అని లాప్టాప్ ముందు తలా పెట్టి పడుకున్నాను…అప్పుడు one minute తరవాత..నా లాప్టాప్ లో నుంచి sudden ఒక వెలుగు వచ్చింది..
ఆశ్చర్యము ఏమిటి అంటే ..laptop దాని అంతటికి థానే ఓపెన్ అయి…laptopఅంత వైరస్ స్కాన్ అయింది..ఆ తర్వాత ఆ ఫైల్స్ అన్ని నేను సర్వర్ లో అప్లోడ్ చేశాను..
నాకు చాల బాబా వారి లీల చాల అద్భుతము అనిపించింది.

meeku baba help chesthunadu naku anduku help cheyatam ledu arthm kavatam ledu

Sreenivas

Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba…Sai Baba

Maruthi Sainathuni

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై.
సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా…సాయి బాబా
బాబావారి లీలలు చాలా అద్భుతము.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles